Hair Colour : ప్రెగ్నెన్సీ సమయంలో జుట్టుకు రంగు వేయోచ్చా?-is it safe to colour your hair during pregnancy all you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Colour : ప్రెగ్నెన్సీ సమయంలో జుట్టుకు రంగు వేయోచ్చా?

Hair Colour : ప్రెగ్నెన్సీ సమయంలో జుట్టుకు రంగు వేయోచ్చా?

Anand Sai HT Telugu
Apr 17, 2023 05:02 PM IST

Hair Colour During Pregnancy : కొన్ని కొన్ని ప్రశ్నలు విచిత్రంగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో ఇది చేయోద్దు.. అది చేయోద్దు అని చెబుతుంటారు. కడుపులోని బిడ్డను క్షేమంగా చూసుకునేందుకు తల్లి కూడా అన్నింటి మీద దృష్టిపెడుతుంది. అలాంటి వాటిలో ఒకటి గర్భధారణ సమయంలో జుట్టుకు రంగు వేయడం.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

గర్భంతో ఉన్నప్పుడు చాలా పనులు చేయోద్దు.. ఏది చేసినా.. పెద్దలు పరిశీలిస్తూనే ఉంటారు. ఏయ్ .. ఆ పని చేయోద్దంటే.. ఎందుకు చేస్తున్నావ్ అని అరుస్తారు. అలాంటి కేరింగ్ ఉండాలి. తల్లీబిడ్డ క్షేమంగా ఉండాలంటే.. కొన్ని పాటించాలి తప్పదు. అప్పుడే ఆరోగ్యంగా ఉండే బిడ్డకు మీరు జన్మనిస్తారు. ఇదంతా పక్కన పెడితే.. చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే.. గర్భధారణ సమయంలో హెయిర్ కలర్(Hair Colour) వేసుకోవచ్చా? అందులో రసాయనాలు ఉంటాయి.. ఏం కాదా ? అని అడుగుతుంటారు.

గర్భధారణ(pregnancy) సమయంలో జుట్టుకు రంగు వేయోచ్చా? అనేది ఒక గమ్మత్తైన ప్రశ్న. చాలా మంది మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు తమ జుట్టు(Hair)కు రంగు వేసుకుంటే బిడ్డకు జరిగే హాని గురించి ఆందోళన చెందుతారు. అసలు విషయం ఏంటంటే.. హెయిర్ డై(hair dye)ని గర్భధారణ సమయంలో ఉపయోగించడం సురక్షితమే అని నిపుణులు చెబుతున్నారు. హెయిర్ డైలో ఉండే రసాయనాలు చర్మంలోకి చొచ్చుకుపోయి బిడ్డకు చేరగలవని భావించడమే.. ఇందులోని అసలు భయం.

గర్భధారణ సమయంలో జుట్టుకు రంగు వేయడం వల్ల మీ బిడ్డకు ఏదైనా హాని కలుగుతుందని శాస్త్రీయ ఆధారాలు లేవు. హెయిర్ డైలోని రసాయనాలు హానిని కలిగిస్తాయని నిరూపించబడనప్పటికీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే.. ఆ సమయంలో కేర్ గా ఉండటం అనేది చాలా ముఖ్యం. అందుకే జాగ్రత్తలు తప్పనిసరి.

అమెరికన్ ప్రెగ్నెన్సీ అసోసియేషన్.. గర్భిణులు తమ జుట్టుకు రంగు వేయడానికి మొదటి త్రైమాసికం వేచి ఉండాలని సిఫార్సు చేస్తోంది. ఎందుకంటే ఇది శిశువు ప్రధాన అవయవాలు అభివృద్ధి చెందే సమయం. గర్భిణులు(Pregnant) ఏదైనా హెయిర్ డై ఉపయోగించేప్పుడు.. జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. దానిని పూసేటప్పుడు చేతి తొడుగులు ధరించాలి. మాస్క్ కూడా పెట్టుకోవాలి.

గర్భిణులు సెమీ-పర్మనెంట్ లేదా ఫ్లవర్/వెజిటబుల్ ఆధారిత రంగులను ఎంచుకోవాలి. ఎందుకంటే వీటిలో తక్కువ రసాయనాలు ఉంటాయి. హైలైట్‌లు లేదా లోలైట్‌లను ఉపయోగించాలని కూడా సిఫార్సు చేస్తారు. అలెర్జీ లేదని నిర్ధారించుకోవడానికి రంగు వేయడానికి 24 గంటల ముందు ప్యాచ్ పరీక్షను చేయడం మంచిది. అమ్మోనియా, పారాబెన్లు లేని రంగును ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం .

మొత్తంమీద, గర్భధారణ సమయంలో మీ జుట్టుకు రంగు వేయడం సురక్షితం, అయితే తల్లి, బిడ్డ ఇద్దరి భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. రసాయనాలు(Chemicals) ఎక్కువగా ఉండే.. రంగుల జోలికి అస్సలు పోకూడదు. 'సహజ' లేదా 'మూలికా' అని లేబుల్ చేయబడిన జుట్టు రంగులను(Hair Colours) ఉపయోగించమని నిపుణులు సిఫార్సు చేస్తారు. గర్భం మొదటి త్రైమాసికంలో హెయిర్ డైస్‌ని ఉపయోగించకుండా ఉండాలి. బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో కూర్చొని రంగు వేయించుకోవాలి.

WhatsApp channel