Coconut Oil Face Masks : ఇదిగో 6 కొబ్బరి నూనె ఫేస్ మాస్క్‌లు.. మీ చర్మం మెరిసిపోతుంది ఇక
Coconut Oil Face Masks : కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. తేమను లాక్ చేయడానికి, చర్మాన్ని మెరిసేలా చేయడానికి చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. కొబ్బరి నూనెతో కొన్ని రకాల ఫేస్ మాస్క్‌లు చేసుకోవచ్చు.
మేకప్ తొలగించడానికి కొబ్బరి నూనె(Coconut Oil)ను కూడా ఉపయోగిస్తారు. కొబ్బరి నూనెతో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నూనెను ఉపయోగించి ఫేస్ మాస్క్‌లు తయారు చేయోచ్చు.
కొబ్బరి నూనె, తేనె ఫేస్ మాస్క్
1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె(Coconut Oil)ను 1 టేబుల్ స్పూన్ పచ్చి తేనె(Honey)తో కలపండి. దీన్ని మీ ముఖంపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
కొబ్బరి నూనె, ఓట్ మీల్ ఫేస్ మాస్క్
1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను 2 టేబుల్ స్పూన్ల ఓట్ మీల్ మిక్స్ చేసి, పేస్ట్ ను మీ ముఖానికి అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. మీ ముఖం మెరిసిపోతుంది.
కొబ్బరి నూనె, పసుపు ఫేస్ మాస్క్
1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెతో 1 టేబుల్ స్పూన్ పసుపు(Turmeric) పొడిని కలపండి. ముఖానికి అప్లై చేసి కొంత సమయం తర్వాత కడిగేయాలి. ముఖం అందంగా కనిపిస్తుంది.
కొబ్బరి నూనె, అలోవెరా ఫేస్ మాస్క్
1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెకు 1 టేబుల్ స్పూన్ అలోవెరా(Aloe Vera) జెల్ కలపాలి. ముఖానికి అప్లై చేసి కొంత సమయం తర్వాత కడిగేయాలి
కొబ్బరి నూనె, దోసకాయ ఫేస్ మాస్క్
1/2 దోసకాయలను పేస్ట్ చేసి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో కలపండి. 15-20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి.
కొబ్బరి నూనె, అరటిపండు ఫేస్ మాస్క్
1/2 పండిన అరటిపండు(Banana)ను మాష్ చేసి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో కలపండి. కొంత సమయం తర్వాత ముఖం కడుక్కోవాలి. కొబ్బరి నూనెతో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చర్మాన్ని కూడా మెరిసేలా చేస్తుంది.
కొబ్బరి నూనె ప్రయోజనాలు
అసంతృప్త కొవ్వుల వలె కాకుండా, కొబ్బరి నూనె అనేది శరీరంలో వైద్యానికి సహాయపడే ఆరోగ్యకరమైన సంతృప్త కొవ్వు. కొబ్బరి నూనెలో 80% పైగా సంతృప్త కొవ్వు ఉంటుంది.
కొబ్బరినూనె యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గించడం వల్ల థైరాయిడ్/జీవక్రియ పనితీరును నెమ్మదింపజేయడానికి దోహదపడుతుంది. ఇంకా యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ గుణాల వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
కొబ్బరి నూనెలో మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCT) మంచి మోతాదులో ఉంటాయి. ఇవి గ్లూకోస్ టాలరెన్స్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఎందుకంటే ఈ MCT లు జీర్ణాశయం నుండి నేరుగా కాలేయంలోకి వెళతాయి, వీటిని విచ్ఛిన్నం చేయడానికి వ్యవస్త్థకు శ్రమ అవసరం లేదు. అవి ఇతర రకాల కొవ్వుల వలె శరీరంలో నిల్వ అవకుండా నేరు శక్తి కోసం వినియోగం జరుగుతాయి.
కొబ్బరి నూనె కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది, కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్‌ను ప్రెగ్నెనోలోన్, ప్రొజెస్టెరాన్‌గా మార్చుతుంది. ఈ క్రమంలో అధిక కొలెస్ట్రాల్‌ను సాధారణ స్థాయికి తగ్గిస్తుంది.