Saree for Wedding :పెళ్లికి లెహంగాకు నో చెప్పి.. చీర కట్టుకున్న బాలీవుడ్ నటీమణులు..-bollywood actress who wore saree for their wedding ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Saree For Wedding :పెళ్లికి లెహంగాకు నో చెప్పి.. చీర కట్టుకున్న బాలీవుడ్ నటీమణులు..

Saree for Wedding :పెళ్లికి లెహంగాకు నో చెప్పి.. చీర కట్టుకున్న బాలీవుడ్ నటీమణులు..

Jun 26, 2024, 04:03 PM IST Koutik Pranaya Sree
Jun 26, 2024, 04:03 PM , IST

Saree for Wedding : చీరలో బాలీవుడ్ వధువు సోనాక్షి సిన్హా తన పెళ్లి రోజు లెహంగాకు బదులు చీరను ఎంచుకుంది. ఇలాగే వాళ్ల పెళ్లి రోజున చీర కట్టుకున్న బాలీవుడ్ నటీమణుల జాబితా చూడండి.

సోనాక్షి సిన్హా ఇటీవల జహీర్ ఇక్బాల్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వెడ్డింగ్ లేదా రిసెప్షన్ లో చీర కట్టుకుని ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఏదేమైనా,  లెహంగా వద్దనుకుని తన ప్రత్యేక రోజు కోసం సొగసైన చీరను ఎంచుకున్న మొదటి బాలీవుడ్ వధువు కాదు. చాలా మంది బాలీవుడ్ వధువులు చీరలు ధరించి పెళ్లి చేసుకున్నారు. శిల్పా శెట్టి సాంప్రదాయ ఎరుపు చీర నుండి అలియా భట్ కట్టుకున్న సవ్యసాచి చీర వరకు.. ఈ బాలీవుడ్ నటీమణులు తమ చీరకట్టుతో వెడ్డింగ్ ఫ్యాషన్ కు మరో నిర్వచనం చెప్పారు.

(1 / 9)

సోనాక్షి సిన్హా ఇటీవల జహీర్ ఇక్బాల్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వెడ్డింగ్ లేదా రిసెప్షన్ లో చీర కట్టుకుని ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఏదేమైనా,  లెహంగా వద్దనుకుని తన ప్రత్యేక రోజు కోసం సొగసైన చీరను ఎంచుకున్న మొదటి బాలీవుడ్ వధువు కాదు. చాలా మంది బాలీవుడ్ వధువులు చీరలు ధరించి పెళ్లి చేసుకున్నారు. శిల్పా శెట్టి సాంప్రదాయ ఎరుపు చీర నుండి అలియా భట్ కట్టుకున్న సవ్యసాచి చీర వరకు.. ఈ బాలీవుడ్ నటీమణులు తమ చీరకట్టుతో వెడ్డింగ్ ఫ్యాషన్ కు మరో నిర్వచనం చెప్పారు.(Instagram)

నటి సోనాక్షి సిన్హా తన చిరకాల బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ను వివాహం చేసుకున్నప్పుడు చీరలో మెరిసిపోయింది.డిజైనర్ దుస్తులను ఎంచుకోకుండా సోనాక్షి తన తల్లి పూనమ్ సిన్హా పెళ్లి చీర కట్టుకుంది.తెలుపు రంగు పూల కొప్పు, డైమండ్ జ్యువెలరీ, మేకప్‌తో  అందమైన వధువుగా మెరిసింది.

(2 / 9)

నటి సోనాక్షి సిన్హా తన చిరకాల బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ను వివాహం చేసుకున్నప్పుడు చీరలో మెరిసిపోయింది.డిజైనర్ దుస్తులను ఎంచుకోకుండా సోనాక్షి తన తల్లి పూనమ్ సిన్హా పెళ్లి చీర కట్టుకుంది.తెలుపు రంగు పూల కొప్పు, డైమండ్ జ్యువెలరీ, మేకప్‌తో  అందమైన వధువుగా మెరిసింది.(Instagram)

ఈ లిస్ట్ లో అలియా భట్ ను తప్పించే అవకాశం లేదు. ఈ అందాల భామ తన పెళ్లి రోజు కోసం సబ్యసాచి ఇచ్చిన చీరను ధరించి అందాలను ఆరబోసింది. మ్యాచింగ్ నెక్లైన్ బ్లౌజ్, హెవీ డైమండ్ జువెలరీ, సాఫ్ట్ మేకప్ లుక్తో ఆమె అందంగా కనిపించింది.

