Diabetes: డయాబెటిస్ ఉంటే పూర్తిగా తెల్ల అన్నాన్ని మానేయక్కర్లేదు, ఇలా వండుకుని తింటే ఏ సమస్యా రాదు-if you have diabetes you dont have to completely avoid white rice it is better to eat it cooked like this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes: డయాబెటిస్ ఉంటే పూర్తిగా తెల్ల అన్నాన్ని మానేయక్కర్లేదు, ఇలా వండుకుని తింటే ఏ సమస్యా రాదు

Diabetes: డయాబెటిస్ ఉంటే పూర్తిగా తెల్ల అన్నాన్ని మానేయక్కర్లేదు, ఇలా వండుకుని తింటే ఏ సమస్యా రాదు

Haritha Chappa HT Telugu
Jul 24, 2024 10:30 AM IST

Diabetes: మధుమేహాన్ని నియంత్రించడానికి, ఊబకాయం సమస్యను ఎదుర్కోవటానికి ఆహారపరంగా అనేక మార్పులు చేసుకోవాలి. ఎంతో మంది అన్నం తినడం మానేసి డయాబెటిస్‌ను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. అన్నం తింటూనే మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు.

డయాబెటిస్ ఉంటే వైట్ రైస్ పూర్తిగా మానేయాలా?
డయాబెటిస్ ఉంటే వైట్ రైస్ పూర్తిగా మానేయాలా? (Shutterstock)

భారతీయుల ప్రధాన ఆహారం వరి. తెల్లన్నంతో తింటేనే భోజనం తిన్నట్టు అనిపిస్తుంది ఎక్కువ మంది ఇండియన్లకు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మూడు పూటలా అన్నం తినే వారు ఉన్నారు. కానీ డయాబెటిస్, అధిక బరువుతో బాధపడేవారు మాత్రం తెల్లన్నం తినడానికి భయపడతారు. మధుమేహం నియంత్రణలో ఉంచాలనే ఉద్దేశంతో అన్నం తినేందుకు ఇష్టపడరు. అలాగే అధిక బరువు బారిన పడిన వారు కూడా తెల్లన్నాన్ని తగ్గిస్తారు. పూర్తిగా తెల్లన్నాన్ని మానేస్తే కొంతమంది నీరసపడిపోతారు. అంతేకాదు అన్నాన్ని వండుకోవడం కూడా చాలా సులువు. కాబట్టి అన్నాన్ని తింటూనే డయాబెటిస్, అధిక బరువు సమస్యలను ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలుసుకోండి.

ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ దీక్షా భావ్సర్ అన్నం తింటూనే మధుమేహం అదుపులో ఎలా ఉంచాలో చెబుతున్నారు. అలాగే ప్రత్యేకంగా అన్నాన్ని వండుకుని తినడం వల్ల బరువు కూడా తగ్గుతారని చెబుతున్నారు.

డయాబెటిస్ ఉన్నా అన్నం తినవచ్చా?

ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం డయాబెటిస్ ఉన్నా కూడా అన్నం తినవచ్చు. మీరు డయాబెటిక్ పేషెంట్ అయినా, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నా, పీసీఓఎస్ తో ఇబ్బంది పడుతున్నా, వాతావరణం వల్ల సమస్యలతో బాధపడుతున్నా కూడా తెల్ల అన్నం మానేయాల్సిన అవసరం లేదు. ఆనందంగా అన్నం తినవచ్చు. అయితే, దీనిని సరిగ్గా వండుకుని తినడం చాలా ముఖ్యం.

బియ్యంలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి, అందుకే ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇది కాకుండా, బియ్యం గ్లూటెన్ లేనిది. ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి వంటి అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. అదే సమయంలో అన్నంలో సోడియం పరిమాణం తక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది చాలా మంచిది.

ఆయుర్వేదం చెప్పిన పద్ధతిలో అన్నాన్ని వండితే అది సులభంగా జీర్ణం చేయడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. తద్వారా ప్రేగుల నుండి పోషకాలను రక్తంలోకి, అక్కడి నుండి శరీర కణాలలోకి చేరుస్తుంది. ఆయుర్వేదం ప్రకారం వండడానికి ముందు బియ్యాన్ని వేయించడం ద్వారా లేదా వండేటప్పుడు నీరు అధికంగా వేయడం ద్వారా అన్నాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు.

ఆయుర్వేద పద్ధతిలో బియ్యం వేయించడం ఎలా?

ఇంట్లో ఉన్న బియ్యాన్ని కళాయిలో వేసి చిన్న మంట మీద వేయించాలి. ఇలా వేయించడం వల్ల బియ్యంలో పిండి పదార్ధాల శాతం తగ్గుతుంది. వాటిలో కొన్ని కేరమెలైజ్ చేస్తాయి. ఇది అన్నానికి రుచిని జోడిస్తాయి. వేయించడం ద్వారా పిండి పదార్ధం తగ్గిన తర్వాత, బియ్యం జిగటగా ఉండవు, పొడిపొడిగా ఉడుకుతుంది. ఇలా బియ్యాన్ని వేయించి అన్నం వండుకుని తింటే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి నష్టం ఉండదు. రక్తంలోని చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా ఉంటాయి.

అన్నం వండే విధానం

బియ్యాన్ని ఒకసారి వేయించాక వాటిని కొన్ని నెలల పాటూ వండుకోవచ్చు. ఒక గిన్నెలో ఒక గ్లాసు బియ్యం తీసుకుని, అవి ఉడకడానికి సరిపడా నీటిని వేసుకోవాలి. అందులో ఒక టీస్పూన్ పసుపు, ఉప్పు వేసి అన్నం బాగా ఉడికే వరకు ఉడికించాలి.

నీటిని వడకట్టండి: అన్నం ఉడికాక అదనంగా ఉన్న నీటిని వడకట్టండి. మీరు ఈ నీటిని ఇతర పనులకు ఉపయోగించవచ్చు. మీరు ఈ అన్నాన్ని పప్పు లేదా కూరతో తినవచ్చు. ఇలా తింటే పొట్ట త్వరగా నిండిపోతుంది. కాబట్టి ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు. బరువు తగ్గుతారు.

ఇలా అన్నాన్నివండుకుని తింటే ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు. మీరు సరైన మోతాదులో తింటే, అది మీ చక్కెర స్థాయిని పెంచదు. దీన్ని తినడం వల్ల కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

నిరాకరణ: ఈ వ్యాసంలో పేర్కొన్న పద్ధతి, పద్ధతులు మరియు క్లెయిమ్ లను సూచనలుగా మాత్రమే తీసుకోండి. అటువంటి చికిత్స/ఔషధం/ఆహారం మరియు సలహాను అనుసరించే ముందు డాక్టర్ లేదా నిపుణుడిని సంప్రదించండి.

Whats_app_banner