Cholesterol reducing tips: పార్టీ ఉందా పుష్పా.. కొలెస్ట్రాల్‌ కొంప ముంచుతుంది..-know these 5 cholesterol reducing tips including avoid smoking and alcohol ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cholesterol Reducing Tips: పార్టీ ఉందా పుష్పా.. కొలెస్ట్రాల్‌ కొంప ముంచుతుంది..

Cholesterol reducing tips: పార్టీ ఉందా పుష్పా.. కొలెస్ట్రాల్‌ కొంప ముంచుతుంది..

Parmita Uniyal HT Telugu
Dec 22, 2022 08:12 AM IST

Cholesterol reducing tips: క్రిస్మస్, న్యూఇయర్ పండగలొస్తున్నాయి. దావత్‌లు దద్దరిల్లేలా ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ లివర్, గుండె జాగ్రత్త. కొలెస్ట్రాల్‌ కొంపముంచుతుంది.

పండగ సీజన్‌లో కొలెస్ట్రాల్ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి
పండగ సీజన్‌లో కొలెస్ట్రాల్ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి (Pexels)

క్రిస్మస్, సంవత్సరాంతం, నూతన సంవత్సరం, సంక్రాంతి.. ఇలా వరుసగా సెలబ్రేషన్స్ వస్తున్నాయి. హాలిడే సీజన్‌లో మన ఫుడ్ హాబిట్స్ చాలా తేడాగా ఉంటాయి. దావత్‌లకు లెక్కే ఉండదు. జనవరి మొదటి వారంలో ప్రతి 10 మందిలో 9 మందికి చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్‌డీఎల్ లెవెల్స్ అధికంగా ఉన్నట్టు డానిష్ పరిశోధకులు గతంలో తేల్చారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు.. ఇలా వరసగా వచ్చే విందు భోజనాలు మీ గుండెకు, లివర్‌కు ముప్పుతెచ్చిపెడతాయి. ఇలాంటప్పుడే కాస్త జాగ్రత్త పడాలి. ‘హెల్తీ కొలెస్ట్రాల్ లెవెల్స్ గుండె, కాలేయ వ్యాధుల నుంచి కాపాడుతాయి. ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్న వారు తమ ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అధికంగా ఎల్‌డీఎల్ ఉన్న వారికి గుండె జబ్బులు, గుండెపోట్లు, రక్తం గడ్డకట్టడం, రక్తనాళాలు స్థంభించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి..’ అని హెల్త్ ఆస్ట్రానమీ ఫౌండర్, న్యూట్రిషనిస్ట్ కనికా మల్హోత్రా చెప్పారు. కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని జీవనశైలి మార్పులు చేసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించుకోవచ్చని కనికా సూచించారు.

1. Become more active: యాక్టివ్‌గా ఉండాలి

శారీరకంగా చురుగ్గా ఉండడం వల్ల గుండె జబ్బుల నుంచి ముప్పు తగ్గుతుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడానికి దోహదపడుతుంది. కొద్దిగా శారీరక శ్రమ పెరిగినా చాలు మీరు కొలెస్ట్రాల్ లెవెల్స్‌లో మార్పులు గమనిస్తారు.

2. Add fibre to your daily diet: డైట్‌లో ఫైబర్ తప్పనిసరి

ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ వల్ల మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అది గుండెకు మంచి చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటే కొలెస్ట్రాల్‌ను బైల్ ఆమ్లాలను శోషించడం తగ్గుతుంది. లివర్ కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేసేందుకు ఈ బైల్ యాసిడ్స్‌ను ఉపయోగిస్తుంది. ఓట్‌మీల్, చియాసీడ్స్, బీన్స్, చిక్కులు, తృణ ధాన్యాలు, యాపిల్ పండ్లు, అవకాడో, కమలాలు, దలియా ఎక్కువగా ఫైబర్ కలిగి ఉంటాయి.

3. Avoid trans fats: ట్రాన్స్ ఫ్యాట్స్‌ను త్యజించండి

జంతు ఉత్పత్తులు, ప్రాసెస్డ్ మాంసం, రెడ్ మీట్, అధిక కొవ్వు గల డెయిరీ ఉత్పత్తులు చీజ్, బటర్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్, శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని పూర్తిగా దూరం పెట్టాలి.

4. Quit smoking: స్మోకింగ్ ఆపేయండి

స్మోకింగ్ ఆపేస్తే ఒక వారం వ్యవధిలోనే మంచి కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవుతుంది. ఆపేసిన ఒక గంటలోనే మీ గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. బీపీ తగ్గుతుంది. స్మోకింగ్ ఆపేసిన 3 నెలలకు మీ రక్త ప్రసరణ, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడతాయి.

5. Moderate alcohol consumption: ఆల్కహాల్ తగ్గించండి

కొందరు అదేపనిగా ఉద్యమంలా తాగుతుంటారు. పండగలు, ఈవెంట్ల సాకుతో ఇక ఎత్తితే దించరు. ఒక మోతాదులో తాగితేనే ఆల్కహాల్‌తో ఏ ఇబ్బంది ఉండదు. మితిమీరిన ఆల్కహాల్ మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఆరోగ్యవంతులైన పురుషులు రోజుకు రెండు డ్రింక్స్, మహిళలు ఒక డ్రింక్‌తో పరిమితం చేయాలి. మితిమీరిన మద్యపానం అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా హైబీపీ, డయాబెటిస్, గుండెజబ్బులు, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలకు దారితీస్తుంది.

WhatsApp channel