Sperm Count : తెలియకుండా ఈ ఆహారాలు తినకండి.. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది
Sperm Count Reduce Foods : ఈ బిజీ లైఫ్‌లో మీరు తినే ఆహారాలు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా? తినే ఆహారాలు వాస్తవానికి శరీరానికి ఇంధనంగా ఉండాలి. దీనికి విరుద్ధంగా హాని కలిగిస్తున్నాయి. స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది.
ఆహారం మన ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారాన్ని సరిగ్గా వండటంపై దృష్టి పెడతాం. కానీ ఆహారాన్ని ఎలా పండిస్తారు అనే దాని గురించి మనం పెద్దగా ఆలోచించం. తెగుళ్ల నుండి పంటలను రక్షించడానికి ఉపయోగించే రసాయనాలతో ప్రజలకు కూడా హానికరం. ఓ కొత్త పరిశోధన ఇటీవలే పురుగుమందులు అధికంగా ఉండే ఆహారం, తక్కువ స్పెర్మ్ కౌంట్ మధ్య సంబంధాన్ని చూపించింది. ఇదొక పెద్ద సమస్యగా మారింది.
మనం తినే అనేక ఆహారాలలో పురుగుమందులు ఉంటాయి. పురుగుమందులు కలిపిన ఆహారాన్ని తినడం వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని(Sperm Count Reduce) తాజా అధ్యయనం సూచిస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్‌లోని పరిశోధన పురుగుమందులతో స్పెర్మ్ నాణ్యత తగ్గడం మధ్య సంబంధాన్ని చూపించింది. అంటే, ఎక్కువ స్థాయిలో పురుగుమందుల అవశేషాలు ఉన్న ఆహారాన్ని తీసుకునే పురుషులు తక్కువ స్పెర్మ్ కౌంట్ కలిగి ఉంటారు.
కొన్ని ఆహారాలలో పురుగుమందులు ఎక్కువగా ఉంటాయి. మీ ఆహారంలో ఈ పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటే మీరు అనుకోకుండా ప్రమాదకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండవచ్చు. ఈ కథనంలో ఏ ఆహారాలలో ఎక్కువ పురుగుమందులు ఉన్నాయో తెలుసుకోండి.
అధ్యయనంలో పరీక్షించబడిన 46 పదార్థాల్లో 12 పండ్లు, కూరగాయలలో అత్యధిక స్థాయిలో పురుగుమందుల కలుషితాలు ఉన్నట్లు నివేదించబడింది. అవి : స్ట్రాబెర్రీ, స్పినాచ్, కాలే, ఆవపిండి, ఆకుకూరలు, పీచెస్, పియర్స్, యాపిల్స్, గ్రేప్స్, వెడ్జెస్, చెర్రీస్, బ్లూబెర్రీస్, గ్రీన్ బీన్స్.
మీరు కొనుగోలు చేసే పండ్లు, కూరగాయల రుచి లేదా ఆకృతిలో పూర్తి వ్యత్యాసాన్ని గమనించండి. ఎందుకంటే పురుగుమందుల అవశేషాలు సహజ లక్షణాలను మార్చగలవు. రుచి, అనుభూతిని ప్రభావితం చేస్తాయి. అందువల్ల, పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీకు ఇష్టమైన ఉత్పత్తులలో తీవ్రమైన ధర మార్పులు కనిపిస్తే, పురుగుమందుల వాడకం పెరుగుతూ ఉండవచ్చు. ఉదాహరణకు యాపిల్స్ మీద ఒకరకమైన రసాయనం చల్లుతారు. దీంతో యాపిల్స్ పాడవకుండా చాలా రోజులు ఉంటాటి. ఇవి ఆరోగ్యానికి హానికరం.
మీరు అలాంటి ఆహారం తిన్న తర్వాత మీ శరీరం మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుండవచ్చు. పురుగుమందుల అవశేషాలు అలెర్జీలు, చర్మం చికాకు కలిగించవచ్చు. కొన్ని ఆహారాలను తీసుకున్న తర్వాత ఇబ్బందిగా అనిపిస్తే పురుగుల మందు మోతాదు ఎక్కువై ఉండొచ్చు. ఎల్లప్పుడూ సీజనల్ కూరగాయలు, పండ్లు తింటేనే మంచిది. సీజనల్ కూరగాయలు, పండ్లు పోషకమైనవి. రసాయనాలు లేని వాటిని ఎంపిక చేసుకోవాలి.
టాపిక్