Prunes: రోజుకు కేవలం నాలుగు ప్రూన్స్ తినండి చాలు, భవిష్యత్తులో ఈ వ్యాధి వచ్చే అవకాశమే ఉండదు-just eat four prunes a day and there will be no chance of getting this disease in future ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Prunes: రోజుకు కేవలం నాలుగు ప్రూన్స్ తినండి చాలు, భవిష్యత్తులో ఈ వ్యాధి వచ్చే అవకాశమే ఉండదు

Prunes: రోజుకు కేవలం నాలుగు ప్రూన్స్ తినండి చాలు, భవిష్యత్తులో ఈ వ్యాధి వచ్చే అవకాశమే ఉండదు

Haritha Chappa HT Telugu
Sep 06, 2024 09:30 AM IST

Prunes: ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి, ఎముక బలాన్ని పెంచడటానికి ప్రూన్స్ చాలా అవసరం. ఎముక నిర్మాణం కోసం ప్రతిరోజూ 4 నుండి 6 ప్రూన్స్ తినాలని అధ్యయనం చెబుతోంది. .

ప్రూన్స్ తో వ్యాధినిరోధక శక్తి
ప్రూన్స్ తో వ్యాధినిరోధక శక్తి

ఎముక వ్యాధులు రాకుండా ఉండాలన్నా, ఎముక బలాన్ని పెంచాలన్నా కాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవాలని ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. అయితే ఎముకలకు పాల కన్నా ఎక్కువ శక్తినిచ్చేవి ప్రూన్స్. పాలల్లో ఉండే లాక్టోస్ పడని వారు పాలు, పెరుగు, చీజ్ లాంటి పాల ఉత్పత్తులు తినలేదు. అలాంటివారికి ఎముక బలాన్ని పెంచేందుకు ప్రూన్స్ ఉపయోగపడతాయి. పెన్ స్టేట్ ప్రొఫెసర్ మేరీ జేన్ డిసౌజా నేతృత్వంలో 2024 లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ నాలుగు ప్రూన్స్ తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయని, ఎముక వ్యాధులు రాకుండా ఉంటాయని చెబుతోంది. అంతేకాదు ప్రూన్స్ తినడం వల్ల ఎముక పగుళ్ల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఎముకకు ఎలాంటి నష్టం కలగకుండా ఉంటుంది.

ప్రూన్స్ అంటే

ప్రూన్స్ నల్లగా ఉంటాయి. అన్ని సూపర్ మార్కెట్లలో లభిస్తాయి. ఇవి డ్రైఫ్రూట్స్ జాబితాలోకే వస్తాయి. ఎండిన ప్లమ్ పండ్లను ప్రూన్స్ అంటారు. వీటిని మహిళలు, పిల్లలు, వృద్ధులు తినడం చాలా అవసరం. ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో, ఎముక బలం తగ్గిపోతుంది. అలాంటి వారు ప్రూన్స్ తినాల్సిన అవసరం ఉంది.

ఆర్థరైటిస్ రాకుండా…

వయసు పెరుగుతున్న కొద్దీ ఆర్ధరైటిస్ వ్యాధి ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాని బారిన పడకుండా ఉండాలంటే ముందుగానే ప్రూన్స్ రోజూ తినడం మొదలుపెట్టాలి. లేకుంటే ఎముకలు బలహీనంగా మారి త్వరగా విరిగిపోయే అవకాశం ఉంది. ఎముక ఆరోగ్యానికి ఈస్ట్రోజెన్ చాలా అవసరం. మెనోపాజ్ అయిన మహిళల్లో పునరుత్పత్తి హార్మోన్ అయిన ఈస్ట్రోజెన్ క్షీణిస్తుంది, ఇది ఎముకకు నష్టాన్ని కలగచేస్తుంది. బోలు ఎముకల వ్యాధికి చికిత్స లేనప్పటికీ, ప్రతిరోజూ ఎండు ద్రాక్షను తినడం వల్ల ఎముక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

అధ్యయన ఫలితాలు

రుతుక్రమం ఆగిపోయిన మహిళలపై 12 నెలల పాటు ఈ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో భాగంగా మహిళలను మూడు విభాగాలుగా విడదీశారు. ఒక సమూహంలోని మహిళలకు ప్రూన్స్ ను తినేందుకు ఇవ్వలేదు. రెండవ సమూహంలోని వారికి రోజుకు 4 నుండి 6 ప్రూన్స్ తినేందుకు ఇచ్చారు. మూడవ సమూహంలోని మహిళలకు రోజుకు 10 నుండి 12 ప్రూన్స్ తినమని ఇచ్చారు. ఒక సంవత్సరం తరువాత, ఎండు ద్రాక్ష తినని మహిళలు తక్కువ ఎముక ద్రవ్యరాశి సాంద్రత కలిగి ఉన్నట్టు గుర్తించారు. వారిలో ఎముక బలహీనంగా మారింది. రోజూ ఎండు ద్రాక్ష తినే మహిళల ఎముక సాంద్రత, ఎముక బలం, నిర్మాణంలో మంచి మెరుగుదల కనిపించింది.

ప్రూన్స్ ఎన్ని తినాలి?

ప్రూన్స్ మంచి చేస్తాయి కదా అని ఎన్ని పడితే అన్ని రోజూ తినేయకండి. పరిశోధకులు చెబుతున్న ప్రకారం ప్రతిరోజూ 4 నుండి 6 ప్రూన్స్ ను తింటే చాలు. 10 నుండి 12 ప్రూన్స్ తినడం వల్ల అదనపు ప్రయోజనాలు ఉన్నప్పటికీ అది తీవ్ర అలసటకు కారణం అవుతుంది. కాబట్టి ఎముకల వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ నాలుగు ప్రూన్స్ తినడం మంచిది.

Whats_app_banner