Optical Illusion: ఆప్టికల్ ఇల్యుషన్లో మెదడుకు, కంటి చూపుకు పని పెట్టేలా ఉంటాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్లకు ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా వీటిని పరిష్కరించగలరు. కానీ తక్కువ సమయంలో పరిష్కరించిన వారే మేధావులు. ఇక్కడ మీకు ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. ఇందులో చెస్ లో ఉపయోగించే గుర్రం బొమ్మలు అన్నీ ఒకేలా ఉన్నాయి. కానీ వీటిలో ఒకటి మాత్రం కాస్త భిన్నంగా ఉంది. అది ఎక్కడుందో కనిపెట్టాలి. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కనిపెట్టేస్తా.రు మీరు మేధావులు అయితే, తెలివైన వారైతే కేవలం ఎనిమిది సెకండ్లలోనే దీన్ని పరిష్కరించి చూపించండి. మీ కంటి చూపుకు, మెదడుకు మధ్య సమన్వయం ఎలా ఉందో ఈ ఆప్టికల్ ఇల్ల్యూషన్ చెప్పేస్తుంది. మీరు తక్కువ సమయంలోనే దీన్ని పరిష్కరించగలిగితే మీ మెదడు, కంటిచూపు కలిసి చక్కగా పనిచేస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు.
గుర్తుంచుకోండి కేవలం ఎనిమిది సెకండ్లలోనే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ని పరిష్కరించాలి. అలా అయితేనే మీరు తెలివైన వారు. 10 నిమిషాల సమయం ఇస్తే ప్రతి ఒక్కరూ దీన్ని పరిష్కరించేస్తారు. మీ తెలివితేటలకు మీకు మీరే పరీక్ష పెట్టుకోండి. ఇక్కడున్న గుర్రాల్లో తేడాగా ఉన్న గుర్రాన్ని కనిపెట్టి చెప్పండి.
8 సెకండ్లలోనే జవాబును కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఆ సమయానికి మించి ఎక్కువ సమయం తీసుకుని ఆన్సర్ కనిపెట్టిన వారు ఆప్టికల్ ఇల్యూషన్లను తరచూ ప్రాక్టీస్ చేయడం ద్వారా మెదడు శక్తిని పెంచుకోవచ్చు. ఇప్పటికీ కనిపెట్టలేని వారి కోసం జవాబును అందిస్తున్నాం. కింద నుంచి రెండో లైన్ లో ఉన్న ఓ గుర్రానికి కన్ను లేదు. ఆ గుర్రమే అన్నింటిలో కన్నా తేడాగా ఉన్న గుర్రం.
ఆప్టికల్ ఇల్యూషన్ల పునాదులు గ్రీకు దేశంలో బయటపడ్డాయి. అక్కడ పురాతనమైన ఆలయాలపై ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు గీసి ఉండడాన్ని చరిత్రకారులు గుర్తించారు. అందుకే గ్రీకులోనే ఇవి పుట్టాయని చెబుతూ ఉంటారు. ఇవి ఎక్కడ పుట్టాయన్న సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఇవి ఎంతో మందికి వినోదాన్ని అందిస్తున్నాయి. మెదడు శక్తిని పెంచేందుకు సహకరిస్తున్నాయి. కంటి చూపు, మెదడు మధ్య సమన్వయానికి వారధిలా పనిచేస్తున్నాయి. మీకు కూడా ఆప్టికల్ ఇల్యూషన్ల ఆసక్తి ఉంటే కొన్ని ఇన్ స్టాగ్రామ్ పేజీలు వీటి కోసమే కేటాయించారు. అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను తరచూ ప్రయత్నించడం ద్వారా మీ మెదడు, కంటి శక్తిని పెంచుకోవచ్చు.
టాపిక్