Foods For Hair : ఈ సూపర్ ఫుడ్స్ తింటే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది-hair growth tips here s amazing super foods for hair growth ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Foods For Hair : ఈ సూపర్ ఫుడ్స్ తింటే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది

Foods For Hair : ఈ సూపర్ ఫుడ్స్ తింటే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది

Anand Sai HT Telugu
Apr 24, 2023 11:41 AM IST

Foods For Hair Growth : అందంగా కనిపించేందుకు జుట్టు చాలా ముఖ్యం. జుట్టు ఒత్తుగా ఉంటేనే మరింత అందంగా కనిపిస్తాం. అయితే జుట్టు పెరిగేందుకు కొన్ని ఆహారాలు తీసుకోవాలి. చాలా రకాల జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు.

జుట్టు కోసం ఆహారాలు
జుట్టు కోసం ఆహారాలు

ఈ కాలంలో జుట్టు రాలడం(Hair Loss) అనేది పెద్ద సమస్యగా మారింది. వయసుతో సంబంధం లేకుండా.. జుట్టు సమస్యలు(Hair Problems) వస్తున్నాయి. చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఒత్తిడి, ఆందోళన, వాతావరణ కాలుష్యంతోపాటుగా.. తినే ఆహారం(Food) కూడా జుట్టు మీద ప్రభావం చూపిస్తుంది. సరైన పోషకాహారం తీసుకుంటే.. జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు. బయటి ఆహారాలను తగ్గించుకోవాలి.

జుట్టుకు సరైన పోషకాలు అందకుంటే.. జుట్టు(Hair) ఎక్కువగా రాలుతుంది. పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. రోజూ తినే ఆహారంలో వీటిని చేర్చుకోవాలి. జుట్టు రాలడాన్ని తగ్గించి.. ఒత్తుగా, పొడవుగా పెంచే ఈ ఆహారాలను ఏంటో తెలుసుకోండి.

జుట్టు రాలడాన్ని(Hair Loss) తగ్గించడంలో కొబ్బరి(Coconut) మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. కొబ్బరి తీసుకుంటే.. జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టు సమస్యలతో బాధపడేవారు.. నువ్వులు కూడా ఉపయోగపడతాయి. నువ్వుల్లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో జుట్టు రాలడం తగ్గిపోవడమే కాదు.. జుట్టు తెల్లబడటం కూడా నిరోధిస్తాయి.

చియా విత్తనాలు కూడా జుట్టు పెరుగుదలకు(Hair Growth) ఎంతో ఉపయోగరకంగా ఉంటాయి. వీటిలో జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే.. ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. జుట్టు పలచబడడాన్ని తగ్గించి.. జుట్టును ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తాయి. బాదంపప్పు కూడా జుట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం జుట్టు రాల‌డాన్ని తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని(Hair Health) మెరుగుప‌ర‌ుస్తుంది. జుట్టు సంబంధిత స‌మ‌స్యలతో బాధ‌ప‌డే వారు తీసుకోవాల్సిన ఆహారాల్లో మెంతికూర‌, మెంతి గింజ‌లు(Fenugreek Seeds) కూడా ఉన్నాయి.

మెంతుల‌తో జుట్టుకు సంబంధించిన ఇత‌ర సమస్యలు కూడా తగ్గుతాయి. పిస్తా, జ‌న‌ప‌నా గింజ‌లు, అవిసె గింజ‌లు, వాల్ న‌ట్స్, గుమ్మడి గింజ‌లు, పొద్దు తిరుగుడు గింజ‌లను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా జుట్టు ఒత్తుగా అవుతుంది. ఇందులో జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే.. ఎన్నో పోషకాలు ఉన్నాయి. ప్రతీరోజూ ఆహారంలో వీటిని తీసుకుంటే.. జుట్టు రాలడం సమస్య(Hair Loss Problems) నుంచి బయటపడొచ్చు.

ఎక్కువ కాలం ఒత్తిడి అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు వస్తాయి. ఈ కారణంగా మీ జుట్టు(Hair)పై ప్రభావం ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలడం(Hair Loss) వంటి సమస్యలను చూస్తారు. క్రమక్రమంగా వెంట్రుకలు(Hairs) తెల్లబడటం మెుదలవుతుంది. ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం వలన కూడా జుట్టు సమస్యలు(Hair Problems) వస్తాయి. హెయిర్ ప్రొడక్ట్స్‌(Hair Products)లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం