Chanakya Niti Telugu : మీ జీవితంలో ఇలాంటివారు ఉంటే.. వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరమే లేదు!
Chanakya Niti On Respect : చాణక్య నీతి ప్రకారం.. జీవితంలో చాలా మంది మనకు ఎదురు అవుతారు. కానీ వారిలో కొందరి ప్రవర్తన ఆధారంగా వారికి గౌరవం ఇవ్వాల్సిన పని లేదు అని చాణక్యుడు చెప్పాడు.
చాణక్య నీతి మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పింది. చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి ఆత్మగౌరవం అతని గొప్ప సంపద. అయితే చాణక్య నీతి ఒక వ్యక్తి పొందే గౌరవం అతని మర్యాదపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ఒక వ్యక్తి చెడు అలవాట్లను కలిగి ఉంటే అతను జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటాడు. జీవితంలో ఎంత ముందుకు వెళ్లాలి అనుకున్నా వెళ్లలేడు. అతడు అందరి ముందు తక్కువైపోతాడు.
అలాంటి వారికి భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం కూడా రావచ్చు. మీరు గౌరవించబడాలంటే మొదట ఇతరులను గౌరవించాలి. కానీ తప్పు వ్యక్తులను గౌరవించడం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. చాణక్య నీతి ప్రకారం మీరు కొంతమందికి ఇచ్చే గౌరవం మీ సమస్యలను పెంచుతుంది. అలాంటి వారికి ఎప్పుడూ గౌరవం ఇవ్వవద్దు అంటాడు చాణక్యుడు.
ఏ పనీ చేయనివాడు
ఏ పని చేయకుండా ముచ్చటగా మాట్లాడి డబ్బు సంపాదించాలనే ఆలోచనలో కొందరు ఉంటారు. నిజానికి వారు ఇతరులను పొగడటానికి కారణం తమ అసమర్థత బట్టబయలు అవుతుందనే భయం. అలాంటి వారిని గౌరవించకూడదని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే అలాంటి వారికి గౌరవం ఇస్తే వారే సమర్థులుగా భావిస్తారు. ఇలాంటివారు అన్ని రంగాల్లో కనిపిస్తారు. రాజకీయ నాయకుల దగ్గర డబ్బా కొట్టి డబ్బు తీసుకునిపోయేవారు ఎక్కువగా కనిపిస్తారు.
గుంపుల్లో ఉండేవాడు
ఒక్కరిగా నిలబడటానికి ధైర్యం లేని వ్యక్తులను మీరు చూసే ఉంటారు. వారు ఎల్లప్పుడూ గుంపులుగా ఉంటారు. అదే మెంటాలిటీతో ఉన్న వ్యక్తులు ఒక గ్రూపుగా ఏర్పడి ఇతరులపై కుట్రపన్నుతున్నారు. చిన్న సమస్య తలెత్తినప్పుడల్లా, అలాంటి వ్యక్తులు వారి స్నేహితులతో కలిసి సమస్యను పెంచడం, పరిస్థితిని ఇతరులకు కష్టతరం చేయడం ప్రారంభిస్తారు. అలాంటి వారికి గౌరవం దక్కదని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే మీరు అలాంటి వారిని గౌరవిస్తే వారు సమాజంలో చెడును వ్యాప్తి చేస్తారు.
అందరితో స్నేహం
కొందరు అందరితో స్నేహంగా ఉంటారు. అయితే ఇక్కడి విషయాలు.. అక్కడ. అక్కడి విషయాలు ఇక్కడకు మోస్తూ ఉంటారు. అలాంటి వారు మీ ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడతారు, మీ గురించి ఇతరుల వద్ద చెడుగా మాట్లాడతారు. అలాంటి వారిని ఎప్పటికీ నమ్మకూడదు. వారికి గౌరవం ఇస్తే దుర్మార్గపు పనిని చేస్తూనే ఉంటారని చాణక్యుడు చెప్పాడు.
ఇతరుల నాశనం కోరుకునేవాడు
ఇతరులకు హాని చేసేవారిని పాపులుగా చూడాలి. ఎందుకంటే వారి పని అదే. ఎవరి జీవితాన్ని నాశనం చేద్దామా అని ఆలోచిస్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ మోసం చేస్తారు. వీరి మనస్తత్వం కూడా కృరంగా ఉంటుంది. అలాంటి వారిని ఎప్పటికీ గౌరవించకూడదు. ఎందుకంటే అలాంటి వారిని గౌరవించడం సమాజానికి మంచిది కాదు.
అవమానించేవాడు
కొంతమంది ఇతరులను అవమానించడం అలవాటు. ఇతరులను చులకనగా చూస్తారు. ఇలా చేయడం వల్ల అందరి దృష్టిలో తాము పెద్దవాళ్లమని బిల్డప్ ఇస్తారు. కానీ అసలైన నిజం ఏంటంటే అలాంటి వ్యక్తులు కొన్ని చిరాకులకు లోనవుతారు, ఇతరులను చిన్నవారిగా చూపించేందుకు అవమానిస్తారు.