Post Holi Detox : హోలీ తర్వాత కేలరీలు బర్న్ చేసేందుకు సూపర్ చిట్కాలు-post holi detox lime water to dahi khichdi super tips to burn calories after holi ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Post Holi Detox : హోలీ తర్వాత కేలరీలు బర్న్ చేసేందుకు సూపర్ చిట్కాలు

Post Holi Detox : హోలీ తర్వాత కేలరీలు బర్న్ చేసేందుకు సూపర్ చిట్కాలు

Anand Sai HT Telugu
Mar 25, 2024 12:30 PM IST

Holi 2024 : ఏ పండుగ తర్వాత అయినా డిటాక్స్ తప్పనిసరి. లేకుంటే శరీరంలో ఇబ్బందులు కలుగుతాయి. హోలీ తర్వాత బాడీ డిటాక్స్ చేసుకునేందుకు కొన్ని టిప్స్ పాటించాలి.

నిమ్మకాయ నీటి ప్రయోజనాలు
నిమ్మకాయ నీటి ప్రయోజనాలు (Unsplash)

హోలీ పండుగ భారతదేశంలో అత్యంత వైభవంగా నిర్వహించుకునే పండుగ. ఈ పండుగ సందర్భంగా కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు తీసుకుంటాం. అయితే దీని తర్వాత శరీరంలో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. నిజానికి భారతదేశంలో ఏ పండుగ అయినా ఫుడ్ లేకుండా పూర్తి కాదు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో హోలీకి ప్రత్యేకమైన వంటకం ఉంటుంది.

హోలీ జ్ఞాకాలు ఏడాది అంతా గుర్తుంటాయి. అయితే ఈ సమయంలో తినే ఆహారం కూడా కొన్ని రోజుల వరకూ ఇబ్బంది కలిగిస్తాయి. పండుగలు మనకు అదనపు కేలరీలు, కొవ్వును వదిలివెళ్తాయి. ఇది మన శ్రేయస్సుకు మంచిది కాదు. సెలబ్రేషన్స్ తర్వాత డిటాక్స్ తప్పనిసరి. గట్-ఫ్రెండ్లీ, న్యూట్రీషియన్ ఫుడ్స్ మిక్స్ ఉండాలి. పండుగ సమయంలో కొన్నిసార్లు నియంత్రణ లేకుండా తింటుంటాం. ఇది మంచిది కాదు. పండుగ తర్వాత కొన్ని ఆహారాలు, పానీయాలు తీసుకోవాలి.

అతిగా తినడం అనారోగ్యకరమైనది. పండుగల సమయంలో కొత్త ఆహారం ఆనందాన్ని ఇస్తుంది. కానీ అది మన శరీరానికి కూడా హాని చేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని సిద్ధం తీసుకోండి. అందులో ఒక నిమ్మకాయను పిండండి. తర్వాత నెమ్మదిగా సిప్ చేయండి. మీ రోజును రిఫ్రెష్ డ్రింక్‌తో ప్రారంభించండి. హోలీ వేడుకల సమయంలో శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను తొలగించడానికి ఇది కచ్చితంగా సహాయపడుతుంది. మీ మెుత్తం ఆరోగ్యానికి కూడా మంచిది.

హోలీ సమయంలో ఏది పడితే అది తింటే.. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా శరీరంలోకి వెళ్తాయి. ఇందులో స్వీట్లు, ఫ్రైలు ఉంటాయి. ఏదైనా పండుగ సమయంలో తప్పనిసరిగా తింటాం. జంక్ ఫుడ్, శీతల పానీయాలను మానుకోండి. హోలీ తర్వాత ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ప్రోటీన్-రిచ్ డైట్‌కి మారాలి. ఇది మన ఆకలిని తీర్చడం, ఎక్కువసేపు మనల్ని నిండుగా ఉంచడం, తద్వారా అతిగా తినడం పరిమితం చేస్తుంది. కాయధాన్యాలు, బీన్స్, చేపలు వంటి లీన్ ప్రొటీన్‌లను సరైన రీతిలో తీసుకుంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

ఏరోబిక్, లేదా కార్డియోవాస్కులర్ శిక్షణ, మిమ్మల్ని ఫిట్‌గా మార్చుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పండుగ తర్వాత బద్ధకంగా పడుకోకుండా.. పరుగు, చురుకైన నడక, స్కిప్పింగ్ వంటి వ్యాయామాలను ప్రయత్నించండి. స్విమ్మింగ్ లేదా జుంబా క్లాస్‌లకు వెళ్లండి. శారీరక శ్రమలో పాల్గొనడం పునరుజ్జీవింపజేస్తుంది. శరీరానికి ఎక్కువ ఆక్సిజన్‌ను పంపుతుంది. చెమటను ఉత్పత్తి చేస్తుంది, ఏకకాలంలో నిర్విషీకరణ, కేలరీలను బర్న్ చేస్తుంది.

హైడ్రేటెడ్‌గా ఉండడం అనేది కేలరీలను బర్న్ చేసే మరో పద్ధతి. నీరు మన శరీర వ్యవస్థను శుభ్రపరుస్తుంది. టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. పుష్కలంగా నీరు తాగడం కూడా మనల్ని నిండుగా ఉంచుతుంది. మన ఆహారంలో అదనపు కేలరీలను తినడాన్ని నివారిస్తుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చర్మానికి అద్భుతాలు చేస్తుంది.

డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండే పెరుగు, కిచ్డీ వంటి ఇంట్లో తయారుచేసిన ఆహారాలు తీసుకోండి. జీర్ణాశయానికి అనుకూలమైన ఆహారాన్ని తీసుకోవడం అవసరం. మీ ఆహారంలో కూరగాయలు, పండ్లను చేర్చడం కూడా సహాయపడుతుంది. అజీర్ణం, మలబద్ధకం, ఉబ్బరాన్ని ఎదుర్కోవడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

Whats_app_banner