(3 / 9)

ఈ లిస్ట్ లో అలియా భట్ ను తప్పించే అవకాశం లేదు. ఈ అందాల భామ తన పెళ్లి రోజు కోసం సబ్యసాచి ఇచ్చిన చీరను ధరించి అందాలను ఆరబోసింది. మ్యాచింగ్ నెక్లైన్ బ్లౌజ్, హెవీ డైమండ్ జువెలరీ, సాఫ్ట్ మేకప్ లుక్తో ఆమె అందంగా కనిపించింది.(Instagram)

దియా మీర్జా తన వివాహానికి ఎరుపు పట్టుచీరను ఎంచుకుంది. ఆమె చీరలో యువరాణిలా కనిపించింది. చీరలో పెద్దసైజు బంగారు రంగు అంచు ఉంది. బంగారు అంచుతో ఉన్న  ఎరుపు రంగు దుపట్టా ఆమె లుక్ పూర్తి చేసింది. జతగా ముత్యాల నెక్లెస్, సరిపోయే చెవిపోగులు, పాపిటబిల్ల, హ్యాండ్ మేడ్ బ్రాస్ లెట్ ధరించింది.

(4 / 9)

దియా మీర్జా తన వివాహానికి ఎరుపు పట్టుచీరను ఎంచుకుంది. ఆమె చీరలో యువరాణిలా కనిపించింది. చీరలో పెద్దసైజు బంగారు రంగు అంచు ఉంది. బంగారు అంచుతో ఉన్న  ఎరుపు రంగు దుపట్టా ఆమె లుక్ పూర్తి చేసింది. జతగా ముత్యాల నెక్లెస్, సరిపోయే చెవిపోగులు, పాపిటబిల్ల, హ్యాండ్ మేడ్ బ్రాస్ లెట్ ధరించింది.(Instagram)

ఎరుపు రంగు  బ్రైడల్ చీరలో మాస్టర్ క్లాస్ లుక్ లో ఉన్న అందాల భామ యామీ గౌతమ్.పెళ్లి  వేడుకకు అనితా డోంగ్రే డిజైన్ చేసిన జరీ వర్క్ తో కూడిన సిల్క్ చీరను ధరించింది.భారీ వజ్రాభరణాలు, ఎరుపు రంగు పెదవులు, తలపై ముసుగు ధరించి బ్రైడల్ స్టైల్ లో కనిపించింది.

(5 / 9)

ఎరుపు రంగు  బ్రైడల్ చీరలో మాస్టర్ క్లాస్ లుక్ లో ఉన్న అందాల భామ యామీ గౌతమ్.పెళ్లి  వేడుకకు అనితా డోంగ్రే డిజైన్ చేసిన జరీ వర్క్ తో కూడిన సిల్క్ చీరను ధరించింది.భారీ వజ్రాభరణాలు, ఎరుపు రంగు పెదవులు, తలపై ముసుగు ధరించి బ్రైడల్ స్టైల్ లో కనిపించింది.(Instagram)

రాజ్ కుంద్రాతో వివాహానికి శిల్పాశెట్టి సంప్రదాయ ఎరుపు రంగు చీరను ధరించింది. సెలెబ్రిటీ డిజైనర్ బ్రాండ్ తరుణ్ తహిలియానీ ఎరుపు రంగు స్వరోవ్ స్కీ ఆభరణాలతో ఆమె అందమైన  చీర తయారు చేశారు. అన్‌కట్ డైమండ్ కుందన్ ఆభరణాలతో ఆమె తన వెడ్డింగ్ లుక్ కు మరింత ఆకర్షణను జోడించింది.

