వెల్లుల్లి పొట్టును ఇలా వాడారంటే ఎన్నో లాభాలు

pixabay

By Haritha Chappa
Jun 09, 2024

Hindustan Times
Telugu

వెల్లుల్లి రెబ్బలను వాడే ముందు పైన పొట్టు తీసేస్తారు. కేవలం రెబ్బలను మాత్రమే వినియోగిస్తారు.

pixabay

వెల్లుల్లి పొట్టు పడేయకుండా వాటిని అనేక రకాలుగా వాడుకోవచ్చు. పొట్టుతో పాటే వెల్లుల్లిని వాడడం మంచిది.

pixabay

వెల్లుల్లిని పొట్టుతో పాటూ వాడడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి.

pixabay

 వెల్లుల్లి పొట్టులో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ వెల్లుల్లి పొట్టును తినడం వల్ల గొంతు సమస్యలు, జలుబు, ఫ్లూ వంటివి రాకుండా ఉంటాయి.

pixabay

వెల్లుల్లి పొట్టును తినడం వల్ల ఆహారంలో భాగం చేసుకోవాలంటే గాయాలు త్వరగా నయం అవుతాయి.

pixabay

వెల్లుల్లిని తొక్కతో పాటూ తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది. వెల్లుల్లి పొట్టును పొడిలా చేసుకుని ఉంచుకుంటే మంచిది. 

pixabay

వెల్లుల్లి పొట్టును పొడిలా చేసుకుని గాయాలకు అప్లై చేయడం వల్ల ఆ గాయాలు త్వరగా తగ్గుతాయి.

pixabay

వెల్లుల్లి పొట్టును పొడిలా చేసుకుని నూనెలో కలిపి ఆ నూనెను తలకు పట్టిస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. 

pixabay

నిద్రలో కలలు ఎందుకు వస్తాయి? 9 ఆసక్తికరమైన విషయాలు

Image Source From unsplash