తెలుగు న్యూస్ / ఫోటో /
OTT: ఓటీటీలో బెస్ట్ 5 సినిమాలు.. నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీతోపాటు క్రైమ్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్స్!
OTT Movies To Watch This Month: ఓటీటీలో ఎప్పటికప్పుడు అదిరిపోయే కంటెంట్‌తో సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయన్న విషయం తెలిసిందే. వాటిలో వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ 5 ఓటీటీ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీతోపాటు క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి.
(1 / 6)
2024 ముగింపు దశకు చేరుకోవడంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తప్పక చూడాల్సిన కంటెంట్ కోసం సిద్ధమవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీసులు ప్రతి వారం కొత్త ఓటీటీ రిలీజ్‌లు అందిస్తున్నాయి. దీంతో మూవీ, వెబ్ సిరీస్ ఔత్సాహికులు ఎదురుచూసేవి పుష్కలంగా ఉంటున్నాయి. ఆకట్టుకునే డాక్యుమెంటరీల నుంచి థ్రిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్స్ వరకు ఈ నెలలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల కానున్న టాప్ 5 కొత్త సినిమాల రౌండప్‌ను ఇక్కడ చూసేద్దాం. (Netflix, JioCinema)
(2 / 6)
నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ ఓటీటీ: ఈ డాక్యుమెంటరీ ప్రఖ్యాత నటి నయనతార జీవితంలోకి ఆధారంగా తెరకెక్కింది. నయనతార చేసిన కృష్టి, పడిన కష్టాలు, స్టార్‌డమ్ కోసం ఎదిగిన తీరుని ఇందులో చూపించనున్నారు. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార వివాహం జరగ్గా వారు కవల కుమారులకు తల్లిదండ్రులు అయ్యారు. దీన్ని ఈ డాక్యుమెంటరీలో హైలెట్ చేయనున్నారు. అయితే, ఈ డాక్యుమెంటరీ విడుదలకు ముందు వివాదాన్ని ఎదుర్కొంది, నటుడు ధనుష్ దానిపై దావా వేశారు, ఇది ఇద్దరు తారల మధ్య విభేదాలను సృష్టించింది. అయితే నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ నవంబర్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. (Netflix)
(3 / 6)
డ్యూన్ ప్రొఫెసీ ఓటీటీ: పాల్ అట్రెయిడ్స్ ఎదుగుదలకు 10,000 సంవత్సరాల ముందు సెట్ చేయబడిన వెబ్ సిరీస్‌గా డ్యూన్: ప్రొఫెసీ తెరకెక్కింది. మానవాళిని రక్షించాలని నిశ్చయించుకున్న ఇద్దరు హర్కోనెన్ సోదరీమణుల జీవితాల కథ ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. నవంబర్ 18 నుంచి జియో సినిమా ఓటీటీలో ఈ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. (JioCinema)
(4 / 6)
కిష్కింద కాండం ఓటీటీ: ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళీ, విజయరాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ చిత్రం కిష్కింద కాండం. గ్రిప్పింగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది. ఒరిజినల్ మలయాళ వెర్షన్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో డబ్ అయి ఓటీటీ రిలీజ్ అయింది. (Disney+ Hotstar )
(5 / 6)
మార్టిన్ ఓటీటీ: భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలతో ముడిపడి ఉన్న బ్లాక్ మార్కెట్ ఆపరేషన్‌ను బయటపెట్టిన లెఫ్టినెంట్ బ్రిగేడియర్ అర్జున్ సక్సేనా ఆధారంగా తెరకెక్కిన కన్నడ చిత్రం మార్టిన్: ఇందులో ధృవ సర్జా, అన్వేషి జైన్, వైభవి శాండిల్య నటించారు. ఈ చిత్రం నవంబర్ 23 నుంచి జీ5 ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను సీట్ల అంచున నిలబెట్టే సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కింది.(Zee5 OTT)
(6 / 6)
లక్కీ బస్కర్ ఓటీటీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఓ బ్యాంకు క్యాషియర్ మనీలాండరింగ్ ప్రపంచంలోకి ప్రమాదకరంగా ప్రవేశిస్తాడు. అతను తన ప్రణాళికలతో మరింత ప్రమాదంలో పడతాడు. ఆ తర్వాత ఏమైందనేదే లక్కీ భాస్కర్ కథ. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ తెలుగు చిత్రం లక్కీ భాస్కర్ నవంబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. (YouTube)
ఇతర గ్యాలరీలు