Kedarnath Yatra 2023 । కేదార్‌నాథ్ ధామ్ సందర్శిస్తున్నారా? యాత్ర పూర్తి వివరాలు ఇవిగో!-kedarnath yatra 2023 dates journey fares where to stay tour bookings and all the details you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kedarnath Yatra 2023 । కేదార్‌నాథ్ ధామ్ సందర్శిస్తున్నారా? యాత్ర పూర్తి వివరాలు ఇవిగో!

Kedarnath Yatra 2023 । కేదార్‌నాథ్ ధామ్ సందర్శిస్తున్నారా? యాత్ర పూర్తి వివరాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu
Apr 27, 2023 05:12 PM IST

Kedarnath Yatra 2023 Details: మీరు కేదార్ నాథ్ యాత్ర (Kedarnath Tour) చేస్తుంటే.. యాత్ర ఖర్చు, వసతి సౌకర్యాలు, ప్రయాణ మార్గాలు మొదలైన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Char Dham Yatra 2023- Kedarnath
Char Dham Yatra 2023- Kedarnath (Pinterest/ HT Photo )

Kedarnath Yatra 2023 Details: ప్రసిద్ధ కేదార్‌నాథ్ ధామ్ యాత్రకు ద్వారాలు తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి , యమునోత్రిని కలిపి చార్ ధామ్‌ యాత్ర (Char Dham Yatra) గా పేర్కొంటారు. ఇందులో గంగోత్రి, యమునోత్రి యాత్రకు బుకింగ్ పోర్టల్‌లు ఏప్రిల్ 22 నుండి తెరుచుకోగా, కేదార్‌నాథ్ ధామ్ తలుపులు ఏప్రిల్ 25 నుండి తెరుచుకున్నాయి, బద్రీనాథ్ ధామ్ ఆలయ తలుపులు ఏప్రిల్ 27 నుండి తెరుచుకున్నాయి. ఈ నాలుగు పవిత్ర స్థలాలను సందర్శించడానికి ఈ సీజన్ అనుకూలమైనది, సందర్శనకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు దర్శనం కోసం బుకింగ్, రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే చార్ ధామ్ యాత్ర కోసం IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీలను కూడా ప్రకటించింది.

చార్ ధామ్ యాత్రలో ఒకటైన కేదార్ నాథ్ ఆలయాన్ని (Kedarnath Lord Shiva Temple) ఒక్కసారైనా దర్శించుకోవాలని చాలా మంది యాత్రికులు భావిస్తారు. మీరు తొలిసారిగా కేదార్ నాథ్ యాత్ర (Kedarnath Tour) చేస్తుంటే.. యాత్ర ఖర్చు, వసతి సౌకర్యాలు, ప్రయాణ మార్గాలు మొదలైన వాటి గురించి తికమకపడవచ్చు. అయితే ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ అందిస్తున్నాం, తెలుసుకోండి.

కేదార్‌నాథ్ యాత్ర ఎన్ని రోజులు

కేదార్‌నాథ్ యాత్రకు కనీసం మూడు నుంచి నాలుగు రోజుల సమయం కావాలి. మీరు రోడ్డు లేదా రైలు మార్గంలో మొదట గౌరీకుండ్ చేరుకోవాల్సి ఉంటుంది. గౌరీకుండ్ నుండి కేదార్‌నాథ్ ఆలయానికి రోడ్డు సౌకర్యం లేదు, అయితే 18 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ ఉంది. నడక మార్గంలో చేరుకోవడానికి 15-18 గంటలు పడుతుంది. గుర్రపు స్వారీ చేస్తూ కూడా చేరుకోవచ్చు. మరింత త్వరగా చేరుకునేందుకు ఆలయం సమీపం వరకు హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంది.

కేదార్ నాథ్ ధామ్ ఎలా చేరుకోవాలి

కేదార్‌నాథ్‌కు వెళ్లడానికి, మీరు ఢిల్లీ లేదా ఏదైనా నగరం నుండి హరిద్వార్ లేదా డెహ్రాడూన్‌కి రైలు, బస్సు లేదా విమానంలో ప్రయాణించవచ్చు. ఢిల్లీ నుండి కేదార్‌నాథ్ దూరం దాదాపు 466 కి.మీ. కేదార్‌నాథ్‌కు నేరుగా రైలు సౌకర్యం లేదు. మీరు బస్సు లేదా రైలులో తక్కువ ఖర్చుతో డెహ్రాడూన్ చేరుకోవచ్చు. డెహ్రాడూన్ నుంచి గౌరీకుండ్ వరకు రోడ్డు మార్గం ఉంది. మొత్తంగా. ఢిల్లీ నుండి కేదార్‌నాథ్ చేరుకోవడానికి పూర్తిగా ఒక రోజు పట్టవచ్చు.

కేదార్‌నాథ్ కోసం హెలికాప్టర్ బుకింగ్

మీకు ఎక్కువ సమయం లేకుంటే లేదా కాలినడకన వెళ్ళలేకపోతే, మీరు డెహ్రాడూన్ నుండి కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్‌లో (Helicopter To Kedarath) ప్రయాణించడానికి నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు www.heliyatra.irctc.co.inలో హెలీ సర్వీస్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రయాణీకుడు హెలీ ఆపరేటర్ కంపెనీని ఎంచుకుని, ప్రయాణం చేసే తేదీ, స్లాట్ సమయాన్ని పూరించాలి. టికెట్ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి.

కేదార్‌నాథ్ ధామ్ సందర్శన ఖర్చులు - Kedarnath Yatra Fares

రైలు లేదా బస్సులో ఢిల్లీ నుండి డెహ్రాడూన్ టికెట్ 300 నుండి 1000 రూపాయల వరకు అందుబాటులో ఉంటుంది. మీరు డెహ్రాడూన్ నుండి గౌరీకుండ్ వరకు బస్సులో వెళితే అది 300 నుండి 500 రూపాయల వరకు అవుతుంది. ఢిల్లీ నుండి గౌరీకుండ్‌కు నేరుగా బస్సు సర్వీసు కూడా అందుబాటులో ఉంది, దీని ఛార్జీ రూ. 500-1000 వరకు ఉంది. మీరు హెలీ సర్వీస్ తీసుకుంటుంటే, సిర్సి నుండి ఒక వ్యక్తికి రూ.5500, గుప్తకాశీకి రూ.7740. వరకు అవుతుంది. గౌరీకుండ్ నుండి కేదార్‌నాథ్ వరకు పల్లకీ, గుర్రం కూడా బుక్ చేసుకోవచ్చు.

ఇక వసతి కూడా ఫ్యామిలీకి, సింగిల్స్ కి వేర్వేరుగా ఉంటాయి. ఇవి రూ.1000 నుంచి మొదలవుతాయి.

WhatsApp channel

సంబంధిత కథనం