Morning Drink: ప్రతి ఉదయం ఖాళీ పొట్టతో ఇలా తులసి ఆకుల రసాన్ని తాగండి చాలు, మంచి మార్పులు కనిపిస్తాయి
Morning Drink: ఉదయాన లేచిన వెంటనే బ్రేక్ ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచించకండి, ముందుగా ఖా ళీ పొట్టతో తులసి ఆకుల రసాన్ని తాగండి. ఇలా ఒక రెండు వారాలు తాగి చూడండి. మీలో వచ్చే సానుకూల మార్పులను మీరే గుర్తిస్తారు.
Morning Drink: ఉదయం లేచాక అందరూ ఆలోచించేది ముందుగా టీ తాగాలా? కాఫీ తాగాలా? అని. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ ఏం చేయాలో ఆలోచిస్తారు. వీటన్నింటినీ ముందుగా ఖాళీ పొట్టతో తులసి ఆకుల రసాన్ని తాగాలని గుర్తుపెట్టుకోండి. ఆయుర్వేదం ప్రకారం ఈ తులసి ఆకుల రసాన్ని ఖాళీ పొట్టతో తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ డి, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుల రసాన్ని ప్రతిరోజూ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఖాళీ పొట్టతో తులసి ఆకుల రసాన్ని తాగిన తర్వాత...కాస్త గ్యాప్ ఇచ్చాకే ఏవైనా తినడం, తాగడం చేయండి.
తులసి ఆకుల రసం ఎందుకు తాగాలి?
ఖాళీ పొట్టతో తులసి ఆకుల రసాన్ని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని ఇది అదుపులో ఉంచుతుంది. ఈ ఆకుల రసంలో అడాప్టోజెన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఒత్తిడి స్థాయిలు పెరగకుండా తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఆకులు నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తాయి. రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తాయి. దీనివల్ల మనస్సు, శరీరం రిలాక్స్ గా ఉంటాయి. కాబట్టి ఒత్తిడి దానంతట అదే తగ్గుతుంది.
జీర్ణ వ్యవస్థకు తులసి ఆకుల రసం ఎంతో మేలు చేస్తుంది. ఖాళీ పొట్టతో దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే పేగు కదలికలు చురుగ్గా ఉంటాయి. జీర్ణవ్యవస్థ సమతుల్యంగా ఉంటుంది. సమతుల్యమైన PH స్థాయిలు కూడా ఉంటాయి.
డయాబెటిస్ వారికి
డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ప్రతిరోజు తులసి ఆకుల రసాన్ని తాగడం చాలా ముఖ్యం. ఇవి ప్యాంక్రియాటిక్ కణాల పనితీరును సక్రమంగా ఉండేలా చేస్తాయి. ఇన్సులిన్ విడుదల చేయడంలో రక్తంలో చక్కెర స్థాయిల నుండి నియంత్రించడంలో సహాయపడతాయి. తులసి ఆకులు రసం తాగడం వల్ల కార్బోహైడ్రేట్లు, కొవ్వులు త్వరగా జీర్ణం అవుతాయి.
ప్రతిరోజూ తులసి ఆకుల రసాన్ని తాగడం వల్ల యాంటీ మైక్రోబయల్ లక్షణాలు శరీరానికి అందుతాయి. సాధారణ దగ్గు, జలుబు వంటివి రాకుండా ఉంటాయి. ఈ ఆకుల రసాన్ని తాగడం వల్ల నోటి దుర్వాసన వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. నోటి బ్యాక్టీరియాలు రాకుండా ఇది శుభ్రపరుస్తుంది.
తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే శక్తిని ఇస్తాయి. కాబట్టి ప్రతిరోజూ తులసి ఆకుల రసాన్ని తాగితే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. అలాగే చర్మానికి కూడా ఇది కాంతిని ఇస్తుంది. శరీరం నుండి వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా అడ్డుకుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా తులసి రసం ఎంతో మేలు చేస్తుంది.
ఆయుర్వేద వైద్యులు చెబుతున్న ప్రకారం ప్రతిరోజు ఈ తులసి ఆకుల రసాన్ని తాగడం వల్ల ఆస్తమా, బ్రాంకైటీస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వేడిగా మరుగుతున్న నీటిలో తులసి ఆకులను వేసి ఆవిరిని పీల్చడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. ఈ తులసి ఆకులను నమలడం లేదా తులసి ఆకుల రసాన్ని తాగడం వల్ల శరీరంలో క్యాన్సర్ కారకాలు చేరకుండా ఉంటాయి. క్యాన్సర్ కణాల అభివృద్ధిని ఇది అడ్డుకుంటుంది. ముఖ్యంగా నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి ఈ తులసి ఆకులకు ఉంది.