Dissolve Cholesterol: కొలెస్ట్రాల్‌ను త్వరగా కరిగించుకోవాలంటే ప్రతిరోజూ ఈ టీని తాగడం అలవాటు చేసుకోండి-drink black ginger tea daily to dissolve cholesterol quickly ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dissolve Cholesterol: కొలెస్ట్రాల్‌ను త్వరగా కరిగించుకోవాలంటే ప్రతిరోజూ ఈ టీని తాగడం అలవాటు చేసుకోండి

Dissolve Cholesterol: కొలెస్ట్రాల్‌ను త్వరగా కరిగించుకోవాలంటే ప్రతిరోజూ ఈ టీని తాగడం అలవాటు చేసుకోండి

Haritha Chappa HT Telugu
Published Mar 28, 2024 01:40 PM IST

Black ginger Tea: శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండె జబ్బులు త్వరగా వస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడం కోసం ప్రతిరోజూ బ్లాక్ జింజర్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి.

బ్లాక్ జింజర్ టీ
బ్లాక్ జింజర్ టీ (pixabay)

Black ginger Tea: ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఎంతోమందికి గుండె జబ్బులు వస్తున్నాయి. ఎవరికి, ఎప్పుడు గుండెపోటు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గుండె జబ్బులు రావడానికి అధిక కొలెస్ట్రాల్ కారణం. కొలెస్ట్రాల్‌ను కరిగించుకుంటే గుండెను కాపాడుకున్న వారు అవుతారు. శరీరంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవడానికి ప్రతిరోజూ బ్లాక్ జింజర్ టీ తాగడం అలవాటు చేసుకోండి. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. ఇది గొప్ప ఆహారంగా చెప్పుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది.

బ్లాక్ జింజర్ టీ ప్రతిరోజూ తాగడం వల్ల మీ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీనిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు... ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.

బ్లాక్ జింజర్ టీ తాగడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. అయితే ఉదయాన్నే ఖాళీ పొట్టతో ఈ బ్లాక్ జింజర్ టీని తాగాలి. అప్పుడే రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి. మీ కాలేయం రక్తప్రవాహంలో ఉన్న కొలెస్ట్రాల్, ఇతర లిపిడ్లను తీసుకువెళ్లే లిపో ప్రోటీన్లను తయారు చేస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్ నియంత్రణలో కాలేయ పనితీరు చాలా ముఖ్యం.

గుండెపోటుతో పాటు గుండె సంబంధిత వ్యాధులు అభివృద్ధిలో ఇన్ఫ్లమేటరీ పాత్ర ఎక్కువగా ఉంటాయి. శరీరంలో దీర్ఘకాలికంగా మంట ఉండటం మంచిది కాదు. బ్లాక్ జింజర్ టీ తాగడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు వాపును తగ్గిస్తాయి. దీనివల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి.

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు ముఖ్యంగా బరువు తగ్గాలి. బ్లాక్ జింజర్ టీ తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడం అనేది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.

బ్లాక్ జింజర్ టీని ఎలా తయారు చేయాలి

టీ పొడి - ఒక స్పూను

అల్లం తరుగు - ఒక స్పూను

తేనె - ఒక స్పూన్

నీళ్లు - ఒక స్పూను

స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లు వేయాలి. నీళ్లు వేడెక్కాక టీ పొడిని వేయాలి. అందులోనే అల్లం తరుగును వేసి బాగా మరిగించాలి. అది బాగా మరిగాక వడకట్టి ఆ నీటిని గ్లాసులో వేయాలి. నీరు గోరువెచ్చగా మారాక నిమ్మరసం లేదా తేనె కలుపుకొని తాగాలి. ఇదే బ్లాక్ జింజర్ టీ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Whats_app_banner