Bad cholesterol: మీ ముఖంపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయినట్టే
Bad cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం చాలా ప్రమాదకరం. ఇలా చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతే ముఖంపై కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. అలా కనిపిస్తే వెంటనే తగిన చికిత్సలు తీసుకోవాలి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ప్రమాదకరమైన సంకేతం. దీని వల్ల ఎన్నో హానికరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండె పోటు, బ్రెయిన్ స్టోక్ వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండె పోటు కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్‌డీఎల్ అంటారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుందని సూచించే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలను సరైన సమయంలో గుర్తిస్తే జీవనశైలి, ఆహార మార్పుల ద్వారా వాటిని నియంత్రించవచ్చు. కాబట్టి ముఖంపై కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ముఖంపై కనిపించే లక్షణాలు ఇవే
ముఖంపై చర్మం పసుపు రంగులోకి మారితే దానికి కారణం రక్త ప్రసరణ లేకపోవడమే అని అర్థం చేసుకోవాలి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే రక్తప్రసరణ జరగకుండా అడ్డుకుంటుంది. ఇలా చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతే చర్మంపై పసుపు రంగు కనిపించడం ప్రారంభమవుతుంది.
ముఖంపై చిన్న చిన్న గడ్డలు కనిపిస్తాయి. అవి ఎలాంటి నొప్పి రావు. వాటంతట అవే తగ్గిపోతాయని అనుకుంటారు చాలామంది. సాధారణంగా కళ్ల చుట్టూ ఈ గడ్డలు ఏర్పడుతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను సూచిస్తాయి.
చెడుకొలెస్ట్రాల్ పెరిగినప్పుడు లేత పసుపు రంగు దద్దుర్లు, పసుపు రంగులో ఉన్న మొటిమలు కళ్ల చుట్టూ కనిపిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయిందనడానికి సంకేతంగా భావించాలి.
ముఖంపై వాపుకు అనేక కారణాలు ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు ఈ వాపు చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల కావచ్చు. దీంతో ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. లేదంటే చర్మం పూర్తిగా పొడిబారుతుంది. ఇలా చర్మం పేలవంగా మారితే చెడు కొలస్ట్రాల్ కారణమని అర్థం.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్ పూర్తిగా మానేయాలి. స్వీట్లు తక్కువగా తినాలి. ప్రతి రాత్రి ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను వెంటనే మానేయాలి. వ్యాయామం చేస్తూ శారీరకంగా చురుకుగా ఉండాలి.
చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు నట్స్ తింటూ ఉండాలి. అవిసె గింజలు రోజూ గుప్పెడు తినడం అలవాటు చేసుకోవాలి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. చియా సీడ్స్ ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. నీటిలో చియా సీడ్స్ నానబెట్టి ఆ నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. గుమ్మడి గింజలు, నువ్వుల గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, నల్ల నువ్వులు వంటివి ప్రతి రోజూ మితంగా తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. కాలేయంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతేనే చర్మం పసుపు రంగులోకి మారిపోతుంది. కళ్లల్లో తెలుపు రంగు చుక్కల్లాంటివి కనిపిస్తాయి. అది అలా వదిలేస్తే పచ్చకామెర్లగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంది.
టాపిక్