Police beaten : మహిళా పోలీసుతో ఉన్నప్పుడు భార్యకు దొరికిపోయిన ఇన్​స్పెక్టర్​- తలుపు​ పగలగొట్టి..!-agra police caught red handed with female colleague beaten up by wife and mob ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Police Beaten : మహిళా పోలీసుతో ఉన్నప్పుడు భార్యకు దొరికిపోయిన ఇన్​స్పెక్టర్​- తలుపు​ పగలగొట్టి..!

Police beaten : మహిళా పోలీసుతో ఉన్నప్పుడు భార్యకు దొరికిపోయిన ఇన్​స్పెక్టర్​- తలుపు​ పగలగొట్టి..!

Sharath Chitturi HT Telugu
Aug 05, 2024 10:15 AM IST

Police beaten in UP : ఓ పోలీసు, మహిళా ఇన్​స్పెక్టర్​ ఇంట్లో ఉన్నప్పుడు, అతని భార్య అక్కడికి వెళ్లింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య మహిళ, ఆమె బంధువులు పోలీసులపై దాడి చేశారు. యూపీలో జరిగింది ఈ ఘటన.

మహిళా పోలీసుతో ఉన్నప్పుడు భార్యకు దొరికిపోయిన ఇన్​స్పెక్టర్!
మహిళా పోలీసుతో ఉన్నప్పుడు భార్యకు దొరికిపోయిన ఇన్​స్పెక్టర్! (HT_PRINT)

ఉత్తర్​ ప్రదేశ్​లో జరిగిన ఓ ఘటన ఇప్పడు వార్తలకెక్కింది. ఓ ఇన్​స్పెక్టర్​ ఓ మహిళా పోలీసుతో కలిసి ఉన్నప్పుడు, అతని భార్య అక్కడికి వెళ్లింది. ఉద్రిక్తత పరిస్థితుల్లో మహిళ తరఫు బంధువులు ఇన్​స్పెక్టర్​పై దాడి చేశారు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన పోలీసులు దాడిని ఆపకుండా వీడియోలు తీయడం మొదలుపెట్టారు.

ఇదీ జరిగింది..

ఉత్తర్​ ప్రదేశ్​లోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. మహిళా పోలీసు రాకాబ్​గంజ్​ పోలీస్​ స్టేషన్​లో ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తున్నారు. ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తి ముజాఫరనగర్​ పోలీస్​ స్టేషన్​లో ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తున్నారు. వీరిద్దరు కొంతకాలం క్రితం నోయిడాలో పోస్టింగ్​ సమయంలో కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య రిలేషన్​ కొనసాగుతూ వచ్చింది. వేరువేరు జిల్లాల్లో పోస్టింగ్​లు పడినా, రిలేషన్​ కొనసాగింది. సెలవులు పెట్టుకుని కలుస్తూ ఉండేవారు.

మరోవైపు భర్త ప్రవర్తనపై సదరు ఇన్​స్పెక్టర్​ భార్యకు అనుమానాలు మొదలయ్యాయి. తన భర్త మరొకరితో రిలేషన్​లో ఉన్నట్టు ఆమె అనుమానించింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆ ఇన్​స్పెక్టర్​, ఆగ్రాలోని మహిళా పోలీసు ఇంటికి వెళ్లాడు. అతని భార్య, మరికొందరి బంధువులతో కలిసి అక్కడికి వెళ్లింది. ఇద్దరు లోపల ఉన్నట్టు వారికి అర్థమైంది. బయటకు రమ్మని వారు ఎంత చెప్పినా, ఆ ఇద్దరు రాలేదు. ఫలితంగా.. మహిళ, ఆమె బంధువులు తలుపులు పగలగొట్టి, ఇంట్లోకి వెళ్లారు. ఆ ఇద్దరిపై దాడి చేశారు. వారు కూడా గొడవకు దిగారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు మాత్రం గొడవను ఆపకుండా, దాడిని వీడియో తీయడం మొదలుపెట్టారు. మహిళ తరఫు బంధువులు ఆ ఇన్​స్పెక్టర్​ బట్టలను చింపేసి మరీ దాడి చేశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

దాడిని ఆపకుండా పోలీసులు వీడియో తీయడంపై సీనియర్​ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఆరుగురిని సస్పెండ్​ చేసినట్టు ఆగ్రా పోలీస్​ కమిషనర్​ తెలిపారు. వీరిలో ఇద్దరు ఎస్​ఐలు ఉన్నట్టు వెల్లడించారు.

హోటల్​లో మహిళా కానిస్టేబుల్​తో దొరికిపోయిన పోలీసులు..

యూపీలో పోలీస్​లో ఈ తరహా ఘటనలు బయటపడటం ఇది మొదటిసారి కాదు. కొన్నేళ్ల క్రితం ఓ హోటల్​లో ఓ మహిళా కానిస్టేబుల్​తో ఓ సీనియర్​ పోలీసు అధికారి దొరికిపోయారు. డిప్యూటీ సూపరిండెంట్​గా ప్రమోషన్​ పొందిన ఆ అధికారిని.. కానిస్టేబుల్​ ర్యాంక్​కి డిమోట్​ చేశారు ఉత్తర్​ ప్రదేశ్​ పోలీసులు.

ఉత్తర్​ ప్రదేశ్​లో 2021 జులైలో జరిగింది ఈ ఘటన. కృపా శంకర్​ కన్నౌజియా.. గతంలో ఉన్నావ్​లోని బిఘాపూర్​లో సర్కిల్​ ఆఫీసర్​గా పనిచేసేవారు. అనంతరతం ఆయనకి గోరఖ్​పూర్​లో 26వ పీఏసీ బెటాలియన్​లో ప్రమోషన్​ వచ్చింది. నాడు.. కుటుంబ కారణాల వల్ల ఓ రోజు సెలవు తీసుకున్నారు కృపా శంకర్​. కానీ ఇంటికి వెళ్లలేదు! ఫోన్​ కూడా స్విఛాఫ్​ చేసేశారు. భర్త రాకపోవడం, ఫోన్​ కూడా కనెక్ట్​ అవ్వకపోవడంతో ఆయన భార్య చాలా కంగారు పడింది. ఉన్నావ్​ ఎస్​పీకి విషయం చెప్పింది. చివరికి.. పోలీసులు.. కృపా శంకర్​ ఫోన్​ని ట్రాక్​ చేశారు. చివరిగా.. ఆ ఫోన్​కి కాన్​పూర్​లోని ఓ హోటల్​లో సిగ్నల్​ అందిందని తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం