Balakrishna Ranbir Unstoppable: ఫ్లూటు జింక ముందు ఊదు.. రణ్‌బీర్ నోట బాలయ్య డైలాగులు .. అన్‌స్టాపబుల్ కొత్త ఎపిసోడ్
Balakrishna Ranbir Unstoppable: ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు అంటూ బాలయ్య డైలాగులతో అదరగొట్టాడు బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్. యానిమల్ టీమ్ తో అన్‌స్టాపబుల్ కొత్త ఎపిసోడ్ ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
Balakrishna Ranbir Unstoppable: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి యానిమల్ టీమ్ రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా, సందీప్ రెడ్డి వంగా వచ్చారు. ఈ సందర్భంగా బాలయ్య బాబు పవర్ ఫుల్ డైలాగులో రణ్‌బీర్ అదరగొట్టాడు. ఈ షో కొత్త లిమిటెడ్ సీజన్ లో వైల్డెస్ట్ ఎపిసోడ్ గా ఆహా ఓటీటీ (Aha OTT) ప్రమోట్ చేసిన ఈ తాజా ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది.
రణ్‌బీర్, రష్మిక, సందీప్ రెడ్డి వంగాలతో చేసిన ఈ కొత్త ఎపిసోడ్ ప్రోమోను ఆహా గురువారం (నవంబర్ 23) సాయంత్రం రిలీజ్ చేసింది. అర్ధరాత్రి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ప్రోమోను బట్టి చూస్తే ఇది వైల్డెస్ట్ ఎపిసోడ్ అని స్పష్టంగా అర్థమవుతోంది. తాజా ఎపిసోడ్ ప్రోమో మొదట్లోనే రణ్‌బీర్ నోట బాలయ్య బాబు తెలుగు డైలాగ్ వినిపిస్తుంది.
ఫ్లూటు జింక ముందు ఊదు
ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు అనే తన పవర్ ఫుల్ డైలాగ్ పలకడాన్ని బాలకృష్ణ..రణ్‌బీర్ కు నేర్పించాడు. ఈ డైలాగ్ ను అతడు పర్ఫెక్ట్ చెప్పడం విశేషం. ఆ తర్వాత మరో డైలాగ్ కూడా చెప్పాడు. డు నాట్ ట్రబుల్ ద ట్రబుల్.. ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్.. ట్రబుల్ విల్ ట్రుబుల్ యు.. ఐ యామ్ నాట్ ద ట్రబుల్.. ఐ యామ్ ద ట్రూత్ అనే డైలాగ్ ను కూడా అంతే పవర్ ఫుల్ గా రణ్‌బీర్ చెప్పాడు.
ఈ షోలో బాలయ్య బాబు పాటకు కూడా రణ్‌బీర్ స్టెప్పులేశాడు. సూపర్ హిట్ సాంగ్ పైసా వసూల్ కు బాలకృష్ణతో కలిసే అతడు అదిరిపోయే డ్యాన్స్ చేశాడు.
యానిమల్ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కానుండగా.. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆ టీమ్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చింది. రణ్‌బీర్ తోపాటు రష్మిక మందన్నా, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ఈ షోలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఇక రణ్‌బీర్ బాగుంటాడా.. విజయ్ దేవరకొండ బాగుంటాడా అని అడుగుతూ రష్మికను ఇరుకున పెట్టాడు బాలకృష్ణ.
మరోవైపు యానిమల్ ట్రైలర్ గురువారం (నవంబర్ 23) రిలీజైన విషయం తెలిసిందే. రక్తపాతం ఎక్కువగా ఉన్న ఈ ట్రైలర్ లో రణ్‌బీర్ ఓ కొత్త అవతారంలో కనిపించాడు. ఈ ట్రైలర్ కు ఫిదా అయిన ఫ్యాన్స్.. తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగానే ఎగబడి టికెట్లు కొనుగోలు చేశారు.