Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో భిన్నంగా ఉన్న ఆపిల్‌ను అయిదు సెకన్లలో కనిపెడితే మీరు తోపే
Optical Illusion: ఆప్టికల్ ఇల్యుషన్లో ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడ మీకు ఒక ఆపిల్ ఆప్టికల్ ఇల్ల్యూషన్ ఇచ్చాము. దీన్ని కేవలం 5 సెకన్లలో సాల్వ్ చేస్తే మీ మెదడు పవర్ సూపర్.
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు కనిపిస్తే చాలు కళ్లను కట్టిపడేస్తాయి. దాన్ని సాల్వ్ చేశాకే ముందుకు వెళ్లాలనిపిస్తుంది. అలాంటి ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ ఇక్కడ ఉంది. ఇది ఆపిల్స్ తో నిండిన ఆప్టికల్ ఇల్యూషన్. ఈ చిత్రంలో ఎన్నో ఆపిల్స్ వరుసగా ఉన్నాయి. ఇందులో అన్ని ఆపిల్స్ ఒకేలా ఉన్నాయి. కానీ ఒక ఆపిల్ మాత్రం కాస్త భిన్నంగా ఉంది. దాన్ని కనిపెట్టడం చాలా సులువు. అందుకే మీకు కేవలం ఐదు సెకన్ల సమయం మాత్రమే ఇస్తున్నాం. ఈ ఐదు సెకన్లలో భిన్నంగా ఉన్న ఆపిల్‌ని మీరు కనిపెట్టినట్టయితే మీ మెదడు పవర్ సూపర్ అని చెప్పవచ్చు.
ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు
ఐదు సెకన్లలో జవాబు కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఐదు సెకన్ల తర్వాత ఎవరైనా సులువుగా ఈ ఆప్టికల్ ఇల్యూషన్ సాల్వ్ చేసేస్తారు. ఎందుకంటే ఈ ఆపిల్ ఆప్టికల్ ఇల్యూషన్ చాలా సులువైనది. అందుకే దీన్ని సాల్వ్ చేయడానికి మేము చాలా తక్కువ సమయం ఇచ్చాము. ఇక జవాబు విషయానికి వస్తే కింద నుంచి రెండో వరుసలో మూడో ఆపిల్ పండుని చూడండి. అదే అన్నిటికంటే భిన్నమైనది. అన్ని ఆపిల్స్ కి ఆకు ఒకవైపు ఉంటే, దీనికి మాత్రం మరో వైపు ఉంది.
పదునైన కంటి చూపు, మంచి మెదడు శక్తి ఉన్నవారు మాత్రమే ఆప్టికల్ ఇల్యూషన్లను కొన్ని సెకన్లలో సాల్వ్ చేయగలరు. ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వీటిని చిత్రీకరించే చిత్రకారుల సంఖ్య ఇప్పుడు ఎక్కువగానే ఉంది. విదేశాల్లో కేవలం ఆప్టికల్ ఇల్యూషన్లను చిత్రీకరిస్తూ జీవనం సాగించేవారు ఎక్కువ మందే ఉన్నారు. ఇక ఆప్టికల్ ఇల్యూషన్ల చరిత్ర విషయానికి వస్తే ఇవి ఎక్కడ పుట్టాయి? అన్నది ఎక్కడా స్పష్టంగా లేదు. కానీ చరిత్రకారులు చెబుతున్న ప్రకారం గ్రీకు దేశంలో దీని ఆనవాళ్లు కనిపించాయి. పురాతన గ్రీకు శిల్పాల్లో, ఆలయాల గోడలపై కొన్ని రకాల ఆప్టికల్ ఇల్ల్యూషన్లు కనిపించాయి. కాబట్టి గ్రీకు దేశాన్ని ఆప్టికల్ ఇల్యూషన్ల పుట్టినిల్లుగా చెప్పుకుంటారు.
ఆప్టికల్ ఇల్యూషన్లు తరచూ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కంటిచూపు కూడా పదునుగా మారుతుంది. ముఖ్యంగా మెదడు కంటిచూపు కలిసి సమన్వయంతో పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇవి ఎక్కువగా చిన్నపిల్లలకు, వయసు ముదిరిన వారికి ఉపయోగపడతాయి. మతిమరుపు రావడానికి అవకాశం ఉండే వారిలో... ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చేధించడం వల్ల వారికి అల్జీమర్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. అలాగే పిల్లలకు ఈ ఆప్టికల్ ఇల్యూషన్ లో మెదడు శక్తిని పెంచుతాయి. కాబట్టి పిల్లలు, వృద్దులు ఎక్కువగా ఈ ఆప్టికల్ ఇల్యూషన్లను సాల్వ్ చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో కూడా పిల్లలు, వృద్దులు ఉంటే వారికి ఇలాంటి వాటిని ఇచ్చి సాల్వ్ చేయమని చెప్పండి.
టాపిక్