Animal trailer: ఫుల్ వయెలెన్స్.. యానిమల్‌గా విశ్వరూపం చూపించిన రణ్‌బీర్.. ట్రైలర్ వచ్చేసింది-animal trailer released today november 23rd ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal Trailer: ఫుల్ వయెలెన్స్.. యానిమల్‌గా విశ్వరూపం చూపించిన రణ్‌బీర్.. ట్రైలర్ వచ్చేసింది

Animal trailer: ఫుల్ వయెలెన్స్.. యానిమల్‌గా విశ్వరూపం చూపించిన రణ్‌బీర్.. ట్రైలర్ వచ్చేసింది

Hari Prasad S HT Telugu

Animal trailer: యానిమల్‌గా విశ్వరూపం చూపించాడు రణ్‌బీర్ కపూర్. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణ్‌బీర్, రష్మిక నటించిన ఈ సినిమా ట్రైలర్ గురువారం (నవంబర్ 23) రిలీజైంది.

యానిమల్ మూవీ ట్రైలర్ లో రణ్‌బీర్ కపూర్

Animal trailer: లవర్ బాయ్ రణ్‌బీర్ కపూర్ ఒక్కసారిగా యానిమల్‌గా మారిపోయాడు. కత్తులు, గొడ్డళ్లు, మెషీన్ గన్స్ తో విశ్వరూపం చూపించాడు. తాజాగా గురువారం (నవంబర్ 23) రిలీజైన యానిమల్ ట్రైలర్ (Animal trailer) అతన్ని పూర్తిగా ఓ కొత్త అవతారంలో చూపించింది.

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ను ఫుల్ వయెలెన్స్ తో నింపేశారు. రణ్‌బీర్ తోపాటు రష్మిక, బాబీ డియోల్, అనిల్ కపూర్ కూడా ఓ పూర్తి భిన్నమైన లుక్ లో కనిపించారు.

తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే కథ

యానిమల్ ట్రైలర్ చూస్తుంటే ఇది మొత్తం తండ్రీ కొడుకుల చుట్టూ తిరిగే కథ అని స్పష్టమవుతోంది. చిన్నతనంలో తండ్రి ప్రేమకు దూరమై యానిమల్ గా మారిన హీరో.. తర్వాత అదే తండ్రి కోసం మరింత రాక్షసంగా ఎలా మారాడో చూపించే ప్రయత్నం మేకర్స్ చేశారు. ట్రైలర్ మొత్తం రణ్‌బీర్, అనిల్ కపూర్, రష్మిక, బాబీ డియోల్ చుట్టూనే తిరిగింది.

ఈ నాలుగు పాత్రలే సినిమాను పూర్తిగా డామినేట్ చేసినట్లు ట్రైలర్ ను బట్టి స్పష్టమవుతోంది. రణ్‌బీర్ చాలా వరకూ తన సినిమాల్లో లవర్ బాయ్ లా సాఫ్ట్ రోల్లోనే కనిపించాడు. అయితే ఈ యానిమల్ లో మాత్రం ఓ డిఫెరెంట్ లెవల్ యాక్షన్ తో ఇరగదీశాడు. కత్తులు, గొడ్డళ్లు, మెషీన్ గన్లతో రక్తపాతం సృష్టించాడు.

ఈ ఏడాది ఆగస్ట్ 11న రిలీజ్ కావాల్సిన ఈ యానిమల్ మూవీ.. ఇప్పుడు డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. మొదట్లో ఈ సినిమాలో రష్మిక పాత్రకు పరిణీతి చోప్రాను అనుకున్నా.. తర్వాత ఆమె మరో సినిమా అంగీకరించడంతో యానిమల్ నుంచి తప్పుకుంది. యానిమల్ మూవీలో రణ్‌బీర్ భార్య గీతాంజలి పాత్రలో రష్మిక కనిపించనుంది.

యానిమల్ మూవీకి ఈ హింస కారణంగా సీబీఎఫ్‌సీ ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ మూవీ నిడివి కూడా ఏకంగా 3 గంటల 22 నిమిషాలు కావడం గమనార్హం. ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ నిడివి ఉన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన నేపథ్యంలో యానిమల్ ఏం చేస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.