Yoga for Fertility: సంతానం కోసం ఎదురుచూస్తుంటే.. చేయాల్సిన యోగా, వ్యాయామాలు ఇవే-must try yogasanas and exercises for fertility improvement ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga For Fertility: సంతానం కోసం ఎదురుచూస్తుంటే.. చేయాల్సిన యోగా, వ్యాయామాలు ఇవే

Yoga for Fertility: సంతానం కోసం ఎదురుచూస్తుంటే.. చేయాల్సిన యోగా, వ్యాయామాలు ఇవే

Yoga for Fertility: సంతానం కోసం ఎదురు చూసేవారు వ్యాయామాలపై దృష్టి పెట్టాల్సిందే. అయితే వాళ్లు ఎలాంటి వ్యాయామాలు ఎంచుకుంటే మంచిదో తెల్సుకోండి.

సంతాన సాఫల్యం కోసం చేయాల్సిన పనులు (freepik)

గర్భం దాల్చాలనే ఆలోచనలో ఉన్న వారు క్రమం తప్పకుండా వ్యాయామాలూ చేయాల్సిందే. అలా చేయడం వల్ల వారిలో సంతానోత్పత్తి సామర్థ్యం మరింత మెరుగవుతుంది. దీంతో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా గర్భం ధరించి, బిడ్డకు జన్మను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మహిళలు ఇలాంటి సమయంలో శారీరకంగా ఉత్సాహంగా ఉండటం అనేది ఎంతో అవసరం. మరి వీరు ఎలాంటి వ్యాయామాలు చేయవచ్చు? వాటి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి?

లైఫ్ స్టైల్:

గర్భం ధరించాలనుకుంటే సరైన జీవన విధానం అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఎప్పుడూ పెద్దగా శారీరక కదలికలు లేకుండా ఉండటం, సిగరెట్‌, మద్యం, వ్యాయామం చేయకపోవడం లాంటివి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి వేస్తాయి. కాబట్టి పిల్లలు కావాలనుకునే వారు వీటి నుంచి బయట పడి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. దీనిలో శారీరక వ్యాయామాలు అనేవి మరీ ముఖ్యమైనవి.

వ్యాయామాలు:

శారీరక వ్యాయామాలు చేస్తూ ఉన్నప్పుడు మనలో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. శ్వాస ఎక్కువగా తీసుకుంటాం. వేడిగా ఉన్నట్లు ఉంటుంది. ఇవన్నీ గర్భ ధారణకు అనువైన శారీరక వాతావరణాన్ని కల్పిస్తాయి. అందుకు మందు మోడరేట్‌ ఫిజికల్‌ యాక్టివిటీలను ఎంచుకోవాలి. నడక, బ్రిస్క్‌ వాకింగ్‌, సైక్లింగ్‌, డ్యాన్సింగ్‌, డబుల్‌ టెన్నిస్‌, హైకింగ్‌ లాంటివి ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి క్రమం తప్పకుండా చేస్తూ ఉండటం వల్ల శరీరం మరింత కష్ట పడి వ్యాయామాలు చేయడానికి సంసిద్ధం అవుతుంది.

అధిక బరువు:

తేలిక పాటి వ్యాయామాలకు ముందు అలవాటు పడిన తర్వాత కష్టమైన వ్యాయామాలు చేయడం మొదలు పెట్టవచ్చు. పరుగు, ఈత, మెట్లు ఎక్కి దిగడం, స్కిప్పిగ్‌, ఆటలు ఆడటం లాంటివి చేయవచ్చు. ఇలాంటివి చేయడం వల్ల శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వులు కరుగుతాయి. శారీరకంగా ఫిట్‌గా తయారవుతారు. బిడ్డకు జన్మను ఇవ్వడానికి వీలైనటువంటి శక్తిని సంపాదించ గలుగుతారు. ఈ సమయంలో అధికంగా బరువు లేకుండా చూసుకోవడమూ ముఖ్యమే. ఎక్కువ బరువు ఉన్న వారు వెయిట్‌ లిఫ్టింగ్‌లు చేయడం, హూలా హూపింగ్‌ చేయడం లాంటి కష్టమైన వ్యాయామాలను ఎంచుకుని చేసుకోవాలి.

అలాగే కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలకూ ప్రాధాన్యతను ఇవ్వాలి. యోగా చేయడం, పుషప్స్‌ చేయడం లాంటి వాటిని ప్రాక్టీస్‌ చేయాలి. ఇంట్లోకి సరుకులు తెచ్చుకునేప్పుడు బరువైన బ్యాగుల్ని మోయడం లాంటి కష్టమైన పనులను చేయాలి. అప్పుడు శరీరం చాలా ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. బిడ్డకు జన్మనిచ్చేందుకు అనువుగా తయారవుతుంది.