Anil Ravipudi: ఈ జెనరేషన్‌కు అది తక్కువ తెలుసుంటుంది.. డౌట్ కూడా రావొచ్చు.. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్-director anil ravipudi comments on how much generation knew plays in utsavam pre release event regina cassandra ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anil Ravipudi: ఈ జెనరేషన్‌కు అది తక్కువ తెలుసుంటుంది.. డౌట్ కూడా రావొచ్చు.. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్

Anil Ravipudi: ఈ జెనరేషన్‌కు అది తక్కువ తెలుసుంటుంది.. డౌట్ కూడా రావొచ్చు.. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Sep 12, 2024 04:12 PM IST

Anil Ravipudi Comments In Utsavam Pre Release Event: సోషల్ మీడియా జెనరేషన్‌లో దాని గురించి కొద్దిగా తక్కువ తెలుసుంటుంది. అసలు అవి ఉన్నాయా అనే అనుమానం కూడా రావొచ్చు అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఉత్సవం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ జెనరేషన్‌కు అది తక్కువ తెలుసుంటుంది.. డౌట్ కూడా రావొచ్చు.. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్
ఈ జెనరేషన్‌కు అది తక్కువ తెలుసుంటుంది.. డౌట్ కూడా రావొచ్చు.. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్

Anil Ravipudi About Utsavam: హీరోయిన్ రెజీనా కాసాండ్రా నటించిన కొత్త సినిమా ఉత్సవం. ఇందులో హీరోగా దిలీప్ ప్రకాష్ నటించాడు. అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన ఈ తెలుగు డ్రామా సినిమా ఉత్సవంను హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ నిర్మించారు.

ఉత్సవం నటులు

ఉత్సవం సినిమాలో ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం వంటి అగ్ర నులు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఇదివరకు విడుదలై ఉత్సవం టీజర్, ట్రైలర్, సాంగ్స్‌ మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

సెప్టెంబర్ 13న ఉత్సవం సినిమా ప్రేక్షుకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ఉత్సవం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరైన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అమ్మ లాంటింది

"ఉత్సవం సినిమా కాన్సెప్ట్ చెప్పినపుడే నాకు బాగా నచ్చింది. నాటకరంగం, రంగస్థలం బ్యాక్ డ్రాప్‌లో డైరెక్టర్ అర్జున్ సాయి చాలా బ్యూటీఫుల్‌గా స్క్రిప్ట్ చేశారు. నాటకం గురించి ఈ జనరేషన్‌కి కొద్దిగా తక్కువ తెలుసుంటుంది. నాటకం నుంచి చాలా గొప్ప నటులు సినిమా రంగాన్ని ఏలారు. నాటకం అమ్మలాంటింది. సినిమా ఆ అమ్మ నుంచి జన్మ తీసుకున్న బిడ్డలాంటింది" అని అనిల్ రావిపూడి అన్నారు.

"ఈ సోషల్ మీడియా జనరేషన్‌లో నాటకాలు ఇంకా ఉన్నాయా అనే అనుమానం రావచ్చు. నాటక ప్రదర్శనలు ఇంకా జరుగుతున్నాయి. నేను, రఘుబాబు అన్నయ్య చాలా నాటకపోటీలకు విశిష్ట అతిథులుగా వెళ్లి టీమ్స్‌కి బ్లెస్ చేసి, బహుమతులు ఇస్తుంటాం" అని అనిల్ రావిపూడి తెలిపారు.

"నాటక రంగం నుంచి ఇప్పటికీ చాలా మంది నటులు సినిమాలకి వస్తున్నారు. నా సినిమాల్లో కూడా చాలా మందికి వేషాలు ఇచ్చాను. అలాంటి నాటకరంగాన్ని నేపథ్యంగా ఎంచుకొని 'ఉత్సవం' సినిమాని చాలా కష్టపడి చేశారు. మీ కష్టానికి తగిన ఫలితం రావాలి. దర్శక నిర్మాతలకు నా స్పెషల్ విషెస్. దిలీప్‌కి ఇది ఫస్ట్ ఫిల్మ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. రెజీనా మంచి రోల్స్ చేస్తుంటారు. ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.

మంచి పాత్రల్లో

"అనూప్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. బ్రహ్మానందం గారి గ్లింప్స్ చూసి షాక్ అయ్యాను. ఆయన్ని ఇంకా మంచి మంచి పాత్రల్లో మనం ఉపయోగించుకోవాలి. రాజేంద్రప్రసాద్ గారు నాకు ఇష్టమైన నటులు. ఉత్సవం పోస్టర్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇందులో ఉండే దాదాపు అందరి నటులతో వర్క్ చేశాను. టీమ్‌లో అందరికీ నా బెస్ట్ విషెస్. ఉత్సవం మంచి విజయోత్సవం జరుపుకోవాలని కోరుంటున్నాను" అని అనిల్ రావిపూడి తన స్పీచ్ ముగించారు.

రైటర్ రమణ గోపిశెట్టి మాట్లాడుతూ.. "సినిమా చేసి సక్సెస్ కొట్టడం చాలా కష్టమైన పని. ఇంతమంది కళాకారులతో సినిమా చేయడం ఒక యుద్ధం. ఆ యుద్ధాన్ని దర్శకుడు అర్జున్ సాయి సక్సెస్‌ఫుల్‌గా చేశాడు. ఇలాంటి గొప్ప సినిమాలో నాకు మాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ. నిర్మాత సురేష్ గారి సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అని తెలిపారు.