Beauty tips: బంగాళాదుంపలను ఇలా వాడారంటే ముఖంపై ఉండే ముడతలు, మొటిమలను తొలగించుకోవచ్చు
Beauty tips: పచ్చి బంగాళాదుంపలను వాడడం ద్వారా చర్మంపై నేచురల్ బ్లీచ్‌గా పనిచేస్తుంది. ఇది స్కిన్ టాన్, ముడతలు, మచ్చలు, మొటిమలు వంటి చర్మ సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది. పచ్చి బంగాళాదుంపలను చర్మానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువ.
బంగాళాదుంపలతో చేసిన ఆహారాలు ఎంతో రుచిగా ఉంటాయి. బంగాళాదుంపలను ఆహారంలోనే కాదు, అందానికి కూడా ఉపయోగించవచ్చు. బంగాళాదుంపలతో ఎన్నో టేస్టీ వంటకాలు చేసుకోవచ్చు. వంటల్లో అనేక కూరగాయల రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. ఆహార రుచిని పెంచడానికి బంగాళాదుంపలను అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. బంగాళాదుంపలు వంటల రుచితో పాటు మీ అందాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పచ్చి బంగాళదుంప జ్యూస్ చర్మంపై నేచురల్ బ్లీచ్ లా పనిచేయడం ద్వారా స్కిన్ టాన్, ముడతలు, మచ్చలు, మొటిమలు వంటి చర్మ సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. పచ్చి బంగాళాదుంపలను చర్మానికి అప్లై చేయడం వల్ల కలిగే అయిదు అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి.
బంగాళాదుంపల నుంచి పలుచని రసం వస్తుంది. ఆ రసంతో కూడిన బంగాళాదుంప ముక్కలను ముఖానికి రుద్దడం వల్ల చర్మం మెరిసిపోతుంది. బంగాళాదుంపలలో ఉండే విటమిన్ బి, సి, విటమిన్ కె వంటి పోషకాలు ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడం ద్వారా చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ఇది చర్మం కాంతిని పెంచుతుంది.
డార్క్ సర్కిల్
బంగాళాదుంపలను చర్మంపై రుద్దడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్య కూడా తొలగిపోతుంది. బంగాళాదుంపలలో ఉండే ఎంజైములు చర్మాన్ని చల్లబరచడం ద్వారా మంటను తగ్గించడంలో సహాయపడతాయి. బంగాళదుంపలను ముఖానికి రుద్దడం వల్ల నల్లటి వలయాలు తొలగిపోయి చర్మం తాజాగా మారుతుంది.
ముఖంపై ముడతలు, సన్నని గీతలతో ఇబ్బంది పడుతుంటే బంగాళాదుంపలను ముఖంపై రుద్దడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. బంగాళాదుంపలో ఉండే విటమిన్ సి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా ముడతలు, సన్నని గీతలను తగ్గిస్తుంది.
మొటిమలు
బంగాళాదుంప రసం చర్మంలో ఉండే అదనపు నూనెను పీల్చుకుని మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. బంగాళాదుంపల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రంధ్రాలను శుభ్రపరచడం ద్వారా మొటిమల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
హైపర్పిగ్మెంటేషన్
బంగాళాదుంపలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. సూర్యరశ్మి నష్టాన్ని సరిచేయడానికి, చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి, సన్నని గీతలను తగ్గించడానికి సహాయపడుతుంది.
మొటిమలు తగ్గేందుకు బంగాళాదుంపలను వాడవచ్చు. దీనిలో యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు ఉంటాయి కాబట్టి మొటిమలు త్వరగా తగ్గిపోతాయి. పచ్చి బంగాళాదుంపను మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా చేసుకోవాలి. ఒక స్పూను బంగాళాదుంప పేస్టులో తేనె కలిపి బాగా కలపాలి. మొటిమలకు ఈ మిశ్రమాన్ని అప్లై చేస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. తరువాత గోరువెచ్చటిన నీటితో శుభ్రంచేసుకోవాలి.
చర్మాన్ని బిగుతుగా చేయడానికి కూడా బంగాళాదుంప మిశ్రమాన్ని పూయాల్సిన అవసరం ఉంది. ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. తరచూ చర్మానికి బంగాళాదుంపలను పూయడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. దీని వల్ల చర్మంపై గీతలు, ముడతలు పడడం వంటివి సమస్యలు తగ్గిపోతాయి.
ఆయుర్వేదంలో బంగాళాదుంపలో ఉన్న సుగుణాల గురించి ప్రస్తావన ఉంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఆలూ దుంపలను వాడి అందాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని కూడా.
టాపిక్