Expensive Car Actor: 3 కోట్ల లగ్జరీ కారు కొన్న నటుడు- మహేష్ బాబు దగ్గర కూడా ఉన్న ఈ కారు ప్రత్యేకతలు ఇవే!
3 Crore Worth Expensive Car Actor: కోట్లల్లో ఖరీదు చేసే లగ్జరీ కారులను కొని మెయింటేన్ చేసేది కేవలం స్టార్ హీరోలు, హీరోయిన్స్ అనే అనుకుంటాం. కానీ, ఓ నటుడు కూడా అత్యంత ఖరీదైన లగ్జరీ కారును తాజాగా కొనుగోలు చేశాడు. దాని ఖరీదు సుమారు రూ. 3 కోట్లకుపైగా ఉంటుంది. మరి ఆ పాపులర్ యాక్టర్ ఎవరో తెలుసా?
Expensive Car Actor: బాలీవుడ్ సినిమాలతోనే కాకుండా హాలీవుడ్ మూవీస్‌లో కూడా యాక్ట్ చేసి నటుడుగా చాలా పాపులర్ అయ్యాడు రణదీప్ హుడా. హైవే, ఎక్స్‌ట్రాక్షన్, సరబ్జిత్ తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యాక్టర్. తాజాగా రణదీప్ హుడా కొత్త రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యూబీ కారును ఇంటికి తీసుకొచ్చాడు.
ఇటీవల తన 48వ పుట్టినరోజు సందర్భంగా ఈ లగ్జరీ ఎస్యూవీని తనకు తానే గిఫ్ట్‌గా ఇచ్చుకున్నాడు. రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యూబీని ఎక్కువగా అధిక ధనికులు ఇష్టపడుతుంటారు. అలాంటి కార్లలో ఒక్కటి అయిన రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యూబీని రణదీప్ హూడా సొంతం చేసుకోవడం విశేషంగా మారింది.
3 కోట్లకుపైగా
ఉన్నత వర్గాలు అత్యంత ఇష్టపడే కార్లలో ఒకటి అయన దీని ధర రూ. 3 కోట్లకు పైగా (ఆన్-రోడ్ ధర) ఉంటుంది. అయితే, ఇప్పుడు రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్లను భారతదేశంలో స్థానికంగా అసెంబ్లింగ్ చేస్తున్నారు. ఇవి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్ (సీబీయూ) గా భారతదేశానికి తీసుకువచ్చిన మోడళ్లతో పోలిస్తే ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలను మరింత సహేతుకమైన ధర కలిగి ఉంటాయి.
లోకల్‌గా అసెంబ్లింగ్ చేయడంతో రూ. 2.36 కోట్ల రేంజ్ రోవర్ హెచ్ఎస్ఈ డీజిల్ వేరియంట్ ధర రూ. 45 లక్షల వరకు, రూ. 2.60 కోట్ల రేటు ఉన్న రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ పెట్రోల్ వేరియంట్ మరింత చౌకగా రూ. 56 లక్షలు తగ్గింది. కాగా హుడా కొత్త రేంజ్ రోవర్ శాంటోరిని బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో రీగల్ లుక్‌తో మెరిసిపోతుంది.
ఈ లగ్జరీ కారు డిజిటల్ కన్సోల్, కర్వ్డ్ 13.1 అంగుళాల పీవీ ప్రో ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ప్రీమియం లెదర్ అప్హోల్‌స్టరీతోపాటు మరెన్నో యాక్సెస్‌లతో కూడి ఉంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లు, హెడ్-అప్ డిస్‌ప్లే, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్‌తో కూడిన 35-స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టమ్ కూడా ఈ ఎస్యూవీలో ఉంది.
కారు ప్రత్యేకతలు
ఐదు సీట్ల కెపాసిటీ ఉన్న కాన్ఫిగరేషన్‌తో ఉన్న ఈ కారు జెఎల్ఆర్ రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యూబీలో ఉండే మూడు వరుసల లేఅవుట్‌ను అందిస్తుంది. ఈ జెనరేషన్ మోడల్‌లో ఇదే మొదటిసారి. ఇక రేంజ్ రోవర్‌లో 3.0-లీటర్ కెపాసిటీ గల ఆరు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 345బిహెచ్‌పి పవర్, 700ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
3.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 393బిహెచ్ పి పవర్, 550ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌తో జతచేసి ఉన్నాయి. మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్న నాలుగు వీల్స్‌కు పవర్ వెళుతుంది. మెరుగైన ఆన్, ఆఫ్-రోడ్ డైనమిక్స్ కోసం టెర్రైన్ రెస్పాన్స్ 2 ఫీచర్ కూడా ఉంది.
మహేష్ బాబు, మోహన్ లాల్ దగ్గర
ఇటీవల ఈ కొత్త తరం రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేసిన వారిలో రణ్ బీర్ కపూర్, అలియా భట్, నిమ్రత్ కౌర్, ఆదిత్య రాయ్ కపూర్, సోనమ్ కపూర్, మహేష్ బాబు, మోహన్ లాల్, సల్మాన్ ఖాన్, అనన్య పాండే, అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఇక యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, డబుల్ ఇస్మార్ట్ విలన్ సంజయ్ దత్ మరింత సౌకర్యం కోసం అతి విలాసవంతమైన రేంజ్ రోవర్ ఎస్వీని కొనుగోలు చేశారు.