Dulquer Salmaan Diet: దుల్కర్ సల్మాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? ఈ పాన్ ఇండియా హీరో రోజువారీ డైట్ ఇలా
Dulquer Salmaan Fitness Secrets: మహానటి, సీతారామం సినిమాలతో క్రేజీ హీరోల జాబితాలో చేరిపోయిన దుల్కర్ సల్మాన్‌కి సౌత్‌లో భారీగా లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. 37 ఏళ్ల వయసులోనూ దుల్కర్ సల్మాన్ ఇంత ఫిట్‌గా, అందంగా కనిపించడానికి ఎలాంటి డైట్‌ను ఫాలో అవుతాడో ఇక్కడ తెలుసుకుందాం.
మాలీవుడ్‌లో క్రేజీ హీరోగా పేరొందిన దుల్కర్ సల్మాన్.. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మలయాళం మాత్రమే కాదు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడలోనూ దుల్కర్‌కి భారీగా లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
37 ఏళ్ల వయసులోనూ దుల్కర్ సల్మాన్ ఇప్పటికీ యంగ్ అండ్ ఎనర్జటిక్‌గా కనిపిస్తుండటంతో.. ఈ పాన్ ఇండియా హీరో ఏం తింటారు? ఎలా డైట్‌ని ఫాలో అవుతారు? అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ మూవీ దీపావళి కానుకగా థియేటర్లకి వచ్చి ప్రేక్షకుల్ని అలరిస్తోంది.
దుల్కర్ సల్మాన్‌కి బిర్యానీ అంటే మహా ఇష్టం. అయితే.. తెరపై అందం, ఫిట్‌గా కనిపించాలి కాబట్టి జిమ్‌లో ఎక్కువ సేపు శ్రమిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన డైట్ గురించి చెప్తూ దుల్కర్ సల్మాన్ వెల్లడించాడు.
జిమ్‌లో చెమటోడ్చటం
సినిమా షూటింగ్ ఉన్నా.. లేకపోయినా ప్రతి రోజూ దుల్కర్ సల్మాన్ కనీసం అరగంట జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేస్తాడట. జిమ్‌లో ట్రెడ్ మిల్‌పై వేగంగా నడవడం, వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్ సైజులు ఎక్కువగా చేస్తానని దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చాడు.
ఒత్తిడి తగ్గించుకోవడానికి
ఇండస్ట్రీలో ఒత్తిడి చాలా సహజం. మరీ ముఖ్యంగా హీరోలకి కాస్త ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి తాను యోగాతో పాటు కాసేపు ధ్యానం కూడా చేస్తానని దుల్కర్ సల్మాన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ అలవాటు తనని శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యంగా ఉంచుతోందని దుల్కర్ సల్మాన్ గుర్తు చేసుకున్నాడు.
లైఫ్ స్టయిల్..
పని ఒత్తిడి ఎంత ఉన్నా రోజులో కనీసం 7-8 గంటలు దుల్కర్ సల్మాన్ నిద్రపోతాడట. ఒక కప్పు కాఫీతో తన రోజును ప్రారంభించడానికి ఇష్టపడతానని దుల్కర్ సల్మాన్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అలానే సెట్స్‌లో కొబ్బరి నీళ్లు, ప్రొటీన్ షేక్‌తో పాటు మంచి నీళ్లు కూడా తరచూ తాగుతూ ఉంటానని చెప్పుకొచ్చాడు.
డైట్ ప్లానింగ్
బిర్యానీ అంటే ఇష్టమున్నప్పటికీ డైట్ విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటానని దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చాడు. రోజువారీ జీవితంలో చక్కెరను చాలా పరిమితంగా తీసుకుంటానని వెల్లడించాడు. ఇక రోజువారీ టిఫెన్‌లో ఇడ్లీ, గుడ్లు తింటానని.. అలానే సెట్స్‌లో పోషకాలతో నిండిన చిరుతిండి తింటానని కూడా దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చాడు.
మధ్యాహ్న భోజనంలో ఎక్కువగా ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఆహారాన్ని తీసుకుంటాడట. హోటల్ ఫుడ్ కంటే ఇంట్లో వండిన ఆహారానికే తాను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చాడు. జిమ్‌లో ఉన్నప్పుడు ఇన్‌స్టంట్ ఎనర్జీ కోసం అరటి పండ్లు తినడం, ప్రోటీన్ షేక్ తాగడం చేస్తుంటానని దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చాడు.