Skin Bleaching : స్కిన్ బ్లీచింగ్ ప్రమాదకరమా? నిపుణులు ఏం చెబుతున్నారు?-is skin bleaching good for health skin what expert says ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Skin Bleaching : స్కిన్ బ్లీచింగ్ ప్రమాదకరమా? నిపుణులు ఏం చెబుతున్నారు?

Skin Bleaching : స్కిన్ బ్లీచింగ్ ప్రమాదకరమా? నిపుణులు ఏం చెబుతున్నారు?

HT Telugu Desk HT Telugu
Apr 08, 2023 01:30 PM IST

Skin Bleaching : అందమైన చర్మం కలిగి ఉండాలనేది అమ్మాయిల కల. అందుకోసం బ్యూటీ పార్లర్లకు వెళుతుంటారు. బ్లీచింగ్ పద్ధతి ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలనుకుంటారు. దీని వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుందేమో కానీ చర్మానికి ప్రమాదమా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూడండి.

స్కిన్ కేర్ టిప్స్
స్కిన్ కేర్ టిప్స్

స్కిన్ టోన్ కాంతివంతం కావడానికి బ్లీచింగ్ పద్ధతిని అనుసరిస్తారు.చర్మాన్ని బ్లీచింగ్(Skin Bleaching) చేయడం వల్ల మెలనిన్ గాఢత, ఉత్పత్తి తగ్గుతుంది. మెలనోసైట్స్ అని పిలువబడే కణాల ద్వారా ఉత్పత్తి చేయబడిన వర్ణద్రవ్యం అది. స్కిన్-బ్లీచింగ్ ఉత్పత్తిని అప్లై చేసినప్పుడు, చర్మం(Skin)లోని మెలనోసైట్‌ల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి బ్లీచింగ్ మంచిదా, చర్మానికి ప్రమాదకరమా అని తెలుసుకునే ముందు బ్లీచింగ్ పద్ధతి, దానికి ఉపయోగించే ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం. స్కిన్‌ బ్లీచింగ్‌ కోసం అనేక ఉత్పత్తులు వాడుతున్నారు.

విటమిన్ సి(Vitamin C) మొటిమల వల్ల వచ్చే హైపర్పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తుంది. ఇది మెలనిన్‌కు సంబంధించినది. ఇది మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. నియాసినామైడ్‌ను బ్లీచింగ్ ప్రొడక్ట్‌తో కలిపి చర్మానికి అప్లై చేయడం వల్ల పిగ్మెంటేషన్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. యాంటీ ఆక్సిడెంట్లతో ఉపయోగించే నియాసినామైడ్స్, చర్మం రంగు(Skin Colour)లో హైపర్పిగ్మెంటేషన్ నుండి ఉపశమనం కలిగిస్తాయి.

రెటినోల్స్ చర్మ గాయాలను నయం చేయడంలో సహాయపడతాయి. ఇది మొటిమల తర్వాత మిగిలిపోయిన మచ్చలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. రెటినోల్ వాడకం చర్మ సున్నితత్వాన్ని కలిగిస్తుంది. అందుచేత సన్‌స్క్రీన్ వాడకానికి దూరంగా ఉండకూడదు.

హైడ్రోక్వినోన్.. ఇది వివిధ స్కిన్ బ్లీచింగ్ ఉత్పత్తులలో ఉండే డిపిగ్మెంటేషన్ ఏజెంట్ అవుకోవచ్చు. వారానికి 3 సార్లు స్కిన్ బ్లీచింగ్(Skin Bleaching) చేయడం వల్ల 3 నుంచి 4 నెలల్లో ప్రభావం కనిపిస్తుంది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, బ్లీచింగ్ కూడా ప్రమాదకరం. ఇది చర్మం చికాకు, ఎరుపు, పొడి, చర్మం దెబ్బతినడం వంటి దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది.

పాదరసం చర్మానికి హాని కలిగించే విషపూరిత లోహం. అయితే, ఇది స్కిన్ బ్లీచింగ్ విధానాలలో ఉపయోగించబడుతుంది. ఇది మెలనిన్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. అలాగే స్కిన్ టోన్ పెంచుతుంది.

బ్లీచింగ్ సురక్షితమేనా?

హైపర్ పిగ్మెంటేషన్ కారణంగా బ్లీచింగ్ చేయించుకోవాలనుకునే వారు డెర్మటాలజిస్ట్ ఆమోదించిన పద్ధతులను ఉపయోగించాలి. హానికరమైన ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉండాలి. నిపుణులు బ్లీచింగ్‌కు సంబంధించిన అనేక ఉత్పత్తులను ఉపయోగించడాన్ని నిషేధించారు. ఎందుకంటే అవి చర్మానికి అనేక రకాల ప్రమాదాలను కలిగిస్తాయి.

మెర్క్యురీ టాక్సిన్స్ సాధారణంగా స్కిన్ బ్లీచింగ్ ఉత్పత్తులలో(Skin Bleaching Products) ఉపయోగిస్తారు. పాదరసం విషం ప్రభావాలు.. తిమ్మిరి, అధిక రక్తపోటు, అలసట, సున్నితత్వం, మూత్రపిండాల వైఫల్యం, వణుకు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, చిరాకు వంటి నాడీ సంబంధిత లక్షణాలు ఉంటాయి. చర్మశోథ వల్ల చర్మం ఎర్రబడటం, పొక్కులు, పుండ్లు, పొడి, పొలుసులు, వాపులు ఏర్పడతాయి.

ఓక్రోనోసిస్.. ఇది నీలం-నలుపు వర్ణద్రవ్యం కలిగించే చర్మ వ్యాధి. సాధారణంగా, ఇది హైడ్రోక్వినాన్ కలిగిన స్కిన్ బ్లీచింగ్ క్రీమ్‌ల దీర్ఘకాలిక ఉపయోగం యొక్క సమస్యగా సంభవిస్తుంది. పాదరసం కలిగి ఉన్న స్కిన్ బ్లీచింగ్ క్రీమ్‌లు నెఫ్రోటిక్ సిండ్రోమ్‌తో ముడిపడి ఉండవచ్చు. ఇది మూత్రపిండ రుగ్మత, ఇది మూత్రంలో ఎక్కువ ప్రోటీన్‌ను విసర్జించేలా చేస్తుంది.

WhatsApp channel