Fruits for Dinner: డిన్నర్లో కేవలం పండ్లనే తినడం మంచి పద్ధతేనా? ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?-is it a good idea to eat only fruit for dinner how does it affect health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fruits For Dinner: డిన్నర్లో కేవలం పండ్లనే తినడం మంచి పద్ధతేనా? ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

Fruits for Dinner: డిన్నర్లో కేవలం పండ్లనే తినడం మంచి పద్ధతేనా? ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

Haritha Chappa HT Telugu
May 14, 2024 07:00 AM IST

Fruits for Dinner: ఎంతో మంది రాత్రి పూట తేలికపాటి ఆహారాన్ని తినాలని అనుకుంటారు. అందులో భాగంగా కేవలం పండ్లను మాత్రమే తింటూ ఉంటారు. ఇలా దీర్ఘకాలికంగా చేయడం వల్ల పోషకాహార లోపం వస్తుంది.

డిన్నర్లో పండ్లు తినవచ్చా?
డిన్నర్లో పండ్లు తినవచ్చా? (Shutterstock)

బరువు త్వరగా తగ్గేందుకు ఎంతో మంది రాత్రి పూట పండ్లను మాత్రమే తింటూ ఉంటారు. రోటీ,చపాతీ, అన్నం మానేసి కేవలం పండ్లు మాత్రమే తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఎంతో మంటి నమ్మకం. ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన పండ్లు మీ శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి పండ్లు ఆరోగ్యకరమైన ఎంపిక. ఏదేమైనా, అన్నం తినడం మానేసి, ఒక ప్లేట్ నిండా పండ్లు తినడం మంచిదేనా?

yearly horoscope entry point

డిన్నర్‌కు పండ్లు తినడం మంచిదేనా?

బరువు తగ్గేందుకు ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఆహారాన్ని తినేవారు ఎంతోంది. పొట్ట మాడ్చుకుని బరువు తగ్గాలని భావిస్తారు. ఎంతో మంది రాత్రి భోజనం మానేసి ఏమీ తినకుండా ఉంటారు. మరి కొందరు కేవలం పండ్లను మాత్రమే తింటారు. రాత్రి భోజనంలో ఇలా పండ్లు మాత్రమే తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదేనా? ఆహారం తినేటప్పుడు సమతులాహారం ఉండేలా చూసుకోవాలి. కేవలం పండ్లతోనే ఆహారాన్ని ముగించకుండా బరువు పెంచని ఆహారాలను రాత్రి పూట తినడం చాలా అవసరం.

పులావ్, కిచిడీ, డాలియా, చిరుధాన్యాల దోశలు, ఇడ్లీ వంటివి రాత్రి పూట తింటే మంచిది. బరువు తగ్గే అవకాశం ఉంది. తినే ఆహారంలో ప్రోటీన్ కచ్చితంగా ఉండాలి. పండ్లలో కేవలం పిండి పదార్థాలు, సహజ చక్కెర మాత్రమే ఉంటాయి. ప్రొటీన్ లభించదు. కాబట్టి పండ్లు ఒక్కటే రాత్రి భోజనంలో తినడం మంచి అలవాటు కాదు. సాధారణంగా పండ్లను అల్పాహారంలో లేదా సాయంత్రం చిరుతిండిగా తింటే మంచిదని చెబుతున్నా పోషకాహార నిపుణులు. డిన్నర్ లో లేదా లంచ్ లో మాత్రం పండ్లతోనే సరిపెట్టుకోవడం మంచి ఆలోచన కాదు.

తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు… మీరు తినే ఆహారంలో ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి. రాత్రి భోజనంలో పండ్లు తినడం వల్ల పెద్ద నష్టమేమీ లేదు, కానీ దీర్ఘకాలంగా ఇలా ప్రొటీన్ లేని ఆహారం తింటే సమస్యలు రావచ్చు. రాత్రి 7 గంటలకు త్వరగా డిన్నర్ తినేసి, నిద్రపోయే ముందు ఆపిల్ లేదా నట్స్ తీసుకోవడం మంచి పద్దతి,.

ఆరోగ్యకరమైన డిన్నర్ ఎంపికలు

మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. పోషకాలు అందకపోతే జుట్టు రాలడం, చర్మం పాలిపోవడం, ఎముకలు బలహీనంగా మారడం వంటివి కలుగుతాయి. రాత్రి పూట కింద ఇచ్చిన ఆహారం తినేందుకు ప్రయత్నిస్తే పోషకాహార లోపం రాకుండా ఉంటుంది.

  • కిచిడీ - కూర
  • పప్పు - అన్నం
  • మిల్లెట్ కిచిడీ
  • మిల్లెట్ దోశ - సాంబార్
  • ఎగ్ పులావ్
  • ఎగ్ కర్రీ - రైస్
  • చపాతీ - కూర
  • రోటీ, - కూర

Whats_app_banner