Aishwarya Rajesh on Rashmika: అయ్యో.. రష్మికను నేనలా అనలేదు: ఐశ్వర్య రాజేష్-aishwarya rajesh on rashmika clarifies her statement on srivalli character ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aishwarya Rajesh On Rashmika: అయ్యో.. రష్మికను నేనలా అనలేదు: ఐశ్వర్య రాజేష్

Aishwarya Rajesh on Rashmika: అయ్యో.. రష్మికను నేనలా అనలేదు: ఐశ్వర్య రాజేష్

Hari Prasad S HT Telugu

Aishwarya Rajesh on Rashmika: అయ్యో.. రష్మికను నేనలా అనలేదు అంటూ ఐశ్వర్య రాజేష్ వివరణ ఇచ్చింది. పుష్పలో శ్రీవల్లీ క్యారెక్టర్ విషయంలో ఆమె చేసిన కామెంట్స్ దుమారం రేపిన విషయం తెలిసిందే.

ఐశ్వర్య రాజేష్, రష్మిక మందన్నా

Aishwarya Rajesh on Rashmika: పుష్పలోని శ్రీవల్లీ క్యారెక్టర్ ఇప్పుడు రష్మిక మందన్నా, ఐశ్వర్య రాజేష్ మధ్య చిచ్చు పెట్టింది. ఆ క్యారెక్టర్ లో రష్మిక కంటే తానే ఇంకా బాగా చేసేదాన్నని ఐశ్వర్య అన్నట్లు వార్తలు రావడంతో దుమారం రేగింది. దీంతో ఐశ్వర్య తాజాగా తన కామెంట్స్ పై వివరణ ఇచ్చింది. తానలా అనలేదని, తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పడం విశేషం.

ఈ మేరకు ఆమె ఒక ప్రకటన జారీ చేసింది. రష్మిక నటన తనకు ఎంతగానో నచ్చుతుందనీ అందులో చెప్పింది. ఈ స్టేట్‌మెంట్ ను ట్విటర్ ద్వారా ఆమె షేర్ చేసింది. "నా ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలంటే, ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలో నేను చేయాలనుకుంటున్న రోల్స్ ఎలా ఉండాలనుకుంటున్నారని అడిగారు. నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం.

నాకు నచ్చిన పాత్రలు వస్తే కచ్చితంగా తెలుగు సినిమాలు చేస్తాను అని చెప్పాను. దానికి ఉదాహరణగా పుష్పలో శ్రీవల్లీలాంటి పాత్ర అయితే బాగుంటుందని, అది నాకు సూటవుతుందని అన్నాను" అంటూ ఐశ్వర్య రాజేష్ వివరణ ఇచ్చింది.

దీనిని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె తెలిపింది. "దురదృష్టవశాత్తూ నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. అది కాస్తా నేనేదో రష్మిక మందన్నా ఆ సినిమాలో సరిగా చేయలేకపోయిందన్న అర్థం వచ్చేలా చేశారు. అందుకే దీనిపై వివరణ ఇవ్వాలని అనుకున్నాను. రష్మిక నటన నాకు బాగా నచ్చుతుంది. నా సహచర నటీనటులపై నాకు పూర్తి గౌరవం ఉంది" అని ఐశ్వర్య రాజేష్ వివరణ ఇచ్చింది.

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐశ్వర్య రాజేష్ మంచి పేరు సంపాదించింది. 2015లో కాక ముత్తై సినిమాతో అరంగేట్రం చేసిన ఆమె.. తర్వాత భూమిక, డ్రైవర్ జమున, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, స్వప్న సుందరి, రన్ బేబీ రన్ లాంటి సినిమాల్లో నటించింది.

సంబంధిత కథనం