Cholesterol: శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగి పోవాలంటే వీటిని గోధుమపిండిలో కలిపి చపాతీలు చేసుకుని తినండి-mix these in wheat flour and make chapatis to dissolve cholesterol accumulated in the body ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cholesterol: శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగి పోవాలంటే వీటిని గోధుమపిండిలో కలిపి చపాతీలు చేసుకుని తినండి

Cholesterol: శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగి పోవాలంటే వీటిని గోధుమపిండిలో కలిపి చపాతీలు చేసుకుని తినండి

Haritha Chappa HT Telugu
Aug 21, 2024 10:32 AM IST

Cholesterol: మారుతున్న జీవనశైలి, చెడు ఆహారం కారణంగా కొలెస్ట్రాల్ పెరగడం సమస్యగా మారింది. మీ రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడానికి సహాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయి. వాటిని భోజనంలో భాగం చేసుకుంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం తగ్గుతుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పిండి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పిండి (Pixabay)

మారుతున్న ఆహారం, బిజీ లైఫ్ స్టైల్ వల్ల వ్యాధులు వచ్చే అవకాశం పెరుగిపోతోంది. వీటిలో చెడుు కొలెస్ట్రాల్ పెరగడం ఒకటి. ఎంతో మందిలో వారికి తెలియకుండానే రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతోంది. నిజానికి చాలా ప్రాణాంతకమైనది. ఇది గుండె పోటుకు కారణంగా మారుతుంది. పెరుగుతున్న కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరిగిపోతోంది. అందుకే చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంచడం చాలా ముఖ్యం.

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ముందునుంచే జాగ్రత్త పడాలి. రెగ్యులర్ వ్యాయామంతో పాటు కొన్ని ఆహారాలను డైట్లో చేర్చుకుంటే మంచిది. ఇవి మీ చెడు కొలెస్ట్రాల్ ను చాలావరకు నియంత్రించడంలో సహాయపడతాయి. మీరు తినే ఆహారంలో ఎలాంటి పదార్థాలను కలుపుకుని తినాలో తెలుసుకోండి.

అవిసె గింజల పొడి

అవిసె గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అవిసె గింజలను వేయించి పొడి చేసి పెట్టుకోండి. చపాతీలు, పూరీలు, దోశెలు, ఊతప్పాలు చేసుకునేటప్పుడు ఆ పిండిలో అవిసె గింజల పిండి కూడా వేసి బాగా కలుపుకోండి. వాటితోనే చపాతీలు, దోశెల్లాంటివి వేసుకుని తింటే ఎంతో మంచిది. ఇలా అవిసెగింజల పొడిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చాలా వరకు అదుపులో ఉంటుంది. రక్తనాళాలు పూడుకుపోకుండా కాపాడుకోవచ్ు.

ఇసాబ్గోల్ పిండి

ఆహారంలో పీచు పరిమాణాన్ని పెంచడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ ను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఫైబర్ జోడించడం వల్ల ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ వేగంగా పెరగకుండా కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది. దీనికి చౌకైన, ఉత్తమ ఎంపిక ఇసాబ్గోల్ పొడి. ఇది మార్కెట్లో లభిస్తుంది. ఆన్ లైన్ మార్కెట్లో కూడా లభిస్తుంది. ఈ పిండిని ఒక స్పూను మీ చపాతీ పిండిలో కలుపుకుని రోటీలు చేసుకుని తినేయాలి. ఇది మీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది.

ఓట్స్ పొడి

ఓట్స్‌ను వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోండి. దీనిలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. వోట్స్ పొడిని గోధుమపిండి, దోశెల పిండిలో కలుపుకుని వండితే మంచిది. ఇది మీ సిరలలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. ఇలా తినడం వల్ల ఓట్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. షుగర్, బీపీ, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధులు రాకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి.

మినప పిండి, శెనగపిండి

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి గోధుమ పిండిలో మినప పిండిని కూడా కలపవచ్చు. మినప్పిండిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే శనగ పిండిని కూడా వాడవచ్చు. శెనగ పిండి, మినప పిండి… పోషకాహార నిధిగా చెప్పుకోవాలి. ఇది మన శరీరానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. గోధుమ పిండిలో కొద్దిగా శనగపిండిని లేదా మినప పిండిని కలపడం వల్ల రోటీలు మరింత రుచికరంగా, పోషక సమృద్ధిగా ఉంటాయి. ఇలా చపాతీలు, రోటీలు చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.