Saffron Flower For Pregnant : పాలలో కుంకుమపువ్వు కలిపి తాగితే తెల్లగా పుడతారా? ఇందులో నిజమేంత?
Saffron Flower For Pregnant Ladies : బిడ్డ తెల్లగా పుట్టాలంటే.. కుంకుమపువ్వు తీసుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ప్రెగ్నెన్సీ సమయంలో కుంకుమపువ్వు తీసుకుంటే తెల్లగా పుడుతారని ప్రాచీన కాలం నుంచి చెబుతుంటారు. ఇది నిజంగా జరుగుతుందా?
గర్భం అనేది స్త్రీ జీవితంలో అత్యంత అందమైన దశ.. చాలా ముఖ్యమైనది కూడా. ఈ సమయంలో తన ఆరోగ్యం, ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కడుపులో బిడ్డ ఎదుగుదల కోసం తల్లి అన్ని రకాల పండ్లు, కూరగాయలు(Vegetables) తీసుకుంటుంది. అదే సమయంలో ఈ సమయంలో కొన్ని వింత విశ్వాసాలు కూడా కనిపిస్తాయి.
కొంతమంది స్త్రీలు ఫెయిర్ స్కిన్ ఉన్న బిడ్డ పుట్టేందుకు కుంకుమపువ్వును(Saffron Flower) తీసుకుంటారు. వాస్తవానికి పురాతన కాలం నుండి కుంకుమపువ్వు పాలు తాగాలనే సలహా పాటిస్తూ ఉన్నారు. ఇది నేటికీ అనుసరిస్తున్నారు. కుంకుమపువ్వు పాలు తాగడం వల్ల బిడ్డ తెల్లగా మారుతుందా? లేక అపోహ మాత్రమేనా అనే ప్రశ్న కొంతమందికి ఉంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం గర్భిణి కుంకుమపువ్వు పాలు తీసుకోవడం వల్ల బిడ్డ తెల్లగా మారుతుందనేమీ లేదు. బిడ్డ తెల్లగా ఉన్నాడా లేక నల్లగా ఉన్నాడా అనేది పూర్తిగా మెలనిన్, జన్యువులపై ఆధారపడి ఉంటుంది. శరీరంలో మెలనిన్ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, చర్మం నల్లగా మారుతుంది. అయితే మెలనిన్ సమతుల్య మొత్తం చర్మం రంగును తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది.
కుంకుమపువ్వు, పాల(Saffron Flower and milk) గురించి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ దాని వల్ల ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల శిశువు తెల్లగా మారుతుందని ప్రజలు అనుకుంటారు. గర్భధారణ సమయంలో ఏదైనా తాగడానికి ముందు మీరు వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే మీరు చాలా సార్లు ఏదైనా తప్పు తీసుకుంటే.. అది మీకు హాని కలిగించవచ్చు.
గర్భధారణ సమయంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా మూడ్ స్వింగ్స్(Mood Swings) సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా కోపం, చిరాకు, ఏదైనా వెంటనే ఏడవడం వంటి అనేక సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో కుంకుమపువ్వు మూడ్ స్వింగ్‌లను నియంత్రించడంలో సహాయపడుతుంది.
కుంకుమపువ్వు యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. దీని వినియోగం సెరోటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు సమస్యలు సాధారణం, అటువంటి పరిస్థితిలో కుంకుమపువ్వు తీసుకోవడం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
గర్భధారణ సమయంలో మహిళలు గ్యాస్ట్రిక్, అజీర్ణం, వాంతులు వంటి జీర్ణ సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ఈ సమయంలో జీర్ణక్రియ మందగిస్తుంది. అటువంటి పరిస్థితిలో కుంకుమపువ్వు జీవక్రియను పెంచుతుంది. అంతే కాదు కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి(Immunity) సైతం పెరుగుతుంది.