baby declared dead, found alive pre-burial: మృత్యుంజయురాలు ఈ నవజాత శిశువు..-preterm baby declared dead at delhi hospital found alive by kin preburial ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Baby Declared Dead, Found Alive Pre-burial: మృత్యుంజయురాలు ఈ నవజాత శిశువు..

baby declared dead, found alive pre-burial: మృత్యుంజయురాలు ఈ నవజాత శిశువు..

HT Telugu Desk HT Telugu
Feb 21, 2023 05:11 PM IST

baby declared dead, found alive pre-burial: నెలలు నిండకముందే పుట్టిన ఒక నవజాత శిశువును డాక్టర్లు చనిపోయిందని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానీ, ఇంటికి తీసుకువెళ్లి, ఖననం చేయడానికి ఏర్పాట్లు చేస్తుండగా, ఆ చిన్నారి ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీ (Delhi)లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. చనిపోయిందననుకుని ఖననానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా, ఆ చిన్నారికి ప్రాణం ఉన్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. దాంతో, వెంటనే మళ్లీ హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం వైద్యులు ఆ చిన్నారికి నియో నేటల్ కేర్ లో చికిత్స అందిస్తున్నారు.

baby declared dead: చనిపోయిందన్నారు..

ఢిల్లీలో నివసించే అబ్దుల్ మాలిక్ భార్య రుక్సానా ఢిల్లీలోని ప్రభుత్వ లోక్ నాయక్ (Lok Nayak Hospital) ఆసుపత్రిలో నెలలు నిండకముందే ఒక శిశువుకు జన్మనిచ్చింది. గర్భంలోనే శిశువు మరణించిందని చెప్పి, వైద్యులు ఆ శిశువును కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒక క్లాత్ లో చుట్టి, కార్డ్ బోర్డ్ బాక్స్ లో పెట్టి ఆ శిశువును ఆస్పత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంటికి తీసుకువచ్చిన తరువాత, దగ్గరి వారికి సమాచారమిచ్చి, ఆ శిశువు ఖననానికి ఏర్పాట్లు చేసుకోసాగారు.

baby declared dead, found alive pre-burial: కార్డ్ బోర్డ్ లో నుంచి సన్నగా ఏడుపు..

ఇంతలో ఆ చిన్నారిని పెట్టిన కార్డ్ బోర్డ్ బాక్స్ లో నుంచి సన్నగా ఏడుపు, చిన్న చిన్న శబ్దాలు వినిపించాయి. దాంతో, వెంటనే కార్డ్ బోర్డ్ బాక్స్ ను ఓపెన్ చేసి చూసిన కుటుంబ సభ్యులకు ఆ చిన్నారి, చేతులు, కాళ్లు ఊపుతూ ప్రాణాలతో కనిపించింది. దాంతో, కుటుంబ సభ్యులు మళ్లీ హుటాహుటిన ఆ పాపను లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే, నియో నేటల్ కేర్ లో ఉంచి ఆ చిన్నారికి చికిత్స అందించడం ప్రారంభించారు.

Doctor's explanation: వైద్యుల వివరణ

ఈ ఘటనపై లోక్ నాయక్ ఆసుపత్రి (Lok Nayak Hospital) మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ వివరణ ఇచ్చారు. వివిధ కారణాల 24 వారాల పైన గర్భం నిలుపుకోలేని వారి గర్భస్థ శిశువు మరణించే అవకాశాలే ఎక్కువని తెలిపారు. అలాగే, రుక్సానా ది 23 వారాల గర్భమేనని, జన్మించిన శిశువు కూడా కేవలం 400 గ్రాముల బరువు మాత్రమే ఉందని, 500 గ్రాముల లోపు బరువున్న పిల్లలు సర్వైవ్ కావడం కష్టమని వివరించారు. ప్రాణాలుండగానే, చనిపోయిందని ఎలా నిర్ధారించారన్న ప్రశ్నకు.. ఇలా 23, 24 వారాల వయస్సుతోనే జన్మించే శిశువులకు ప్రాణం ఉన్నట్లు నిర్ధారించే జీవ లక్షణాలు (signs of life) వెంటనే కనిపించవని, ఈ బేబీకి కూడా పుట్టగానే ఎలాంటి జీవ లక్షణాలు కనిపించలేదని వివరించారు. కొంతమంది పిల్లలకు, అత్యంత అరుదుగా కొన్ని గంటల తరువాత ఈ జీవ లక్షణాలు (signs of life) కనిపిస్తాయని తెలిపారు.

IPL_Entry_Point