green mango juice: మామిడి కాయతో షర్భత్ చేసేయండిలా..-process of making healthy green mango juice or mango panna ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Green Mango Juice: మామిడి కాయతో షర్భత్ చేసేయండిలా..

green mango juice: మామిడి కాయతో షర్భత్ చేసేయండిలా..

Koutik Pranaya Sree HT Telugu
Apr 25, 2023 05:00 PM IST

green mango juice: సాయంత్రం వేళ ఆరోగ్యంగా ఉండే చల్లని పానీయం కోసం చూస్తున్నారా. అయితే మామిడి కాయలతో షర్భత్ చేసి చూడండి.

మామిడి కాయలతో షర్బత్
మామిడి కాయలతో షర్బత్ (pexels)

మామిడి కాయలు దొరికే సమయంలో సాయంత్రం పూట ఒక చల్లని పానీయం కూడా వాటితోనే తయారు చేసుకుంటే బాగుంటుంది కదా. అలాంటిదే ఆమ్ పన్నా లేదా మామిడి కాయ షర్బత్. దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావాల్సినవి:

మామిడి కాయలు - రెండు

పంచదార - కప్పు

ఉప్పు - చిటికెడు

నీళ్లు - అర లీటరు

తయారీ విధానం:

ముందుగా కుక్కర్‌లో మామిడికాయలు మునిగే అన్ని నీళ్లు పోసి 4 విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. కాసేపయ్యాక మామిడి కాయలు బయటకు తీసి, తొక్క తీసేయాలి. గుజ్జును మాత్రమే తీసి పక్కన పెట్టుకోండి. మామిడి కాయలు ఉడికించిన నీళ్లలో తగినంత పంచదార కలుపుకొని పక్కన పెట్టుకోండి. మామిడికాయ గుజ్జులో పంచదార కలుపుకొని పెట్టుకున్న నీళ్లు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. పులుపు, తీపి మీకు సరిపోయేట్లు చూసుకుని మరిన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చు. దీన్ని చల్లగా తాగితే బాగుంటుంది. కాసేపు ప్రిజ్ లో పెట్టుకుని తాగితే ఇంకా బాగుంటుంది. ఈ వేసవి దాహాన్ని తీర్చే చల్లని పానీయం ఇది.

Whats_app_banner