Priyanka Chopra: పాదాలపై వెల్లుల్లిని రుద్దుకుంటున్న ప్రియాంక చోప్రా, ఇలా చేయడం వల్ల ఉపయోగాలేంటో తెలుసుకోండి-priyanka chopra rubs garlic on her feet know the benefits of doing this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Priyanka Chopra: పాదాలపై వెల్లుల్లిని రుద్దుకుంటున్న ప్రియాంక చోప్రా, ఇలా చేయడం వల్ల ఉపయోగాలేంటో తెలుసుకోండి

Priyanka Chopra: పాదాలపై వెల్లుల్లిని రుద్దుకుంటున్న ప్రియాంక చోప్రా, ఇలా చేయడం వల్ల ఉపయోగాలేంటో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Jun 28, 2024 04:30 PM IST

Priyanka Chopra: ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో స్థిరపడినా ఇంకా దేశీ పద్ధతులనే పాటిస్తోంది. ఆమె పాదాలపై వెల్లుల్లి రుద్దుతూ పోస్టు పెట్టింది. దాని వల్ల కలిగే లాభాలను కూడా ప్రియాంక అభిమానులకు తెలియజేసింది. అరికాళ్లపై వెల్లుల్లి రుద్దడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి.

ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా హాలీవుడ్ కోడలిగా మారిపోయాక విదేశాల్లోనే సెటిలైపోయింది. మనిషి అక్కడ ఉన్నా కూడా ఆమె హృదయం మాత్రం ఇంకా పూర్తిగా దేశీ. అందుకే ఆమె బ్యూటీ టిప్స్ త్వరగా వైరల్ అవుతాయి. తాజాగా దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా ఇన్ స్టాగ్రామ్ లో చాలా ఫోటోలను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె భర్త నిక్ జోనస్, కుమార్తెతో కలిసి కనిపిస్తుంది. ఒక వీడియోలో ఎవరో ప్రియాంక పాదాల అరికాళ్లలో వెల్లుల్లిని రుద్దుతున్నారు. ఈ వీడియోను చూసిన చాలా మంది దీని ప్రయోజనాల గురించి ప్రియాంక చోప్రాను ప్రశ్నించారు. దీనిపై ప్రియాంక చోప్రా కూడా స్పందించారు.

వెల్లుల్లి వల్ల ఉపయోగాలు

వెల్లుల్లిని ఇలా పాదాలపై రుద్దడం వల్ల జ్వరం, వాపు తగ్గుతుందని ప్రియాంక చోప్రా చెబుతోంది. యాక్షన్ మూవీ షూటింగ్ లో పాల్గొనడం వల్ల ఆమె చేతులు, కాళ్లకు చిన్న చిన్న గాయాలయ్యాయి. ఆ గాయాల వల్ల అయ్యే నొప్పులు తగ్గడానికి వెల్లుల్లిని ఉపయోగించుకోవచ్చు.

పాదాలపై వెల్లుల్లిని రుద్దడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పాదాలపై ఉండే ఫంగస్ ను తొలగించడానికి వెల్లుల్లి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో పాదాలకు ఫంగస్ చేరుతూ ఉంటుంది. వీటిని పదాలకు రుద్దడం వల్ల ఆ ఫంగస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకే ప్రియాంక చోప్రా పాదాలపై వెల్లుల్లిని రుద్దుకుంటూ ఉంటుంది.

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు జ్వరం రావడం సహజం. అలాంటప్పుడు వేడిచేసిన ఆవనూనెలో వెల్లుల్లి తరుగునను వేసి శరీరానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది.

వెల్లుల్లిని రోజూ నూరి పాదాల అరికాళ్లకు మసాజ్ చేసినా కూడా రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థాయికి మారుతాయి.

వెల్లుల్లిని ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఆక్సీకరణ నష్టం రాకుండా అడ్డుకుంటుంది వెల్లుల్లి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు కూడా ఎక్కువ. అందుకే ఎలాంటి బ్యాక్టిరియాలు, వైరస్ వంటివి శరీరంపై దాడి చేయకుండా అడ్డుకునే శక్తి వెల్లుల్లికి ఉంది. హైబీపీని అడ్డుకునే శక్తి కూడా వెల్లుల్లికి ఉంది. దగ్గు, జలుబుకి చెక్ పెట్టే శక్తి వెల్లుల్లికి ఉంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని అడ్డుకోవడంలో వెల్లుల్లి ముందుంటుంది.

జ్వరం నుంచి త్వరగా కోలుకోవడానికి వెల్లుల్లి రసం ఉపయోగపడుతుంది. వెల్లుల్లి రసం, తేనె కలిపి తింటూ ఉంటే జ్వరం, జలుబు తగ్గుతుంది. గుండె వేగాన్ని పెరగకుండా అడ్డుకుంటుంది. వెల్లుల్లిని నూరి మెత్తటి పేస్టులా చేసి పాలలో వేసుకుని తాగేయాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిని యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి గాయాలు తగిలినప్పుడు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

Whats_app_banner