Garlic Peel benefits: వెల్లుల్లి పొట్టును పడేస్తున్నారా? వెల్లుల్లి పొట్టును ఇలా పొడి చేసి వాడితే ఎంతో ఆరోగ్యం
Garlic Peels benefits: వెల్లుల్లి నిత్యం వంటల్లో వాడే వారి సంఖ్య ఎక్కువే. కానీ వెల్లుల్లి పక్కన పడేసి రెబ్బలను మాత్రమే వినియోగిస్తారు. వెల్లుల్లి తొక్కలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Garlic Peels benefits: వెల్లుల్లి రెబ్బలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లిని పైన ఉన్న పొట్టుతో పాటు తినకుండా వాటిని ఒలిచి బయటపడేస్తూ ఉంటారు. అలా పడేయడం వల్ల ఎన్నో పోషకాలను మీరు కోల్పోతున్నారు. వెల్లుల్లి తొక్కతో పాటు తినడం వల్ల మన ఆరోగ్యానికి, మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. వెల్లుల్లిలో ఎన్ని పోషకాలు ఉన్నాయో... వెల్లుల్లి తొక్కల్లో కూడా అన్ని పోషకాలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల కోసం ఈ తొక్కలను తినడం చాలా అవసరం. వీటిని ఔషధాలుగా కూడా వినియోగిస్తూ ఉంటారు.
వెల్లుల్లి పొట్టు ఉపయోగాలు
వెల్లుల్లి తొక్కతో పాటు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో తెలుసుకోండి. వెల్లుల్లి తొక్కల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల పొట్టుతో పాటు శరీరంలో చేరుతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను కాపాడతాయి. ఇది లిపిడ్ స్థాయిలను తగ్గిస్తాయి. వెల్లుల్లి తొక్కలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తపోటు తగ్గుతుంది. ఎన్నో అధ్యయనాలు వెల్లుల్లిని తొక్కలతో పాటు తినమని సూచిస్తున్నాయి.
రోగ నిరోధక శక్తి పెరిగేందుకు...
వెల్లుల్లి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని ముందే చెప్పుకున్నాం. వీటిని తినడం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్లు, ఫ్రీ రాడికల్స్ తో ఇవి పోరాడతాయి. వీటిని తినడం వల్ల ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు కూడా రావు. గుండెజబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. రక్తనాళాలు బిగుసుకుపోకుండా విస్తరించేలా ఉంటాయి. దీని వల్ల హైబీపీ రాకుండా ఉంటుంది. వెల్లుల్లిని తొక్కతో పాటు తినడం అలవాటు చేసుకోవాలి లేదా వెల్లుల్లి తొక్కను ఎండబెట్టి పొడి చేసి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
జుట్టు ఆరోగ్యంగా కావాలనుకునే వారు వెల్లుల్లి తొక్కను ఆహారంలో భాగం చేసుకోండి. దీనిలో యాంటీ మైక్రోబయాల్ గుణాలు ఉంటాయి. బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని ఇవి అందిస్తాయి. జుట్టుకు మాడుకు ఇవి హాని కలగకుండా చూస్తాయి. విటమిన్ సి వంటి పోషకాలను అందిస్తాయి. ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు ఎంతో చక్కగా ఎదుగుతుంది.
చర్మ సౌందర్యాన్ని కాపాడడానికి వెల్లుల్లి తొక్కలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ వెల్లుల్లి తొక్కలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మంలో కొలాజెన్ పెంచడానికి సహాయపడతాయి. వెల్లుల్లి తొక్కలను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని పెరుగులో కలిపి ఫేస్ ప్యాక్ లా వాడడం వల్ల చర్మం యవ్వనంగా మెరిసిపోతూ ఉంటుంది. గీతలు, ముడతలు వంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి వెల్లుల్లి తొక్కలను పొడిలా చేసి ఇంట్లో భద్రపరచుకోండి. వాటిని కూరల్లో భాగం చేసుకోండి.
టాపిక్