UP police : హోటల్​లో మహిళా కానిస్టేబుల్​తో దొరికిపోయిన సీనియర్​ పోలీసు అధికారి- చివరికి..-caught with female cop senior up police officer demoted to constable ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Up Police : హోటల్​లో మహిళా కానిస్టేబుల్​తో దొరికిపోయిన సీనియర్​ పోలీసు అధికారి- చివరికి..

UP police : హోటల్​లో మహిళా కానిస్టేబుల్​తో దొరికిపోయిన సీనియర్​ పోలీసు అధికారి- చివరికి..

Sharath Chitturi HT Telugu
Jun 23, 2024 07:00 PM IST

UP police latest news : యూపీలో ఓ సీనియర్​ అధికారి.. ఓ హోటల్​లో ఓ మహిళా కానిస్టేబుల్​తో దొరికిపోయారు. చివరికి ఏం జరిగిందంటే..

మహిళా కానిస్టేబుల్​తో దొరికిపోయిన సీనియర్​ పోలీసు అధికారి
మహిళా కానిస్టేబుల్​తో దొరికిపోయిన సీనియర్​ పోలీసు అధికారి

Kripa Shankar Kannaujiya : డిప్యూటీ సూపరిండెంట్​గా ప్రమోషన్​ పొందిన ఓ అధికారిని.. కానిస్టేబుల్​ ర్యాంక్​కి డిమోట్​ చేశారు ఉత్తర్​ ప్రదేశ్​ పోలీసులు. ఓ హోటల్​లో ఓ మహిళా కానిస్టేబుల్​తో ఆయన దొరికిపోవడమే ఇందుకు కారణం.

ఇదీ జరిగింది..

ఉత్తర్​ ప్రదేశ్​లో 2021 జులైలో జరిగింది ఈ ఘటన. కృపా శంకర్​ కన్నౌజియా.. గతంలో ఉన్నావ్​లోని బిఘాపూర్​లో సర్కిల్​ ఆఫీసర్​గా పనిచేసేవారు. అనంతరతం ఆయనకి గోరఖ్​పూర్​లో 26వ పీఏసీ బెటాలియన్​లో ప్రమోషన్​ వచ్చింది.

నాడు.. కుటుంబ కారణాల వల్ల ఓ రోజు సెలవు తీసుకున్నారు కృపా శంకర్​. కానీ ఇంటికి వెళ్లలేదు! ఫోన్​ కూడా స్విఛాఫ్​ చేసేశారు. భర్త రాకపోవడం, ఫోన్​ కూడా కనెక్ట్​ అవ్వకపోవడంతో ఆయన భార్య చాలా కంగారు పడింది. ఉన్నావ్​ ఎస్​పీకి విషయం చెప్పింది. చివరికి.. పోలీసులు.. కృపా శంకర్​ ఫోన్​ని ట్రాక్​ చేశారు. చివరిగా.. ఆ ఫోన్​కి కాన్​పూర్​లోని ఓ హోటల్​లో సిగ్నల్​ అందిందని తెలుసుకున్నారు.

ఇదీ చూడండి:- Dead frog in chips packet: చిప్స్ ప్యాకెట్ లో కుళ్లిపోయిన కప్ప; కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం

పోలీసులు.. ఆ హోటల్​కి వెళ్లి తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. ఆ డిప్యూటీ సూపరిండెంట్​.. ఓ మహిళా కానిస్టేబుల్​తో ఆ హోటల్​కి వెళ్లాడు. వారిద్దరు పోలీసులకు దొరికిపోయారు. సీసీటీవీలో వారిద్దరు హోటల్​లోకి వెళ్లడం రికార్డ్​ అయ్యింది. అది కీలక ఆధారంగా మారింది.

ఈ వ్యవహారం సీరియస్​గా మారింది. సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని అప్పటి లక్నో ఐజీపీ తేల్చిచెప్పారు.

UP police Kripa Shankar Kannaujiya : ఈ ఘటన జరిగిన అనంతరం.. ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించారు. పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించిన అనంతరం.. డిప్యూటీ సూపరిండెంట్​గా ప్రమోట్​ అయిన కృపా శంకర్​కి కానిస్టేబుల్​ బాధ్యతలు ఇవ్వాలని సిఫార్సు చేసింది.

ఈ మేరకు.. ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత.. అధికార ఆదేశాలతో డిప్యూటీ సూపరిండెంట్​ కృపా సాగర్​.. కానిస్టేబుల్​ అయ్యారు.

మరి ఆ మహిళా కానిస్టేబుల్​ పరిస్థితి ఏంటనేది తెలియరాలేదు. ఆమెను ఉద్యోగంలో నుంచి తీసేశారా? లేక బదిలీ చేశారో తెలియదు.

తాజా పరిణామాలతో ఈ వ్యవహారం మళ్లీ వార్తలెక్కింది. ఇప్పుడిది సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Whats_app_banner

సంబంధిత కథనం