Aloe Vera For Hair Growth : జుట్టు పెరిగేందుకు కలబందను ఇలా ఉపయోగించాలి-how to use aloe vera for hair growth hair loss prevention white hairs to black hairs ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Aloe Vera For Hair Growth : జుట్టు పెరిగేందుకు కలబందను ఇలా ఉపయోగించాలి

Aloe Vera For Hair Growth : జుట్టు పెరిగేందుకు కలబందను ఇలా ఉపయోగించాలి

Anand Sai HT Telugu
Apr 25, 2023 02:05 PM IST

Aloe Vera For Hair Growth : కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని చాలా రకాలుగా ఉపయోగిస్తారు. చర్మ సంరక్షణకు, జుట్టు పెరుగుదలకూ వాడుతారు. జుట్టుకు కలబందను ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం..

కలబంద
కలబంద

కలబంద గుజ్జులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేద ఔషధాలు, సౌందర్య సాధన ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు చర్మం, వెంట్రుకలకు మేలు చేస్తాయి. అలొవెరా(Aloe Vera)ను ఉపయోగించి వెంట్రుకలు ఒత్తుగా, దృఢంగా పెరిగేలా చేసుకోవచ్చు. కలబందను ఎలా ఉపయోగించాలో చూద్దాం..

కలబంద గుజ్జును జుట్టుకు బాగా రాయాలి. జుట్టు(Hair) కుదుళ్లకు తగిలేలా మర్దనా చేయాలి. తర్వాత కొంతసేపు అలాగే ఉంచేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే.. వెంట్రుకలు బలంగా తయారవుతాయి. జుట్టు పెరుగుతుంది(Hair Growth), చుండ్రు, వెంట్రుకలు రాలిపోవడం సమస్యల నుంచి బయటపడొచ్చు. ఇంట్లో ఉండే అలొవెరా మెుక్క నుంచి గుజ్జు తీసుకుని చేయోచ్చు. లేదంటే.. మార్కెట్లో దొరికే జెల్ నూ వాడవచ్చు.

మరో చిట్కా ఏంటంటే.. అరకప్పు అలొవెరా జెల్‌, పావు కప్పు అల్లం తీసుకుని మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. అది తలకు బాగా పట్టించి కొంత సేపటి తరువాత తలస్నానం(Head bath) చేస్తే మంచిది. వారంలో 2 లేదా 3 సార్లు ఇలా చేయోచ్చు. ఇలా కలబందను ఉపయోగిస్తే.. వెంట్రుకల సమస్యల(Hair Problems) నుంచి బయట పడవచ్చు. జుట్టు ఒత్తుగా మారుతుంది.

ఇంకో చిట్కా ఏంటంటే.. కొబ్బరినూనె(Coconut Oil), అలొవెరా జెల్‌లను కలిపి పాత్రలో తీసుకోవాలి. దానిని బాగా మరిగించాలి. కాసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. మిశ్రమాన్ని చల్లార్చాలి. ఆ తర్వాత ఆయిల్(Oil)ను వాడకట్టి బాటిల్ లో నిల్వ చేసుకోవాలి. తయారైన నూనెను తలస్నానం చేసేందుకు కనీసం మూడు లేదా నాలుగు గంటల ముందు అప్లై చేయాలి. రాత్రి తలకు పెట్టుకుని, మరుసటి రోజు ఉదయం కూడా తలస్నానం చేయోచ్చు. ఇలా చేస్తే.. వెంట్రుకలు బాగా పెరుగుతాయి.

అలొవెరా జెల్(aloe vera gel) అర కప్పు, మూడు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ లను తీసుకుని మిక్సీ పట్టాలి. తర్వాత మిశ్రమాన్ని జుట్టుకు బాగా రాసి మూడు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే.. బాక్టీరియా నశిస్తుంది. చుండ్రు సమస్యల నుంచి బయటపడొచ్చు. జుట్టు బలంగా తయారవుతుంది.

ఎక్కువ కాలం ఒత్తిడి అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు వస్తాయి. ఈ కారణంగా మీ జుట్టు(Hair)పై ప్రభావం ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలడం(Hair Loss) వంటి సమస్యలను చూస్తారు. క్రమక్రమంగా వెంట్రుకలు(Hairs) తెల్లబడటం మెుదలవుతుంది. ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం వలన కూడా జుట్టు సమస్యలు(Hair Problems) వస్తాయి. హెయిర్ ప్రొడక్ట్స్‌(Hair Products)లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.

Whats_app_banner