Venkatesh: నా కెరీర్‌లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలపై హీరో వెంకటేష్ కామెంట్స్-venkatesh about sankranthiki vasthunnam movie in release date announcement and ram charan game changer daku maharaj ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Venkatesh: నా కెరీర్‌లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలపై హీరో వెంకటేష్ కామెంట్స్

Venkatesh: నా కెరీర్‌లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలపై హీరో వెంకటేష్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Nov 21, 2024 03:17 PM IST

Venkatesh About Sankranthiki Vasthunnam Movie: హీరో వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యే సినిమాలపై వెంకటేష్ కామెంట్స్ చేశారు.

నా కెరీర్‌లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలపై హీరో వెంకటేష్ కామెంట్స్
నా కెరీర్‌లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలపై హీరో వెంకటేష్ కామెంట్స్

Venkatesh About Sankranti Released Movies: విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ముగ్గురి కాంబినేషన్‌లో మూడోసారి తెరకెక్కిన సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ సినిమా కోసం వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు ముగ్గురు మళ్లీ చేతులు కలిపారు.

సంక్రాంతికి వరల్డ్ వైడ్‌గా

గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ట్రయాంగిల్ స్టొరీగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతలు ముందుగా ప్రకటించినట్లుగా, సంక్రాంతికి వస్తున్నాం మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

లుంగీలో వెంకటేష్

దీనికి సంబంధించి సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల తేదిని ఇవాళ (నవంబర్ 21) నిర్మాతలు అనౌన్స్ చేస్తారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ 2025 సంక్రాంతికి జనవరి 14న విడుదల కానుంది. దీనికి సంబంధించి విడుదల చేసిన సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ డేట్ పోస్టర్‌లో వెంకటేష్ లుంగీ, నల్ల చొక్కా ధరించి అద్భుతమైన మాస్ లుక్‌లో కనిపించారు.

మాజీ భార్యగా మీనాక్షి చౌదరి

రగ్గడ్ గడ్డంతో, తుపాకీని పట్టుకుని స్ట్రాంగ్ ప్రజెన్స్‌తో వెంకటేష్ ఆకట్టుకున్నారు. బ్యాక్‌డ్రాప్ నిర్మాణంలో ఉన్న భవనం కనిపిస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ వైఫ్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. అయితే, రమణ గోగుల పాడిన ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల కానుందని సమాచారం.

సంక్రాంతికి వస్తున్నాం టెక్నిషియన్స్

ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందించగా.. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ వర్క్ చేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

అద్భుతంగా ఫినిష్ చేసి

ఇక సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ డేట్ ప్రెస్ మీట్‌లో హీరో వెంకటేష్ మాట్లాడుతూ.. "సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ అదే. నిజంగానే సంక్రాంతి వస్తున్నాం (నవ్వుతూ). ఈ సినిమాని మొదలు పెట్టినప్పుడే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాం. సంక్రాంతికి ఒక మంచి ఎంటర్టైనర్ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాని అద్భుతంగా ఫినిష్ చేసి ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాం" అని అన్నారు.

సంక్రాంతి సినిమాలన్నీ

"ప్రేక్షకులకి, ఫ్యాన్స్‌కి, ఫ్యామిలీస్‌కి అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలన్నీ అద్భుతంగా ఆడాలి. అన్ని సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ బావుంటుంది" అని సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల గురించి వెంకటేష్ చెప్పారు.

వండర్‌ఫుల్ ఫిల్మ్

"డైరెక్టర్ అనిల్ రావిపూడితో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఈ కథని చాలా బాగా రాశారు. అద్భుతంగా తీశారు. ఈ సినిమాతో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది నా కెరియర్‌లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సినిమాల్లో పని చేసిన యాక్టర్స్, టెక్నిషయన్స్ అందరికీ థాంక్స్. ఈ సినిమా సంక్రాంతికి వండర్‌‌ఫుల్ ఫిల్మ్ కాబోతుంది. డెఫినెట్‌గా ఈ సినిమాని చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు" అని వెంకటేష్ తన స్పీచ్ ముగించారు.

Whats_app_banner