Aishwarya Rajesh on Rashmika: పుష్పలో రష్మిక కంటే నేను బాగా చేసేదాన్ని.. ఐశ్వర్య రాజేశ్ షాకింగ్ కామెంట్స్-aishwarya rajesh says she would have played srivalli better than rashmika mandanna in pushpa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aishwarya Rajesh On Rashmika: పుష్పలో రష్మిక కంటే నేను బాగా చేసేదాన్ని.. ఐశ్వర్య రాజేశ్ షాకింగ్ కామెంట్స్

Aishwarya Rajesh on Rashmika: పుష్పలో రష్మిక కంటే నేను బాగా చేసేదాన్ని.. ఐశ్వర్య రాజేశ్ షాకింగ్ కామెంట్స్

Aishwarya Rajesh on Rashmika: కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్.. రష్మికా మందన్నాపై షాకింగా కామెంట్స్ చేసింది. పుష్పలో శ్రీవల్లీ పాత్రలో రష్మిక కంటే తను బాగా చేసేదాన్నని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఐశ్వర్య రాజేష్-రష్మికా మందన్నా

Aishwarya Rajesh on Rashmika: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టైటిల్ రోల్‌లో బన్నీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాను ఆదరించారు. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా రూ.350 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. అంతేకాకుండా ఈ సినిమాలో శ్రీవల్లీ పాత్రలో నటించిన రష్మిక మందన్నాకు కూడా మంచి మార్కులు పడ్డాయి. అయితే ఇదిలా ఉంటే రష్మికపై సంచలన వ్యాఖ్యలు చేసింది కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్. శ్రీవల్లీ పాత్ర తను ఇంకా బాగా చేసేదాన్నని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఫర్హానా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న ఐశ్వర్య రాజేశ్.. పుష్పలో రష్మిక పాత్ర గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. "పుష్ప చిత్రంలో రష్మిక.. శ్రీవల్లీగా బాగానే చేసింది. కానీ ఆ పాత్రకు నేను బాగా సూటవుతానని అనుకుంటున్నాను. నాకు కానీ ఆ అవకాశం వచ్చినట్లయితే ఆమె కంటే మెరుగ్గా పర్ఫార్మ్ చేసేదాన్ని." అని ఐశ్వర్య తెలిపింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.

ఐశ్వర్య రాజేశ్ ఫర్హానా సినిమా చేసింది. ఇది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించారు. సెల్వరాఘవన్, జితన్ రమేష్, అనుమోల్, ఐశ్వర్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ ప్రభు నిర్మాతలుగా వ్యవహరించారు.

మరో పక్క రష్మిక మందన్నా పుష్ప-2 సినిమాతో బిజీగా ఉంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా ఈ ముద్దుగుమ్మ నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ఓ మూవీ చేస్తోంది.

సంబంధిత కథనం