Ayurvedic Remedies : ఎండతో చర్మం ఎర్రగా, దురదగా మారితే.. ఇలా చేయండి
Ayurvedic Remedies : వేడి రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో చర్మ సమస్యలు అధికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తే.. చర్మాన్ని కాపాడుకోవచ్చు.
కాసేపు ఎండలో ఉంటే.. చర్మం(Skin) ఎర్రగా, పొడిగా, దురదగా మారుతుంది. ఇలా అయితే చర్మానికి వెంటనే చికిత్స అందించాలి. లేదంటే విపరీతమైన నొప్పి(Pain) వస్తుంది. దీనికి చికిత్స చేసేందుకు ఇంట్లో వాటిని ఉపయోగిస్తే చాలు. సన్ బర్న్ అయిన చర్మాన్ని ఉపశమనానికి అనేక ఆయుర్వేద మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
కలబంద(Aloe Vera).. ఇంట్లో ఉండే ఔషధ మొక్క. చర్మం, జుట్టు(Hair)కు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వేసవిలో అలోవెరా జెల్ తో చర్మాన్ని సంరక్షించుకుంటే శరీరం చల్లగా ఉంటుంది. ఎండలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత అలోవెరా జెల్‌ను చర్మంపై అప్లై చేయడం వల్ల సూర్యకిరణాల వల్ల దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.
పుదీనా నూనె(mint oil) చర్మపు చికాకులను తగ్గిస్తుంది. చర్మానికి ఉపశమనం చేస్తుంది. మీరు పని కారణంగా ఎండలో ఉన్న తర్వాత ఇంటికి వచ్చినప్పుడు, మీ చర్మంపై పుదీనా నూనెను అప్లై చేయడం వల్ల మీకు గొప్ప ఉపశమనం లభిస్తుంది.
ప్రాచీన కాలం నుండి కొబ్బరినూనె(Cocount Oil) అనేది చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్నారు. కొబ్బరి నూనె ముఖ్యంగా సన్ బర్న్, దురద, ఎర్రటి చర్మాన్ని ఉపశమనం చేయడానికి సహాయపడుతుంది. దీనికి కారణం వాటి యాంటీ బ్యాక్టీరియల్, చర్మాన్ని మృదువుగా చేసే గుణాలు. మీరు కొబ్బరి నూనెను చర్మానికి ఉపయోగించవచ్చు.
వేసవిలో చర్మాన్ని చల్లగా ఉంచడంలో దోసకాయ సహాయపడుతుంది. నిపుణులు కూడా చర్మం(Skin) చల్లగా, తేమగా ఉండటానికి దోసకాయ రసాన్ని చర్మంపై అప్లై చేయాలని సిఫార్సు చేస్తున్నారు. మీ ఇంట్లో దోసకాయలను ఉంటే, దాని రసాన్ని వడదెబ్బ తగిలిన చర్మంపై, సూర్యరశ్మితో ప్రభావితమైన చర్మంపై రాయండి.
ఈ వేసవి కాలంలో మామిడి, పుచ్చకాయ వంటి పండ్లే కాదు, బొప్పాయి కూడా దొరుకుతుంది. ఇది శరీరానికి, చర్మానికి కూడా మేలు చేస్తుంది. బొప్పాయి పేస్ట్‌ని కొన్ని రోజులు ముఖానికి అప్లై చేస్తే మార్పును మీరే చూడవచ్చు.
స్క్రబ్బింగ్ చేయడం వల్ల చాలా మందికి చర్మం పొడిబారుతుంది. బదులుగా బొప్పాయి ఫేస్ ప్యాక్ వేసుకోండి. ఇది డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఖరీదైన స్క్రబ్ కోసం డబ్బు ఖర్చు చేయకుండా, పండిన బొప్పాయిని మెత్తగా చేసి, చిటికెడు రాళ్ల ఉప్పుతో కలపండి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకుని ఆరిన తర్వాత కడిగేయాలి.
పైన చెప్పినవి సాధారణంగా ఇంట్లోనే ఉంటాయి. మీరు ఎండకు వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు వాటిని ప్రయత్నించండి. వీలైనంత వరకు, వేడిగాలుల సమయంలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య బయటకు వెళ్లడం మానుకోండి.
సంబంధిత కథనం