Peach In Pregnancy । గర్భిణీ స్త్రీలు పీచ్ ఫ్రూట్ తినొచ్చా? తింటే ఏమవుతుంది?!
Peach Fruit In Pregnancy Benefits: గర్భిణీ స్త్రీలు పీచ్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి
Peach In Pregnancy Benefits: గర్భధారణ సమయంలో స్త్రీలు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో స్త్రీ శరీరం అనేక మార్పులకు గురవుతుంది. మానసిక ఆందోళనలు కూడా తలెత్తుతాయి. వీటిని ఎదుర్కోవటానికి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భిణీ స్త్రీలు తినదగిన పండ్లలో పీచ్ ఫ్రూట్ కూడా ఉంటుంది. దీనిని తినడం గర్భిణీలకు పలు విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. పీచ్ ఫ్రూట్ లలో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి అవసరమైన అన్ని పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు గర్భిణీ స్త్రీకే కాదు, పుట్టబోయే బిడ్డకు కూడా మేలు చేస్తాయి. గర్భిణీ స్త్రీలు పీచ్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి
మలబద్ధకం నివారణ
గర్భధారణ సమయంలో స్త్రీలకు మలబద్ధకం అనేది ఒక సాధారణ సమస్య. ఈ సమస్య నుండి బయటపడటానికి పీచ్ ఫ్రూట్ తినవచ్చు. పీచెస్‌లో ఉండే ఫైబర్ కంటెంట్ ప్రేగులను శుభ్రపరచడంలో, మలబద్ధకం సమస్యను తొలగించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
మధుమేహంకు అడ్డుకట్ట
గర్భధారణ సమయంలో మధుమేహం సమస్య కూడా ఇబ్బంది పెట్టవచ్చు. అయితే పీచ్ ఫ్రూట్ లో ఉండే పీచు పదార్థం కడుపును ఎక్కువ నిండుగా ఉంచుతుంది, ఈ రకంగా ఇది గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం సమస్యను నివారిస్తుంది.
మెరుగైన జీర్ణక్రియ
పీచెస్‌లో ఉండే ఫైబర్ మొత్తం జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. తద్వారా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
పోషకాలు సమృద్ధిగా ఉంటాయి
పీచ్ ఫ్రూట్ లో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియంతోపాటు ప్రొటీన్, ఫైబర్, ఫోలేట్, కోలిన్, బీటా కెరోటిన్, విటమిన్-ఎ, విటమిన్-సి వంటి పోషకాలు లభిస్తాయి. ఇది గర్భిణీ స్త్రీ ఆరోగ్యంతో పాటు పిండం అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది.
మెరుగైన రోగనిరోధక శక్తి
పీచ్ ఫ్రూట్ లో ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బలమైన రోగనిరోధక శక్తి అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి గర్బిణీలను కాపాడుతుంది.
ఒక రోజులో ఎన్ని పీచులు తినవచ్చు?
గర్భధారణ సమయంలో, ఒక రోజులో అర కప్పు పీచ్ ఫ్రూట్ ముక్కలను తినవచ్చు, అయితే తినడానికి ముందు తప్పకుండా మీ వైద్యుల సలహా తీసుకోండి.
సంబంధిత కథనం