Heroine: నేను చనిపోతే నువ్ పాయిజన్ గడ్డి తినడం బెటర్.. ఎందుకంటే? స్టార్ హీరో భార్య, వెంకటేష్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
Twinkle Khanna About Her Death: స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య, నటి ట్వింకిల్ ఖన్నా తన మరణంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒకవేళ అక్షయ్ కుమార్ కంటే తాను ముందు చస్తే తన భర్తను, అతని రెండో భార్యను వెంటాడుతూ వేధిస్తానని తెలిపింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అక్షయ్ కుమార్-ట్వింకిల్ ఖన్నా కుమారుడు ఆరవ్ కాగా కుమార్తె పేరు నితారా. అయితే, సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ చేయడంలో ట్వింకిల్ ఖన్నా ముందుంటుంది. వెటకారంగా, కామెడీగా, నవ్వు తెప్పించేలా ట్వింకిల్ ఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు పెడుతుంటుంది. అయితే, తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన కొత్త కాలమ్‌లో తన భర్తతో అన్న మాటల గురించి ప్రస్తావించింది.
అలాగే తాను వాగిన నాన్సెన్స్‌కు స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఎలా స్పందించాడో కూడా చెప్పుకొచ్చింది. 50 ఏళ్ల ట్వింకిల్ ఖన్నా అందులో ఇలా రాసుకొచ్చింది. "సాయంత్రం మేము ఉండే క్యాంప్‌కు వెళ్తున్నాం. దారిలో టిక్-టిక్ అనే రెండు జంట పక్షులను టూరిస్ట్ గైడ్ నాకు చూపించాడు. అవి ఒకదానిపై మరొకదానికి ఉన్న ప్రేమ ఎంత పవిత్రమైందో చెప్పాడు" అని ట్వింకిల్ ఖన్నా తెలిపింది.
"వాటిలో ఒకటి మరణించినప్పుడు మరొకటి విషంతో నిండిన గడ్డిని తిని చనిపోతుందట. అప్పుడు నేను నా భర్త (అక్షయ్ కుమార్)తో ఇలా చెప్పాను. నేను మీకన్న ముందు చనిపోతే మీరు కూడా అలాంటి విషపూరితమైన గడ్డి తినడమే మీకు మంచిది. లేదా నీ రెండో భార్య నా హ్యాండ్ బ్యాగ్‌లతో తిరగడం గనుక నేను చూస్తే మాత్రం వచ్చి మీ ఇద్దరినీ వెంటాడుతూ వేధిస్తాను. కచ్చితంగా అలా చేస్తానని మాట ఇస్తున్నాను" అని ట్వింకిల్ ఖన్నా చెప్పింది.
ట్వింకిల్ ఖన్నా చెప్పినదానికి అక్షయ్ కుమార్ తనదైన స్టైల్‌లో ఎలా రియాక్ట్ అయ్యాడో కూడా చెప్పుకొచ్చింది. "అతను తల అడ్డంగా ఊపి.. నేను ఇప్పుడే ఆ విషపూరితమైన గడ్డి తినాలని అనుకుంటున్నాను. ఎందుకంటే కనీసం ఈ చెత్తంతా వినాల్సిన అవసరం ఉండదు అని చెప్పాడు. అప్పుడే నా మోచేతిపైన ఉన్న దోమను తను కొట్టాడు. మేము ఇలాగే సూర్యుడు అస్తమించేవరకు జీపులో ఆప్యాయంగా, సరదాగా మాట్లాడుకుంటూ వెళ్లాం" అని ట్వింకిల్ తెలిపింది.
ఇదిలా ఉంటే, సీనియర్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా 2022లో లండన్ యూనివర్సిటీలోని గోల్డ్ స్మిత్స్‌లో ఫిక్షన్ రైటింగ్స్‌లో మాస్టర్స్ చేసింది. రీసెంట్‌గానే ఆ డిగ్రీ పూర్తి చేసింది. 'మిసెస్ ఫన్నీబోన్స్' అనే తన మొదటి ఫిక్షన్ బుక్‌ను 2015లో విడుదల చేసింది. ఇక తన రెండో పుస్తకం 'ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్' చిన్న కథల సమూహారంగా ఉంటుంది.
ట్వింకిల్ ఖన్నా మూడో పుస్తకం 'పైజామాస్ ఆర్ ఫర్‌గివింగ్' 2018లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన మహిళా రచయిత్రి బుక్‌గా నిలిచింది. ఈ విషయాన్ని 'నీల్సన్ బుక్ స్కాన్ ఇండియా' తెలిపింది. ఇక ట్వింకిల్ నాలుగో బుక్ 'వెల్‌కమ్ టు ప్యారడైజ్' 2023లో రిలీజ్ అయింది.
కాగా అక్షయ్ కుమార్ ఇటీవల వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ట్వింకిల్ ఖన్నా విక్టరీ వెంకటేష్ నటించిన శీను సినిమాలో హీరోయిన్ గా చేయడం విశేషం.