Cholesterol: భోజనానికి ముందు ఈ పొడిని ఒక స్పూన్ తినండి చాలు, కొలెస్ట్రాల్ శరీరంలో ఏర్పడదు-just eat a spoonful of this powder before meals cholesterol does not build up in the body ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cholesterol: భోజనానికి ముందు ఈ పొడిని ఒక స్పూన్ తినండి చాలు, కొలెస్ట్రాల్ శరీరంలో ఏర్పడదు

Cholesterol: భోజనానికి ముందు ఈ పొడిని ఒక స్పూన్ తినండి చాలు, కొలెస్ట్రాల్ శరీరంలో ఏర్పడదు

Haritha Chappa HT Telugu

Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా ఉండేందుకు ఆయుర్వేదంలో ఎన్నో వైద్యులు ఉన్నాయి. అలాంటి వైద్య చిట్కాలలో ఇది ఒకటి. రాతి ఉప్పు, అల్లం పొడి కలిపి తినడం వల్ల కొలెస్ట్రాల్ ఏర్పడే అవకాశం తగ్గుతుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోండిలా

Cholesterol: ఆయుర్వేద వైద్యం అనేది ఒక పురాతన వైద్య విధానం. ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. కాకపోతే త్వరితగతిన ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని పొందాలన్నా ఆశతో, ఎక్కువ మంది అల్లోపతి వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. అల్లోపతితో పోలిస్తే ఆయుర్వేదంలో ఏ మందులు తీసుకున్నా సైడ్ ఎఫెక్టులు తక్కువగా ఉంటాయి. అలా ఆయుర్వేదంలో కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోకుండా ఒక సింపుల్ చిట్కా ఉంది. భోజనానికి ముందు ప్రతిరోజు ఒక స్పూను అల్లం పొడిలో చిటికెడు రాతి ఉప్పు పొడిని వేసి కలుపుకొని తింటే ఎంతో మంచిది. లేదా దాన్ని నీళ్ళల్లో కలుపుకుని తాగినా మంచిదే భోజనానికి ముందు తీసుకుంటే కొలెస్ట్రాల్ ఏర్పడకుండా ఇది అడ్డుకుంటుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది.

రాతి ఉప్పు అంటే శుద్ధి చేయని ఉప్పు ఈ రాక్ సాల్ట్ లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తాయి. మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. అల్లంలో కూడా ఎన్నో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయి. అల్లంలో జింజరాల్ వంటి బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

అల్లం రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రాతి ఉప్పులోని ముఖ్యమైన కణజాలాలతో కలిస్తే ఇది కొలెస్ట్రాల్‌ను సమర్ధవంతంగా అడ్డుకుంటుంది. కాబట్టి ఒక స్పూను అల్లం పొడిలో చిటికెడు రాతి ఉప్పు పొడిని వేసి ప్రతిరోజూ భోజనానికి ముందు తినడం అలవాటు చేసుకోవాలి. దీన్ని తినడం కాస్త కష్టంగానే ఉంటుంది. అలాంటప్పుడు కాస్త గోరువెచ్చని నీటిలో ఈ మిశ్రమాన్ని కలిపి తాగేస్తే ఉత్తమం.

అల్లం, రాతి ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల పేగులలో గ్యాస్ ఏర్పడడం తగ్గుతుంది. జీర్ణ క్రియ లక్షణాలు కూడా పెరుగుతాయి. జీర్ణం స్రావాలు ఉత్పత్తి అవుతాయి. పొట్టలోని ఆమ్లాలు సమతుల్యం అవుతాయి. ఇది పోషకాలను బాగా గ్రహిస్తాయి. ప్రతి భోజనానికి 15 నిమిషాల ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూను అల్లం పొడి, చిటికెడు రాతి ఉప్పు పొడి వేసి బాగా కలుపుకొని తాగేయాలి. ఇలా తాగిన పావుగంట 20 నిమిషాల తర్వాత భోజనాన్ని తినాలి. రోజుల్లోనే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి.