Sprouts Upma Recipe । మొలకలతో ఉప్మా.. దీని రుచి విభిన్నం, ఆరోగ్యం పదిలం!
Sprouts Upma Recipe: ఉప్మాను ఎప్పుడూ చేసేలా కాకుండా, వైరైటీగా మొలకెత్తిన పెసర్లతో చేసుకోవచ్చు. దీని రుచి ప్రత్యేకమైనది. రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం.
Sprouts Upma Recipe (unsplash)
Healthy Breakfast Recipes: ఉప్మా గురించి తెలియని వారుండరు, ఇది సులభంగా తయారు చేసుకోగలిగే ఒక ఆరోగ్యకరమైన అల్పాహారం. అభిరుచిని బట్టి క్యారెట్లు, టొమాటోలు, బీన్స్ అంటూ వివిధ రకాల వెజిటెబుల్స్ వేసి కూడా ఈ వంటకాన్ని చేసుకోవచ్చు. ఇలాంటి ఉప్మాను మీరు చాలా సార్లు తినే ఉంటారు. అయితే మీరెపుడైనా మొలకలతో చేసిన ఉప్మా తిన్నారా? మొలకెత్తిన పెసర్లు, ఉసిరి కలిపి విభిన్నమైన ఫ్లేవర్ లో ఉప్మాను చేసుకోవచ్చు. దీని రుచి ప్రత్యేకమైనది, ఈ అల్పాహారం కూడా ఎంతో ఆరోగ్యకరమైనది. మొలకల ఉప్మా రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. మీరూ ఓ సారి ప్రయత్నించి చూడండి.
Sprouts Upma Recipe కోసం కావలసినవి
- రవ్వ - 1.5 కప్పులు
- పెసరి మొలకలు - 1 కప్పు
- బీన్స్ - 200 గ్రాములు
- క్యారెట్ - 1
- ఉల్లిపాయలు - 1
- కరివేపాకు - 1 రెమ్మ
- ఉసిరికాయ తురుము లేదా నిమ్మరసం - 1 టీస్పూన్
- పచ్చిమిర్చి - 1
- కొత్తిమీర - 1 టేబుల్ స్పూన్
- ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత
- మినపపప్పు - 1 టీస్పూన్
- ఆవాలు - 1 టీస్పూన్
- నూనె - 1 టేబుల్ స్పూన్
- నీరు - 3.5 కప్పులు
మొలకల ఉప్మా తయారీ విధానం
- ముందుగా బీన్స్, క్యారెట్, ఉల్లిపాయలను కడిగి చిన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కరివేపాకును కడిగి ఆరబెట్టుకోవాలి.
- మొదటగా ఒక కడాయిలో, ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి, అందులో ఆవాలు, మినపపప్పు వేసి దోరగా వేయించండి.
- ఆపైన తరిగిన ఉల్లిపాయలు, బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉడికించండి, పైనుంచి పెసర్ల మొలకలు వేసి మృదువుగా కలపండి.
- కొద్దిగా ఉడికిన తర్వాత రోస్ట్ చేసిన రవ్వ, తురిమిన ఉసిరి వేయండి, రవ్వ బంగారు-గోధుమ రంగులోకి వచ్చే వరకు మీడియం మంట మీద కలుపుతుండండి.
- ఇప్పుడు నీరు పోసి, రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలపండి, కలుపుతూ ఉడికించండి.
- చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే మొలకల ఉప్మా రెడీ.
ఈ ఉప్మాను నేరుగా లేదా మీకు నచ్చిన చట్నీ, ఊరగాయతో కలుపుకొని తినవచ్చు. మొలకలతో ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీని లింక్ క్లిక్ చేసి చూడొచ్చు.
సంబంధిత కథనం
టాపిక్