Meenakshi Chaudhary: చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉండేదో తెలుసుకుని చేశా.. గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి కామెంట్స్-meenakshi chaudhary about lucky bhaskar movie role sumathi says she learned from her mother and dulquer salmaan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Meenakshi Chaudhary: చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉండేదో తెలుసుకుని చేశా.. గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి కామెంట్స్

Meenakshi Chaudhary: చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉండేదో తెలుసుకుని చేశా.. గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Meenakshi Chaudhary On Lucky Bhaskar Role: గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన లక్కీ భాస్కర్ మూవీలో తన రోల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది మీనాక్షి చౌదరి. పూర్తి వివరాల్లోకి వెళితే..

చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉండేదో తెలుసుకుని చేశా.. గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి కామెంట్స్

Meenakshi Chaudhary Comments: ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. అనంతరం రవితేజతో ఖిలాడీలో అట్రాక్ట్ చేసిన హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోలేదు మీనాక్షి. అడవి శేష్ యాక్ట్ చేసిన హిట్ మూవీతో మొదటిసారి మంచి హిట్ అందుకుంది ఈ భామ.

ఇక మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం మూవీలో సెకండ్ హీరోయిన్‌గా చేసిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన ఈ సినిమాకు సార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 31న రిలీజ్ కానున్న సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది మీనాక్షి చౌదరి.

లక్కీ భాస్కర్ ప్రయాణం ఎలా సాగింది? సితార సంస్థలో పనిచేయడం ఎలా ఉంది?

గుంటూరు కారం తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఇది నా రెండో సినిమా. ఈ మంచి సినిమాలో భాగం కావడం నాకు సంతోషంగా ఉంది. సితార సంస్థ నన్ను కుటుంబసభ్యురాలిలా చూస్తుంది. ఈ అవకాశమిచ్చిన చినబాబు గారికి, వంశీ గారికి కృతఙ్ఞతలు. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి గారితో కలిసి లక్కీ భాస్కర్ చేయడం అనేది మంచి అనుభూతి.

నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ ఇందులో ఎందరో యువ ప్రతిభావంతులు ఉన్నారు. బాగా ప్రిపేర్ అయ్యి ఈ సినిమాని ప్రారంభించడం గొప్ప విశేషం. అందువల్ల నాది, దుల్కర్ గారిది తెలుగు మాతృభాష కానప్పటికీ మేము ఒక్కరోజు కూడా ఇబ్బందిపడలేదు. దుల్కర్ సల్మాన్ గారు గొప్ప నటుడు. అలాగే మంచి మనిషి. ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది.

మధ్యతరగతి భార్యగా, తల్లిగా ఇందులో నటించారు. ఏమైనా హోంవర్క్ చేశారా?

డబ్బు కారణంగా మధ్యతరగతి మనిషి జీవితంలో, అతని కుటుంబంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే దాని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నేను మొదటిసారి తల్లి పాత్ర పోషించాను. ఇది నాకు కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించింది. నా చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉండేదో తెలుసుకొని, అందుకు తగ్గట్టుగా పాత్రలో ఒదిగిపోయాను. ఇందులో నేను పోషించిన సుమతి పాత్ర ప్రేక్షకులకు చేరువవుతుందనే నమ్మకం ఉంది.

కెరీర్ స్టార్టింగ్‌లో తల్లి పాత్ర చేయడం రిస్క్ అనిపించలేదా?

మొదటి నుంచి నా ఆలోచన ఏంటంటే మంచి కథలు చేయాలి. మంచి టీంతో పని చేయాలి. వయసుకు తగ్గ పాత్రలే చేయాలనే పరిమితిని నటులు పెట్టుకోకూడదు. ఒకే తరహా పాత్రలు చేస్తే నటీనటులకు కాదు, ప్రేక్షకులకు కూడా బోర్ కూడా కొడుతుంది. అందుకే నటిగా పాత్రల ఎంపికలో వైవిద్యం చూపించాలని అనుకుంటున్నాను. అందుకు తగ్గట్టుగానే సినిమాలను ఎంచుకుంటున్నాను.

సుమతి పాత్ర ఎలా ఉండబోతుంది?

భాస్కర్ దగ్గర ఏమీ లేనప్పుడు తనని తనగా ఇష్టపడుతుంది సుమతి. ప్రేమను పంచే కుటుంబం, బ్రతకడానికి అవసరమైనంత డబ్బు ఉంటే చాలు అనుకునే స్వభావం తనది. అయితే దురాశ, డబ్బు కారణంగా భాస్కర్-సుమతి మధ్య ఏం జరిగింది అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాతో నాకు నటిగా మంచి గుర్తింపు వస్తుందని, మరిన్ని మంచి కథలు వస్తాయని భావిస్తున్నాను.