Mustard Oil: ఆవనూనెతో ఆహారం వండితే మీ శరీరంలో కలిగే మార్పులు ఇవే
Mustard Oil: ఆహారం ఆవ నూనె వినియోగించమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
Mustard Oil: భారతీయ వంటకాల్లో ఆవ నూనెకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కానీ ఎప్పుడైతే సన్ ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి వచ్చాయో... ఆవ నూనెను వాడే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. రోజు వారీ ఆహారంలో ఆవనూనెను వాడేవారు తక్కువేనని చెప్పాలి. కేవలం ఆవకాయలు, ఊరగాయలు వంటివి పెట్టడానికి మాత్రమే ఆవనూనెను వినియోగిస్తున్నారు. అయితే పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం రైస్ బ్రాన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ ఎలా వాడతామో అలా ఆవనూనెను కూడా ప్రతిరోజూ వినియోగించుకోవచ్చని వివరిస్తున్నారు. అలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అని చెబుతున్నారు. ఆవాల నుండి తీసేదే ఆవనూనె. ఆవాలలో ఉన్న పోషకాలన్నీ ఆవనూనెలో లభిస్తాయి.
ఆవాలను అధికంగా ఉత్తర భారత దేశంలో పండిస్తారు. ఇవి ప్రకాశవంతమైన పసుపు పువ్వులను కాసే మొక్కల నుండి సేకరిస్తారు. ఎకరాలకు ఎకరాలు ఈ ఆవాలను పండించేవారు ఉన్నారు. ఈ నల్లని ఆవాలతోనే ఆవనూనెను తయారుచేస్తారు. ఒకప్పుడు ఉత్తర, తూర్పు భారతదేశ ప్రాంతాల్లో వంటల్లో కచ్చితంగా ఆవనూనె వినియోగించేవారు. ముఖ్యంగా బెంగాల్‌లో చేపల కూరను ఈ నూనె వండి తింటారు. ఇప్పుడు అన్నిచోట్ల ఈ నూనెను వినియోగించే వారి సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒడియా, బెంగాలీ వంటకాలలో కూడా ఆవనూనెరె వినియోగించే సంస్కృతి ఉంది.
పురాతన వైద్యంలో ఆవాలుకు ఎంతో విలువ ఉంది. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు నిండుగా ఉంటాయి. ఇవి తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని ఈ ఫ్యాటీ యాసిడ్... కొలెస్ట్రాల్‌ను పెరగకుండా నియంత్రిస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆవనూనె రోజూ తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.
ఆవాలును ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి రాకుండా ఉంటాయి. ఈ ఆవనూనెలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి అత్యవసరమైనది. ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారు, బాన పొట్టతో ఇబ్బంది పడుతున్న వారు... మిగతా నూనెలతో పోలిస్తే ఆవ నూనెతో వండిన ఆహారాన్ని తినడం మంచిది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను కరిగిస్తుంది. శరీరంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. ప్రతిరోజూ కూరలో రెండు స్పూన్ల ఆవ నూనెను వేసి వండుకోవడం అలవాటు చేసుకోండి. ఇంటిల్లిపాదికి మంచి జరుగుతుంది.
టాపిక్