Visakhapatnam Metro : విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు.. మొత్తం 42 స్టేషన్లు.. ఈ ప్రాంతాల వారికి గుడ్‌న్యూస్-visakhapatnam metro rail project has a total of 42 stations ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Visakhapatnam Metro : విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు.. మొత్తం 42 స్టేషన్లు.. ఈ ప్రాంతాల వారికి గుడ్‌న్యూస్

Visakhapatnam Metro : విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు.. మొత్తం 42 స్టేషన్లు.. ఈ ప్రాంతాల వారికి గుడ్‌న్యూస్

Dec 03, 2024, 03:41 PM IST Basani Shiva Kumar
Dec 03, 2024, 03:41 PM , IST

  • Visakhapatnam Metro : విశాఖపట్నం.. వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ. అభివృద్ధి తోపాటు.. ట్రాఫిక్ కష్టాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. అటు సిటీ విస్తరిస్తోంది. దీంతో మెట్రో సర్వీసు అనివార్యమైంది. ఏళ్ల తరబడి మెట్రో డిమాండ్ ఉంది. ఎట్టకేలకు అది సాకారం కాబోతోంది.

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తాజాగా.. మొదటి దశలో చేపట్టే పనుల డీపీఆర్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయంపై విశాఖ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే విశాఖలో ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

(1 / 5)

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తాజాగా.. మొదటి దశలో చేపట్టే పనుల డీపీఆర్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయంపై విశాఖ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే విశాఖలో ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. (istockphoto)

డీపీఆర్ ప్రకారం.. విశాఖ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు సుమారు 47 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. ఇందులో గురుద్వారా-పాత పోస్టాఫీసు, తాటిచెట్లపాలెం-చినవాల్తేరు, స్టీల్‌ప్లాంటు-కొమ్మాది మార్గాల్లో మూడు కారిడార్లు ఉండనున్నాయి. వీటి మధ్య మొత్తంగా 42 రైల్వే స్టేషన్లు రానున్నాయి. దీనికోసం 11 వేల 498 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు.

(2 / 5)

డీపీఆర్ ప్రకారం.. విశాఖ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు సుమారు 47 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. ఇందులో గురుద్వారా-పాత పోస్టాఫీసు, తాటిచెట్లపాలెం-చినవాల్తేరు, స్టీల్‌ప్లాంటు-కొమ్మాది మార్గాల్లో మూడు కారిడార్లు ఉండనున్నాయి. వీటి మధ్య మొత్తంగా 42 రైల్వే స్టేషన్లు రానున్నాయి. దీనికోసం 11 వేల 498 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు.(istockphoto)

కారిడార్‌ 1లో వడ్లపూడి, శ్రీనగర్, చినగంట్యాడ, స్టీల్‌ప్లాంటు, గాజువాక, ఆటోనగర్, బీహెచ్‌పీవీ, షీలానగర్, కాకానినగర్, ఎన్‌ఏడీ, మాధవధార, మురళీనగర్, ప్రభుత్వ పాలిటెక్నిక్, విమానాశ్రయం, కంచరపాలెం, తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వారా, ఎంవీపీ కాలనీ, వెంకోజిపాలెం, హనుమంతువాక, మద్దిలపాలెం, ఆదర్శనగర్, జూపార్క్, ఎండాడ, శిల్పారామం, మధురవాడ, కొమ్మాది, క్రికెట్‌ స్టేడియం స్టేషన్లు ఉన్నాయి.

(3 / 5)

కారిడార్‌ 1లో వడ్లపూడి, శ్రీనగర్, చినగంట్యాడ, స్టీల్‌ప్లాంటు, గాజువాక, ఆటోనగర్, బీహెచ్‌పీవీ, షీలానగర్, కాకానినగర్, ఎన్‌ఏడీ, మాధవధార, మురళీనగర్, ప్రభుత్వ పాలిటెక్నిక్, విమానాశ్రయం, కంచరపాలెం, తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వారా, ఎంవీపీ కాలనీ, వెంకోజిపాలెం, హనుమంతువాక, మద్దిలపాలెం, ఆదర్శనగర్, జూపార్క్, ఎండాడ, శిల్పారామం, మధురవాడ, కొమ్మాది, క్రికెట్‌ స్టేడియం స్టేషన్లు ఉన్నాయి.(istockphoto)

కారిడార్‌ 2లో గురుద్వారా- పాత పోస్టాఫీసు మధ్య సుమారు 5 కిలోమీటర్లు ఉండనుంది. ఇందులో మొత్తం స్టేషన్లు ఉన్నాయి. ఆర్టీసీ కాంప్లెక్సు, డాబాగార్డెన్స్, సరస్వతీపార్క్, పూర్ణామార్కెట్, ద్వారకానగర్, పాతపోస్టాఫీసు. కారిడార్‌ 3 తాటిచెట్లపాలెం- చినవాల్తేరు మధ్య 6.75 కిలోమీటర్ల మేర ఉండనుంది. మొత్తం 7 స్టేషన్లు ఉన్నాయి. రైల్వే న్యూకాలనీ, రైల్వేస్టేషన్, అల్లిపురం కూడలి-ఆర్టీసీ కాంప్లెక్సు, సంపత్‌ వినాయగర్‌ ఆలయం, సిరిపురం, ఏయూ, చినవాల్తేరు స్టేషన్లు ఉన్నాయి.

(4 / 5)

కారిడార్‌ 2లో గురుద్వారా- పాత పోస్టాఫీసు మధ్య సుమారు 5 కిలోమీటర్లు ఉండనుంది. ఇందులో మొత్తం స్టేషన్లు ఉన్నాయి. ఆర్టీసీ కాంప్లెక్సు, డాబాగార్డెన్స్, సరస్వతీపార్క్, పూర్ణామార్కెట్, ద్వారకానగర్, పాతపోస్టాఫీసు. కారిడార్‌ 3 తాటిచెట్లపాలెం- చినవాల్తేరు మధ్య 6.75 కిలోమీటర్ల మేర ఉండనుంది. మొత్తం 7 స్టేషన్లు ఉన్నాయి. రైల్వే న్యూకాలనీ, రైల్వేస్టేషన్, అల్లిపురం కూడలి-ఆర్టీసీ కాంప్లెక్సు, సంపత్‌ వినాయగర్‌ ఆలయం, సిరిపురం, ఏయూ, చినవాల్తేరు స్టేషన్లు ఉన్నాయి.(istockphoto)

మూడు కారిడార్ల నిర్మాణానికి 99.75 ఎకరాలు సమీకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు రూ.882 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మెట్రో ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయని.. మొదటి దశ పనులను వీలైనంత చేపట్టాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. మొదటి దశ ప్రాజెక్టులో సవరించిన మార్పులను కేంద్రానికి సమర్పించామని చెబుతున్నారు.

(5 / 5)

మూడు కారిడార్ల నిర్మాణానికి 99.75 ఎకరాలు సమీకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు రూ.882 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మెట్రో ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయని.. మొదటి దశ పనులను వీలైనంత చేపట్టాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. మొదటి దశ ప్రాజెక్టులో సవరించిన మార్పులను కేంద్రానికి సమర్పించామని చెబుతున్నారు.(istockphoto)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు