Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి
Beauty Tips In Telugu : చర్మం కోసం వివిధ రకాలు ఉత్పత్తులను వాడుతాం. వాటిలో రసాయనాలు ఉంటాయి. అందుకే డ్రై ఫ్రూట్స్‌తో మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోండి.
చర్మం ఎప్పుడూ మెరిసిపోవాలని అందరూ కోరుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఖరీదైన క్రీములు కొనడానికి తగినంత డబ్బు ఉండదు. కెమికల్స్‌తో కూడిన ఇలాంటి క్రీములను వాడేందుకు కొందరు ఇష్టపడరు. మీరు వారిలో ఒకరైతే ఇక్కడ ఒక సూపర్ ఐడియా ఉంది. చర్మ సంరక్షణకు క్రీములు ఎక్కువగా వాడకూడదు. వీటితో భవిష్యత్తులో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సహజంగానే చర్మాన్ని మెరిసేలా చేసుకోవాలి.
అందమైన చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం చర్మాన్ని కాంతివంతం చేయడం, ఆయుర్వేద చికిత్స, అల్లోపతి, హోం రెమెడీస్ ఇలా రకరకాల టెక్నిక్స్‌ని ప్రయత్నిస్తారు. ఖరీదైన క్రీములను కొన్నా కూడా కొన్నిసార్లు ప్రయోజనం ఉండదు. కెమికల్స్‌తో కూడిన క్రీములలో రసాయనాలు ఉంటాయి. మీరు ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి కొత్త ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యంతో పాటు ముఖ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడతాయి.
తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా, డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి, అందానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇది శరీరానికి, చర్మానికి సమృద్ధిగా ప్రయోజనాలను అందిస్తుంది. మీ ముఖం మెరిసిపోవడానికి మీరు ప్రతిరోజూ తీసుకోగల కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇక్కడ ఉన్నాయి.
బాదం
బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఇది మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చర్మం ఎల్లప్పుడూ మెరుస్తూ ఉంటుంది.
ఖర్జూరం
ఇది కూడా రోజూ తినవచ్చు. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఖర్జూరం తింటే ముఖంపై మొటిమలు తగ్గుతాయి. ఎండుద్రాక్షలోని ఐరన్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది చర్మం గ్లో పెంచుతుంది. మురికిని తొలగించడంలో సహాయపడుతుంది.
అంజీర్
ఈ పండ్లలో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. అంజీర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి ముఖంలోని మొటిమలను తొలగించడంలో సహాయపడతాయి. రోజూ ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా చర్మం మెరుస్తుంది.
వాల్ నట్స్
వాల్ నట్స్ లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులోని విటమిన్ బి చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది.
జీడిపప్పు
జీడిపప్పులో విటమిన్ ఇ, సెలీనియం మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. ఇది మొటిమలకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది ముఖంపై మొటిమల మచ్చలను కూడా సులభంగా తొలగిస్తుంది.
డ్రైఫ్రూట్స్ మీ మెుత్తం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన మీకు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే పైన చెప్పినవాటిలో కొన్నింటిని నానబెట్టి తింటే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అయితే డ్రైఫ్రూట్స్ ఎక్కువగా కూడా తీసుకోకూడదు. మితంగానే తినాలి. అప్పుడే ప్రయోజనాలు మీకు దక్కుతాయి. చర్మాన్ని కూడా మెరిసేలా చేస్తాయి.