Pista for Daily: రోజుకు రెండు పిస్తాలు తినండి చాలు, ఆరోగ్యానికి ఢోకా ఉండదు
Pista for Daily: ఆకుపచ్చని పిస్తాలు కాస్త ఖరీదైనవే. కానీ ఇవి చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ప్రతిరోజూ రెండు పిస్తాలు తినడం అలవాటు చేసుకోండి. ఎంతో మేలు చేస్తాయి.
Pista for Daily: ఆకుపచ్చని రత్నాల్లా మెరిసిపోతూ ఉంటాయి పిస్తాలు. ఇవి పోషకాలతో నిండిన పవర్ హౌస్‌లు. మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలను ఇవి కలిగి ఉంటాయి. రోజువారీ ఆహారంలో రెండు పిస్తాలను తినడం అలవాటు చేసుకుంటే నెల రోజుల్లోనే మీకు ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఉదయాన బ్రేక్ ఫాస్ట్ సమయంలో రెండు పిస్తాలను తినడం అలవాటు చేసుకోండి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు అవసరమైనవి. గుండె ఆరోగ్యం కాపాడడం దగ్గర నుంచి బరువు తగ్గించడం వరకు పిస్తాలు ఎంతో మేలు చేస్తాయి.
పిస్తాలో ప్రోటీన్, మంచి కొవ్వులు, పిండి పదార్థాలు, ఫైబర్ నిండి ఉంటాయి. ఒక పిస్తాలో నాలుగు క్యాలరీలు లభిస్తాయి. అలాగే విటమిన్ b6 కూడా దీనిలో ఉంటుంది. అలాగే శరీర కణాలను దెబ్బ తినకుండా రక్షించే యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఈ కూడా ఇందులో అధికంగా ఉంటుంది. పిస్తాలు తినడం వల్ల రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజుకు రెండు పిస్తాలు తినడం అలవాటు చేసుకోవాలి.
గుండె ఆరోగ్యానికి
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండాలి. మంచి కొలెస్ట్రాల్ అధికంగా ఉండాలి. పిస్తా పప్పులు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలో తగ్గుతాయి. సిస్టోలిక్ రక్తపోటు తగ్గుతుంది. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడతాయి.
బరువు తగ్గేందుకు
బరువును తగ్గించేందుకు ఉపయోగపడే ఆహారాల్లో పిస్తా ఒకటి. ఎవరైతే బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారో వారు ప్రతి రోజూ రెండు పిస్తాలను ఆహారంలో భాగంగా తీసుకోండి. దీనిలో అధిక ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇది పొట్ట నిండిన ఫీలింగ్ ను కలిగేలా చేస్తుంది. కాబట్టి ఇతర ఆహారాలను మీరు తక్కువగా తింటారు. పిజ్జాలు, బర్గర్లు, చెగోడీలు, చిప్స్ తినే బదులు పిస్తా పప్పులను స్నాక్ గా తీసుకోవడానికి ప్రయత్నించండి.
డయాబెటిస్ ఉన్నవారు పిస్తా పప్పులను తింటే మంచిది. పిస్తాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. మధుమేహం అదుపులో ఉండాలనుకుంటే ప్రతిరోజూ నాలుగు పిస్తా పప్పులను తినేందుకు ప్రయత్నించండి.
పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా పని చేయగలం. కాబట్టి పొట్ట ఆరోగ్యం కోసం పిస్తా పప్పులను ప్రతిరోజూ తినడం మంచిది. ఇందులో ఉండే ఫైబర్ ప్రోబయోటిక్ గా పనిచేస్తుంది. పొట్టలోని మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బాదం కంటే పిస్తా తినడం వల్లే పొట్టలోని మంచి బ్యాక్టీరియా పెరుగుతుందని ఒక అధ్యయనం తేల్చింది.
పిస్తా పప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. లూటీన్, జియాక్సంతిన్ వంటి ప్రత్యేకమైన యాంటీ యాక్సిడెంట్లు మన శరీరానికి చాలా అవసరం. అవి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వయసు పెరగడం వల్ల వచ్చే కంటి సమస్యల నుండి రక్షిస్తాయి.
పిస్తాను తినడం వల్ల శరీరంలోని రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తనాళాలు సంకోచించకుండా విస్తరించడానికి ఉపయోగపడతాయి. దీనివల్ల రక్తప్రసారం శరీరానికి సవ్యంగా జరుగుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది.
ప్రతిరోజూ పిల్లలకు రెండు పిస్తాలు తినిపించడం వల్ల మెదడు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఉండే లూటీన్, జియాక్సంతిన్ వంటి సమ్మేళనాలు అభిజ్ఞా పనితీరుని మెరుగుపరుస్తాయి. మానసిక క్షీణత నుండి రక్షిస్తాయి. మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడతాయి.
టాపిక్