(6 / 9)

రాజ్ కుంద్రాతో వివాహానికి శిల్పాశెట్టి సంప్రదాయ ఎరుపు రంగు చీరను ధరించింది. సెలెబ్రిటీ డిజైనర్ బ్రాండ్ తరుణ్ తహిలియానీ ఎరుపు రంగు స్వరోవ్ స్కీ ఆభరణాలతో ఆమె అందమైన  చీర తయారు చేశారు. అన్‌కట్ డైమండ్ కుందన్ ఆభరణాలతో ఆమె తన వెడ్డింగ్ లుక్ కు మరింత ఆకర్షణను జోడించింది.(Instagram)

దీపికా పదుకొణె ఎరుపు, బంగారు జరీ కంజీవరం చీరలో ఒక దక్షిణ భారత వధువుగా కనిపించింది. యాక్సెసరీల కోసం దీపిక నుదుటున బొట్టు, తలైపట్టి (సాంప్రదాయ హెడ్ బ్యాండ్), పెద్ద జుంకీలు.. ధరించింది. తలపై దుపట్టాతో మరింత క్లాసీ లుక్ తీసుకొచ్చింది.

(7 / 9)

దీపికా పదుకొణె ఎరుపు, బంగారు జరీ కంజీవరం చీరలో ఒక దక్షిణ భారత వధువుగా కనిపించింది. యాక్సెసరీల కోసం దీపిక నుదుటున బొట్టు, తలైపట్టి (సాంప్రదాయ హెడ్ బ్యాండ్), పెద్ద జుంకీలు.. ధరించింది. తలపై దుపట్టాతో మరింత క్లాసీ లుక్ తీసుకొచ్చింది.(Instagram)

కాజోల్ ఎప్పుడూ చాలా సింపుల్ లుక్ ఇష్టపడుతుంది.తన పెళ్లికి గోల్డెన్ బార్డర్ ఉన్న ముదురు ఆకుపచ్చ రంగు చీరను ఎంచుకుంది. క్లాసిక్ గోల్డ్ చోకర్, మ్యాచింగ్ చెవిపోగులు, బంగారు గాజులతో తన లుక్ ను పూర్తి చేసింది.

(8 / 9)

కాజోల్ ఎప్పుడూ చాలా సింపుల్ లుక్ ఇష్టపడుతుంది.తన పెళ్లికి గోల్డెన్ బార్డర్ ఉన్న ముదురు ఆకుపచ్చ రంగు చీరను ఎంచుకుంది. క్లాసిక్ గోల్డ్ చోకర్, మ్యాచింగ్ చెవిపోగులు, బంగారు గాజులతో తన లుక్ ను పూర్తి చేసింది.(Pinterest)

2012 లో సిద్ధార్థ్ రాయ్ కపూర్ తో జరిగిన వివాహానికి విద్యాబాలన్ సవ్యసాచి ముఖర్జీ చేసిన క్లాసిక్ ఎరుపు చీరను ఎంచుకుంది. ఆమె తన ప్రత్యేక రోజు కోసం భారీ బంగారు బార్డర్ ఉన్న ఎరుపు చీరను కట్టుకుంది. ఆమె సౌత్ ఇండియన్ స్టైల్ నెక్లెస్, జతగా చెవిపోగులు, ఎరుపు రంగు దుస్తులతో తన పెళ్లి లుక్ పూర్తి చేసింది.

(9 / 9)

2012 లో సిద్ధార్థ్ రాయ్ కపూర్ తో జరిగిన వివాహానికి విద్యాబాలన్ సవ్యసాచి ముఖర్జీ చేసిన క్లాసిక్ ఎరుపు చీరను ఎంచుకుంది. ఆమె తన ప్రత్యేక రోజు కోసం భారీ బంగారు బార్డర్ ఉన్న ఎరుపు చీరను కట్టుకుంది. ఆమె సౌత్ ఇండియన్ స్టైల్ నెక్లెస్, జతగా చెవిపోగులు, ఎరుపు రంగు దుస్తులతో తన పెళ్లి లుక్ పూర్తి చేసింది.(Pinterest)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు