Unstoppable with NBK: అన్‍స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్‍కు డేట్ ఖరారు.. రణ్‍బీర్, రష్మికతో బాలకృష్ణ
Unstoppable With NBK: బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‍స్టాపబుల్ తదుపరి ఎపిసోడ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ ఎపిసోడ్‍కు బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గెస్టులు రానున్నారు. వివరాలివే..
Unstoppable With NBK: నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‍స్టాపబుల్ టాక్ షోలో పాన్ ఇండియా ఎపిసోడ్ వచ్చేస్తోంది. ఇప్పటికే సూపర్ పాపులర్ అయిన ఈ అన్‍స్టాపబుల్‍కు తొలిసారి ఓ బాలీవుడ్ హీరో వస్తున్నారు. యానిమల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ హీరో రణ్‍బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. అన్‍స్టాపబుల్ షోలో గెస్టులుగా రానున్నారు. అన్‍స్టాపబుల్ 3లో ఈ తదుపరి ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్‍ను ఆహా ఓటీటీ నేడు అధికారికంగా ప్రకటించింది.
రణ్‍బీర్ కపూర్, రష్మిక, సందీప్ పాల్గొన్న అన్‍స్టాపబుల్ ఎపిసోడ్ నవంబర్ 24వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా నేడు అధికారికంగా ప్రకటించింది. “డేట్ గుర్తుపెట్టుకోండి.. నవంబర్ 24. ఈ సీజన్‍లో వైల్డెస్ట్ ఎపిసోడ్ మీ స్క్రీన్‍లపైకి రానుంది” అని ట్వీట్ చేసింది. ఓ చిన్న వీడియోను కూడా పోస్ట్ చేసింది.
ఈ ఎపిసోడ్‍లో హోస్ట్ బాలకృష్ణ డైలాగ్‍ను రణ్‍బీర్ చెప్పినట్టు సమాచారం బయటికి వచ్చింది. “ప్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు” అంటూ లెజెండ్ చిత్రంలోని డైలాగ్‍ను రణ్‍బీర్‌తో బాలయ్య చెప్పించారట. అలాగే, బాలయ్య, రణ్‍బీర్, రష్మిక కలిసి ఓ పాట స్టెప్పులేసినట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా ఈ ఎపిసోడ్‍లో సందడి బాగానే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
యానిమల్ సినిమా డిసెంబర్ 1వ తేదీన హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండటంతో తెలుగులోనూ ఈ సినిమాకు క్రేజ్ ఉంది. దీంతో తెలుగు ప్రమోషన్లను కూడా గట్టిగా చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది. అన్‍స్టాపబుల్ లాంటి పాపులర్ టాక్ షోతోనే యానిమల్ తెలుగు ప్రమోషన్లను షురూ చేస్తోంది.
యానిమల్ టీమ్‍తో అన్‍స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ రెండు రోజుల క్రితమే పూర్తయింది. ఈ కార్యక్రమం కోసం రణ్‍బీర్, రష్మిక, సందీప్ హైదరాబాద్ వచ్చారు. షూటింగ్‍లో పాల్గొన్నారు.
వన్డే ప్రపంచకప్ వేదికగానూ యానిమల్ టీమ్ ప్రమోషన్లను చేస్తోంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‍కు రణ్‍బీర్ హాజరయ్యారు. సినిమా గురించి కూడా మ్యాచ్ ముందు మాట్లాడారు. ఫ్యామిలీ క్రైమ్ డ్రామాగా యానిమల్ ఉంటుందని, కుటుంబం కోసం ఏమైనా చేసే క్యారెక్టర్‌ను తాను పోషిస్తున్నానని చెప్పారు. యానిమల్ టీజర్ సహా ఇప్పటి వరకు వచ్చిన మూడు పాటలు ఆకట్టుకున్నాయి.
టాపిక్